తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Indw Vs Ausw: టీమిండియాకు భారీ ఓటమి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

INDW vs AUSW: టీమిండియాకు భారీ ఓటమి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

02 January 2024, 22:24 IST

INDW vs AUSW: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‍లో భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. నేడు (జనవరి 2) మూడో వన్డేలో ఆసీస్ చేతిలో 190 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఓడింది. దీంతో వన్డే సిరీస్‍ను 3-0తో క్లీన్ స్వీప్ చేసేసింది ఆసీస్ మహిళల జట్టు. వివరాలివే..

  • INDW vs AUSW: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‍లో భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. నేడు (జనవరి 2) మూడో వన్డేలో ఆసీస్ చేతిలో 190 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఓడింది. దీంతో వన్డే సిరీస్‍ను 3-0తో క్లీన్ స్వీప్ చేసేసింది ఆసీస్ మహిళల జట్టు. వివరాలివే..
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‍లో భారత మహిళల జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది. నేడు (జనవరి 2) ముంబై వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు పరాభవం ఎదురైంది. 190 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ సిరీస్‍ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. 
(1 / 7)
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‍లో భారత మహిళల జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది. నేడు (జనవరి 2) ముంబై వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు పరాభవం ఎదురైంది. 190 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ సిరీస్‍ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. (PTI)
ఈ మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లకు 338 పరుగుల భారీ స్కోరు చేసింది. 
(2 / 7)
ఈ మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లకు 338 పరుగుల భారీ స్కోరు చేసింది. (PTI)
ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోయెబ్ లిచ్‍ఫీల్డ్ (125 బంతుల్లో 119 పరుగులు) సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ అలీసా హెలీ (82 పరుగులు) అర్ధ శతకంతో మెరిశారు. తొలి వికెట్‍కు వీరు 189 పరుగులు జోడించారు. చివర్లో గార్డెనర్ (30), అలనా కింగ్ (26 నాటౌట్) వేగంగా ఆడటంతో ఆసీస్‍కు భారీ స్కోరు దక్కింది.  
(3 / 7)
ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోయెబ్ లిచ్‍ఫీల్డ్ (125 బంతుల్లో 119 పరుగులు) సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ అలీసా హెలీ (82 పరుగులు) అర్ధ శతకంతో మెరిశారు. తొలి వికెట్‍కు వీరు 189 పరుగులు జోడించారు. చివర్లో గార్డెనర్ (30), అలనా కింగ్ (26 నాటౌట్) వేగంగా ఆడటంతో ఆసీస్‍కు భారీ స్కోరు దక్కింది.  (PTI)
భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ మూడు, అమన్‍జోత్ కౌర్ రెండు, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్లు తీశారు. అయితే, ఆస్ట్రేలియా బ్యాటర్ల దూకుడును భారత బౌలర్లు అడ్డుకోలేకపోయారు.
(4 / 7)
భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ మూడు, అమన్‍జోత్ కౌర్ రెండు, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్లు తీశారు. అయితే, ఆస్ట్రేలియా బ్యాటర్ల దూకుడును భారత బౌలర్లు అడ్డుకోలేకపోయారు.(BCCI Women-X)
భారీ లక్ష్యఛేదనలో భారత్ తీవ్రంగా తడబడింది. 32.4 ఓవర్లలో కేవలం 148 పరుగులకే ఆలౌటైంది. ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగులు చేయలేకపోయారు. 
(5 / 7)
భారీ లక్ష్యఛేదనలో భారత్ తీవ్రంగా తడబడింది. 32.4 ఓవర్లలో కేవలం 148 పరుగులకే ఆలౌటైంది. ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగులు చేయలేకపోయారు. (PTI)
భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (29), జెమీమా రోడ్రిగ్స్ (25), దీప్తి శర్మ (25 నాటౌట్) కాసేపు నిలువగా.. మిగిలిన వారు తీవ్రంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జివా వరెహమ్ మూడు, మేగన్ స్కట్, సదర్లాండ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.  
(6 / 7)
భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (29), జెమీమా రోడ్రిగ్స్ (25), దీప్తి శర్మ (25 నాటౌట్) కాసేపు నిలువగా.. మిగిలిన వారు తీవ్రంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జివా వరెహమ్ మూడు, మేగన్ స్కట్, సదర్లాండ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.  (PTI)
ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా మహిళల టీమ్‍పై గెలిచిన భారత జట్టు.. వన్డే సిరీస్‍లో మాత్రం ఘోరంగా విఫలమై మూడు మ్యాచ్‍ల్లోనూ ఓడింది. ఇక తదుపరి ఈ రెండు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. జనవరి 5న తొలి టీ20 జరగనుంది. 
(7 / 7)
ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా మహిళల టీమ్‍పై గెలిచిన భారత జట్టు.. వన్డే సిరీస్‍లో మాత్రం ఘోరంగా విఫలమై మూడు మ్యాచ్‍ల్లోనూ ఓడింది. ఇక తదుపరి ఈ రెండు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. జనవరి 5న తొలి టీ20 జరగనుంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి