తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ambedkar Statue : అదిగదిగో ఆకాశం... అంచులు తాకేలా 'అంబేడ్కరుడు'

Ambedkar Statue : అదిగదిగో ఆకాశం... అంచులు తాకేలా 'అంబేడ్కరుడు'

14 April 2023, 21:34 IST

India's tallest Ambedkar Statue in Hyderabad : హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొలువుదీరాడు.ఈ మేరకు విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సాగరతీరమంతా జైభీమ్ నినాదాలతో మార్మోగింది. కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలను చూడండి.......

  • India's tallest Ambedkar Statue in Hyderabad : హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొలువుదీరాడు.ఈ మేరకు విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సాగరతీరమంతా జైభీమ్ నినాదాలతో మార్మోగింది. కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలను చూడండి.......
భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు.
(1 / 7)
భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు.
అంబేద్క‌ర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. అనంతరం అంబేడ్కర్ చిత్రానికి సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ నివాళులు అర్పించారు.
(2 / 7)
అంబేద్క‌ర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. అనంతరం అంబేడ్కర్ చిత్రానికి సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ నివాళులు అర్పించారు.(facebook)
విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా బౌద్ధ భిక్ష‌వులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. అంబేడ్కర్ విగ్ర‌హంపై  పూలవ‌ర్షం సందర్భంగా…  సీఎం కేసీఆర్ జై భీమ్ అని నిన‌దించారు. 
(3 / 7)
విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా బౌద్ధ భిక్ష‌వులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. అంబేడ్కర్ విగ్ర‌హంపై  పూలవ‌ర్షం సందర్భంగా…  సీఎం కేసీఆర్ జై భీమ్ అని నిన‌దించారు. (facebook)
డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు."అంబేద్క‌ర్ విశ్వ‌మాన‌వుడు. అంబేద్క‌ర్ ప్ర‌తిపాదించిన సిద్ధాంతం విశ్వ‌జ‌నీన‌మైన‌ది. ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో ప‌రిమితమైంది కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అణ‌గారిన జాతుల‌కు ఆశాదీపం అంబేడ్కర్" అని ప్రసంగించారు. 
(4 / 7)
డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు."అంబేద్క‌ర్ విశ్వ‌మాన‌వుడు. అంబేద్క‌ర్ ప్ర‌తిపాదించిన సిద్ధాంతం విశ్వ‌జ‌నీన‌మైన‌ది. ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో ప‌రిమితమైంది కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అణ‌గారిన జాతుల‌కు ఆశాదీపం అంబేడ్కర్" అని ప్రసంగించారు. (facebook)
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ పూర్తికాగా…  మరికొద్దిరోజుల్లోనే తెలంగాణ నూతన సచివాలయం, అమరవీరుల స్మృతివనం కూడా ప్రారంభం కానున్నాయి. 
(5 / 7)
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ పూర్తికాగా…  మరికొద్దిరోజుల్లోనే తెలంగాణ నూతన సచివాలయం, అమరవీరుల స్మృతివనం కూడా ప్రారంభం కానున్నాయి. (facebook)
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు జై భీమ్ నినాదాలతో హోరెత్తిపోయింది.
(6 / 7)
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు జై భీమ్ నినాదాలతో హోరెత్తిపోయింది.(facebook)
హైదరాబాద్ లోని ఈ అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాం ఐకానిక్ సెంటర్ గా మారినట్లు అయింది. చాలా మంది సందర్శించే అవకాశం ఉంది. 
(7 / 7)
హైదరాబాద్ లోని ఈ అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాం ఐకానిక్ సెంటర్ గా మారినట్లు అయింది. చాలా మంది సందర్శించే అవకాశం ఉంది. (facebook)

    ఆర్టికల్ షేర్ చేయండి