తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  India At World Cup: ధోనీ సిక్స్ నుంచి సచిన్ శివ తాండవం వరకు.. వరల్డ్ కప్‌లో టీమిండియా మరుపురాని క్షణాలివే

India at World Cup: ధోనీ సిక్స్ నుంచి సచిన్ శివ తాండవం వరకు.. వరల్డ్ కప్‌లో టీమిండియా మరుపురాని క్షణాలివే

04 October 2023, 15:16 IST

India at World Cup: ధోనీ సిక్స్ నుంచి సచిన్ శివ తాండవం వరకు.. వరల్డ్ కప్‌లో టీమిండియా మరుపురాని క్షణాలు ఎన్నో ఉన్నాయి. గురువారం (అక్టోబర్ 5) నుంచి స్వదేశంలో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ క్షణాలను మరోసారి గుర్తు చేసుకుందాం.

  • India at World Cup: ధోనీ సిక్స్ నుంచి సచిన్ శివ తాండవం వరకు.. వరల్డ్ కప్‌లో టీమిండియా మరుపురాని క్షణాలు ఎన్నో ఉన్నాయి. గురువారం (అక్టోబర్ 5) నుంచి స్వదేశంలో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ క్షణాలను మరోసారి గుర్తు చేసుకుందాం.
India at World Cup: వన్డే వరల్డ్ కప్ ను ఇండియా ఇప్పటి వరకూ రెండుసార్లు గెలిచింది. 1975, 1979లలో జరిగిన తొలి రెండు వరల్డ్ కప్ లలో ఇండియా ప్రభావం ఏమాత్రం లేకపోయినా.. 1983 నుంచి కథ మారిపోయింది. అప్పటి నుంచి 2019 వరకు జరిగిన 10 వరల్డ్ కప్ లలో టీమిండియాకు ఎన్నో మరుపురాని క్షణాలు ఉన్నాయి.
(1 / 6)

India at World Cup: 1983 వరల్డ్ కప్ అందుకున్న అప్పటి టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్. ఒక విధంగా ఇండియన్ క్రికెట్ దశదిశనే మార్చేసిన చారిత్రక విజయం ఇది. అంతకుముందు జరిగిన రెండు వరల్డ్ కప్ లలో ఒకే ఒక్క విజయం సాధించి అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇండియన్ టీమ్.. ఫైనల్లో రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ ను మట్టి కరిపించి వరల్డ్ కప్ గెలిచిన సందర్భం ఇండియన్ క్రికెట్ లో ఎప్పటికీ నిలిచిపోతుంది.
(2 / 6)

India at World Cup: వరల్డ్ కప్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన ఘనత ఇండియన్ బౌలర్ చేతన్ శర్మకే దక్కుతుంది. 1987 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అద్భుతం చేశాడు. అందులోనూ ముగ్గురు బ్యాటర్లనూ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. వరల్డ్ కప్ లో ఇండియన్ ఫ్యాన్స్ కు మరుపు రాని క్షణాల్లో ఇదీ ఒకటి.
(3 / 6)

India at World Cup: 1999 వరల్డ్ కప్ లో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ కొత్త చరిత్రకు నాంది పలికారు. వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ ఇద్దరూ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రెండో వికెట్ కు ఏకంగా 318 పరుగులు జోడించడం విశేషం. వరల్డ్ కప్ లలో ఇప్పటికీ ఈ రికార్డు పదిలంగానే ఉంది.
(4 / 6)

India at World Cup: 2003 వరల్డ్ కప్ లో శివరాత్రి రోజు పాకిస్థాన్ పై సచిన్ టెండూల్కర్ చేసిన శివతాండవాన్ని ఎవరైనా మరచిపోగలరా? వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ లాంటి అరవీర భయంకర బౌలర్లను చిత్తు చిత్తుగా కొడుతూ 98 పరుగులు చేసిన మాస్టర్.. ఇండియాకు మరుపురాని విజయాన్ని అందించాడు.
(5 / 6)

India at World Cup: 2011 వరల్డ్ కప్ గెలిపించడానికి ధోనీ కొట్టిన సిక్స్ కూడా ఇండియన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. వాంఖెడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో విజయానికి 4 పరుగులు అవసరం కాగా.. ధోనీ సిక్స్ తో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను ముగించిన సందర్భం అది. 28 ఏళ్ల తర్వాత ఇండియాను విశ్వవిజేతను చేసిన సిక్స్ కూడా అదే.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి