తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  In Pics: ఉక్రెయిన్ లో డ్యామ్ ధ్వంసం; రష్యానే పేల్చేసిందంటున్న ఉక్రెయిన్

In pics: ఉక్రెయిన్ లో డ్యామ్ ధ్వంసం; రష్యానే పేల్చేసిందంటున్న ఉక్రెయిన్

07 June 2023, 11:20 IST

ఉక్రెయిన్ లో ఒక భారీ డ్యామ్ ధ్వంసమైంది. దాంతో నీరు ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఆరు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. రష్యా ఆధీనంలోని కఖోవ్కా ప్రాంతంలో ఉందీ భారీ డ్యామ్. ఈ డ్యామ్ ను పేల్చేసింది రష్యా దళాలేనని ఉక్రెయిన్, నాటో ఆరోపిస్తోంటే.. అది ఉక్రెయిన్ పనేనని రష్యా ఎదురుదాడి చేస్తోంది.

  • ఉక్రెయిన్ లో ఒక భారీ డ్యామ్ ధ్వంసమైంది. దాంతో నీరు ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఆరు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. రష్యా ఆధీనంలోని కఖోవ్కా ప్రాంతంలో ఉందీ భారీ డ్యామ్. ఈ డ్యామ్ ను పేల్చేసింది రష్యా దళాలేనని ఉక్రెయిన్, నాటో ఆరోపిస్తోంటే.. అది ఉక్రెయిన్ పనేనని రష్యా ఎదురుదాడి చేస్తోంది.
సోవియట్ కాలంలో నిర్మించిన డ్యామ్ ఇది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో రష్యా ఆధీనంలో ఉన్న కఖోవ్కా లో ఉంది. ఈ డ్యామ్ ధ్వంసం కావడంతో దగ్గరల్లోని కఖోవ్కా విద్యుదుత్పత్తి కేంద్రం నీట మునిగింది.
(1 / 5)
సోవియట్ కాలంలో నిర్మించిన డ్యామ్ ఇది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో రష్యా ఆధీనంలో ఉన్న కఖోవ్కా లో ఉంది. ఈ డ్యామ్ ధ్వంసం కావడంతో దగ్గరల్లోని కఖోవ్కా విద్యుదుత్పత్తి కేంద్రం నీట మునిగింది.(twitter )
డ్యామ్ ధ్వంసం కావడంతో నీరు కింది వైపున్న ప్రాంతాలను ముంచేస్తూ ఖేర్సన్ వైపు పరుగులు తీస్తోంది. దాంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
(2 / 5)
డ్యామ్ ధ్వంసం కావడంతో నీరు కింది వైపున్న ప్రాంతాలను ముంచేస్తూ ఖేర్సన్ వైపు పరుగులు తీస్తోంది. దాంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.(twitter)
డ్యామ్ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు పూర్తిగా నీటిలో మునిగాయి. ఆయా ప్రాంతాల ప్రజలకు ఎగువ ప్రాంతాల్లో బస ఏర్పాటు చేశారు.
(3 / 5)
డ్యామ్ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు పూర్తిగా నీటిలో మునిగాయి. ఆయా ప్రాంతాల ప్రజలకు ఎగువ ప్రాంతాల్లో బస ఏర్పాటు చేశారు.(twitter)
ఇది బహుళార్ధ సాధక డ్యామ్. సమీప ప్రాంతాల ప్రజలకు తాగు నీరు, పరీవాహక ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తుంది. అలాగే, దగ్గర్లోని ఝాప్రోరిఝియా అణు విద్యుత్ కేంద్రానికి కూలింగ్ నీటిని సరఫరా చేస్తుంది.
(4 / 5)
ఇది బహుళార్ధ సాధక డ్యామ్. సమీప ప్రాంతాల ప్రజలకు తాగు నీరు, పరీవాహక ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తుంది. అలాగే, దగ్గర్లోని ఝాప్రోరిఝియా అణు విద్యుత్ కేంద్రానికి కూలింగ్ నీటిని సరఫరా చేస్తుంది.(twitter )
డ్యామ్ ధ్వంసానికి కారణమేంటనే విషయం ఇంతవరకు తేలలేదు. డ్యామ్ ను కుట్రపూరితంగా రష్యా దళాలే పేల్చేశాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా మాత్రం ఉక్రెయిన్ వైపే వేలెత్తి చూపుతోంది.
(5 / 5)
డ్యామ్ ధ్వంసానికి కారణమేంటనే విషయం ఇంతవరకు తేలలేదు. డ్యామ్ ను కుట్రపూరితంగా రష్యా దళాలే పేల్చేశాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా మాత్రం ఉక్రెయిన్ వైపే వేలెత్తి చూపుతోంది.(twitter )

    ఆర్టికల్ షేర్ చేయండి