తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఎర్ర కోటపై మువ్వనెల జెండా రెపరెపలు..

ఎర్ర కోటపై మువ్వనెల జెండా రెపరెపలు..

15 August 2023, 10:16 IST

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దిల్లీలో అట్టహాసంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎర్ర కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, సెల్యూట్​ చేశారు.

ఎర్ర కోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో.. పువ్వులతో తయారు చేసిన జీ20 లోగోను ఇలా ప్రదర్శించారు.
(1 / 7)

ఎర్ర కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించే ముందు.. గార్డ్​ ఆఫ్​ హానర్​ను స్వీకరిచారు మోదీ.
(2 / 7)

ఎర్ర కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం.. దేశాభివృద్ధి, మణిపూర్​, మహిలా సాధికారత వంటి అంశాలపై సుదీర్ఘంగా ప్రసగించారు మోదీ.
(3 / 7)

జెండా ఆవిష్కరణ తర్వాత.. ఇలా హెలికాఫ్టర్​ నుంచి పూల వర్షం కురిసింది. మార్క్​ 3 హెలికాఫ్టర్​లో వింగ్​ కమాండర్​ అంబర్​ అగర్వాల్​, స్క్వాడ్రన్​ లీడర్​ హిమాన్షు శర్మలు ఉన్నారు.
(4 / 7)

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వేషధారణ ఎప్పుడు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈసారి రాజస్థానీ స్టైల్​లో రంగురంగుల పగడీ ధరించారు మోదీ.
(5 / 7)

ఎర్ర కోటలో కార్యక్రమానికి ముందు జరిగిన ఏర్పాట్లు. ఇక ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులతో పాటు దాదాపు 1,800మంది అతిథులు పాల్గొన్నారు.
(6 / 7)

ఎర్ర కోటకు వెళ్లేముందు.. రాజ్​ఘాట్​ను సందర్శించారు ప్రధాని మోదీ. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి