తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Weather Updates : తెలంగాణలో మరో 5 రోజులు వానలు..! ఇవాళ కూడా హైదరాబాద్ కు భారీ వర్ష సూచన..!

TS Weather Updates : తెలంగాణలో మరో 5 రోజులు వానలు..! ఇవాళ కూడా హైదరాబాద్ కు భారీ వర్ష సూచన..!

08 May 2024, 10:32 IST

Telangana Rains Updates : తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. మంగళవారం కుండపోత కురవగా.. మరో 5 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.  తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….. 

  • Telangana Rains Updates : తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. మంగళవారం కుండపోత కురవగా.. మరో 5 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.  తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….. 
తెలంగాణలో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
(1 / 7)
తెలంగాణలో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.(photo source from https://unsplash.com/)
తెలంగాణలో మే 11వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ (మే 8) ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
(2 / 7)
తెలంగాణలో మే 11వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ (మే 8) ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. (photo source from https://unsplash.com/)
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావొచ్చని హైదరాబాద్ వాతావరణం కేంద్రం అంచనా వేసింది. గాలి వేగం 30- 40 కి.మీ వేగంతో ఉంటుందని తెలిపింది. ఈదురుగాలుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
(3 / 7)
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావొచ్చని హైదరాబాద్ వాతావరణం కేంద్రం అంచనా వేసింది. గాలి వేగం 30- 40 కి.మీ వేగంతో ఉంటుందని తెలిపింది. ఈదురుగాలుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.(photo source from https://unsplash.com/)
మే 12, 13వ తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. ఈ తేదీల తర్వాత… వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. 
(4 / 7)
మే 12, 13వ తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. ఈ తేదీల తర్వాత… వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. (photo source from https://unsplash.com/)
ఇక ఈ వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం(మే 7) తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో మూడు గంటలకు పైగా  భారీ వర్షం కురిసింది.
(5 / 7)
ఇక ఈ వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం(మే 7) తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో మూడు గంటలకు పైగా  భారీ వర్షం కురిసింది.(photo source from https://unsplash.com/)
ఇవాళ (మే 8) హైదరాబాద్ వెదర్ చూస్తే... ఇవాళ సాయంత్రం నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని, ఆ తర్వాత భారీ వర్షం పడొచ్చని తెలిపింది. 
(6 / 7)
ఇవాళ (మే 8) హైదరాబాద్ వెదర్ చూస్తే... ఇవాళ సాయంత్రం నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని, ఆ తర్వాత భారీ వర్షం పడొచ్చని తెలిపింది. (Twitter)
హైదరాబాద్ నగరంలో ఉపరితల గాలులు దక్షిణ దిశలో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
(7 / 7)
హైదరాబాద్ నగరంలో ఉపరితల గాలులు దక్షిణ దిశలో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.(photo source from https://unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి