తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు!

TS Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు!

06 September 2023, 13:14 IST

Telangana Rains: గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజుల వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.  గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

  • Telangana Rains: గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజుల వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.  గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 7వ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
(1 / 6)
ల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 7వ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.(unsplash.com)
గురువారం( సెప్టెంబర్ 7) పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.
(2 / 6)
గురువారం( సెప్టెంబర్ 7) పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.(unsplash.com)
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(3 / 6)
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(unsplash.com)
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. సెప్టెంబర్ 10వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని అంచనా వేసింది.
(4 / 6)
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. సెప్టెంబర్ 10వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని అంచనా వేసింది.(unsplash.com)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణించే అవకాశముందని ఐఎండి అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి.
(5 / 6)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణించే అవకాశముందని ఐఎండి అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి.(unsplash.com)
రానున్న రెండు రోజులు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ తెలిపింది.
(6 / 6)
రానున్న రెండు రోజులు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ తెలిపింది.(unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి