తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Leopard Spotted Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే చిరుత సంచారం, రంగంలోకి అటవీశాఖ అధికారులు

Leopard Spotted Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే చిరుత సంచారం, రంగంలోకి అటవీశాఖ అధికారులు

28 April 2024, 18:18 IST

Leopard Spotted Shamshabad Airport : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే పై చిరుత కలకలం సృష్టంచింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది రన్ వే పై చిరుతను గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు.

  • Leopard Spotted Shamshabad Airport : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే పై చిరుత కలకలం సృష్టంచింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది రన్ వే పై చిరుతను గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport Runway) రన్ వే పై చిరుత(Leopard) కలకలం సృష్టంచింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది రన్ వే పై చిరుతను గుర్తించారు. 
(1 / 6)
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport Runway) రన్ వే పై చిరుత(Leopard) కలకలం సృష్టంచింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది రన్ వే పై చిరుతను గుర్తించారు. (Pexel)
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై వన్యప్రాణి సిబ్బంది, జూ అధికారులు ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు. చిరుత కోసం రన్ వే పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. 
(2 / 6)
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై వన్యప్రాణి సిబ్బంది, జూ అధికారులు ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు. చిరుత కోసం రన్ వే పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. 
ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్(Shamshabad) పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ప్రహరీ గోడ దూడి ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి ప్రవేశించింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు.
(3 / 6)
ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్(Shamshabad) పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ప్రహరీ గోడ దూడి ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి ప్రవేశించింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు.(Pexel)
చిరుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లు తగలడంతో కంట్రోల్ రూమ్ లో అలారం మోగింది. దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ  అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టు సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్లు గుర్తించారు. 
(4 / 6)

చిరుతతో పాటు రెండు పిల్లలు ఉన్నట్లు ఎయిర్ పోర్టు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. 
(5 / 6)
చిరుతతో పాటు రెండు పిల్లలు ఉన్నట్లు ఎయిర్ పోర్టు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. (Pexel)
చిరుత కదలికలను తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేశారు. గతంలో ఒకసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత కలకలం రేపింది. తాజాగా ఇప్పుడు మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించారు.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి