తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Monsoon Rains : తెలంగాణకు ఐఎండీ చల్లటి కబురు, ఈ ఏడాది అధిక వర్షాలు-జూన్ 8, 11 మధ్య రుతుపవనాల ఎంట్రీ

TS Monsoon Rains : తెలంగాణకు ఐఎండీ చల్లటి కబురు, ఈ ఏడాది అధిక వర్షాలు-జూన్ 8, 11 మధ్య రుతుపవనాల ఎంట్రీ

17 April 2024, 16:13 IST

TS Monsoon Rains : తెలంగాణకు వాతావరణ శాఖ(IMD) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు జూన్ 8-11 తేదీల మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంటున్నారు.

  • TS Monsoon Rains : తెలంగాణకు వాతావరణ శాఖ(IMD) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు జూన్ 8-11 తేదీల మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంటున్నారు.
తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వానాకాలంలో(TS Monsoon Rains) రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం(Above Normal Raifall) నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. అంటే దీర్ఘకాల సగటులో 104% కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
(1 / 6)
తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వానాకాలంలో(TS Monsoon Rains) రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం(Above Normal Raifall) నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. అంటే దీర్ఘకాల సగటులో 104% కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. (Unsplash)
తూర్పు తెలంగాణ జిల్లాలు- ఉమ్మడి ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండతో పాటు సూర్యాపేట, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు అధిక వర్షపాతం రికార్డు అవుతుందని తెలిపింది. 
(2 / 6)
తూర్పు తెలంగాణ జిల్లాలు- ఉమ్మడి ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండతో పాటు సూర్యాపేట, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు అధిక వర్షపాతం రికార్డు అవుతుందని తెలిపింది. (Unsplash)
ఈ ఏడాది జూన్‌-సెప్టెంబరు మధ్య వర్షపాతంపై(TS Monsoon Rains) హైదరాబాద్‌ వాతావరణశాఖ నివేదిక విడుదల చేసింది. ఎల్‌నినో(El Nino) పరిస్థితులు జూన్‌ నెల నాటికి బలహీనపడి లానినా(La Nina) పరిస్థితులు జులై నెల నాటికి పుంజుకుంటాయని తెలిపింది.  
(3 / 6)
ఈ ఏడాది జూన్‌-సెప్టెంబరు మధ్య వర్షపాతంపై(TS Monsoon Rains) హైదరాబాద్‌ వాతావరణశాఖ నివేదిక విడుదల చేసింది. ఎల్‌నినో(El Nino) పరిస్థితులు జూన్‌ నెల నాటికి బలహీనపడి లానినా(La Nina) పరిస్థితులు జులై నెల నాటికి పుంజుకుంటాయని తెలిపింది.  (Unsplash)
జూన్ 8-11 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. జూన్ లో రుతుపవనాల వర్షాలు ప్రారంభం అయ్యి జులైలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
(4 / 6)
జూన్ 8-11 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. జూన్ లో రుతుపవనాల వర్షాలు ప్రారంభం అయ్యి జులైలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. (Unsplash)
నైరుతి రుతుపవనాల(south west monsoon) ప్రభావంతో రాష్ట్రంలో ఆగస్టులో సాధారణ వర్షపాతం, సెప్టెంబరులో అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు.  హిందూ మహాసముద్రంలో ద్విధ్రువ పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షాకాలంలో సానుకూల పరిస్థితులు ఉంటాయని తెలుస్తోంది.  
(5 / 6)
నైరుతి రుతుపవనాల(south west monsoon) ప్రభావంతో రాష్ట్రంలో ఆగస్టులో సాధారణ వర్షపాతం, సెప్టెంబరులో అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు.  హిందూ మహాసముద్రంలో ద్విధ్రువ పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షాకాలంలో సానుకూల పరిస్థితులు ఉంటాయని తెలుస్తోంది.  (Unsplash)
ప్రస్తుతం రాష్ట్రంలో కరవు పరిస్థితులు (TS Draught Conditions)నెలకొన్నాయి. దీనికి గతేడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడం, సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురవడంతో సాగు, తాగు నీటికి ఇబ్బందులు కలిగాయి. రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోయాయి. పంటలు ఎండిపోయి కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు(TS Heavy Rains) కురుస్తాయని వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.  
(6 / 6)
ప్రస్తుతం రాష్ట్రంలో కరవు పరిస్థితులు (TS Draught Conditions)నెలకొన్నాయి. దీనికి గతేడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడం, సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురవడంతో సాగు, తాగు నీటికి ఇబ్బందులు కలిగాయి. రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోయాయి. పంటలు ఎండిపోయి కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు(TS Heavy Rains) కురుస్తాయని వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.  (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి