తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Heeramandi Ott Release: సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండి’ వెబ్ సిరీస్ ఓటీటీలో ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Heeramandi OTT Release: సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండి’ వెబ్ సిరీస్ ఓటీటీలో ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

29 April 2024, 23:49 IST

Heeramandi OTT Release Date: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‍ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ సిరీస్‍ను ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి. మరిన్ని వివరాలు చూడండి.

  • Heeramandi OTT Release Date: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‍ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ సిరీస్‍ను ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి. మరిన్ని వివరాలు చూడండి.
బాలీవుడ్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ రూపొందించారు. ఇప్పటి వరకు ఎన్నో భారీ చిత్రాలను తెరకెక్కించిన భన్సాలీకి ఓటీటీలో ఇది తొలి వెబ్ సిరీస్.
(1 / 5)

హీరామండి వెబ్ సిరీస్‍లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావ్ హైదరీ, రిచా చద్ధా, సంజీదా షేక్, షార్మీన్ సేగర్ ప్రధాన పాత్రలు పోషించారు. 
(2 / 5)

హీరామండి వెబ్ సిరీస్ మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍పామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం, సంగీతం అందించటంతో పాటు భారీ బడ్జెట్‍తో స్వయంగా నిర్మించారు సంజయ్ లీలా భన్సాలీ. 
(3 / 5)

పీరియడ్ డ్రామాగా హీరామండి సిరీస్ రూపొందింది. భారత స్వాతంత్య్రానికి ముందు 1940ల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ ఉంటుంది. హీరామండి అనే రెడ్‍లైట్ ప్రాంతం గురించి, తవైఫ్స్ జీవితాలు, అక్కడి ఆధిపత్య పోరు సహా మరిన్ని అంశాల గురించి ఈ సిరీస్‍లో భన్సాలీ తెరకెక్కించారు.
(4 / 5)

2021లోనే హీరామండి వెబ్ సిరీస్‍ను సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించారు. 2022 జూన్‍లోనే షూటింగ్ మొదలైంది. అయితే, వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు 2024 మే 1వ తేదీన ఈ గ్రాండ్ వెబ్ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍‍కు రానుంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి