తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Guava Side-effects : ఆ సమస్యలున్నవారు జామపండ్లు తినకూడదట.. ఎందుకంటే..

Guava Side-Effects : ఆ సమస్యలున్నవారు జామపండ్లు తినకూడదట.. ఎందుకంటే..

21 January 2023, 19:00 IST

Guava Side-Effects : జామపండంటే చాలామందికి ఇష్టం. పైగా ఇది గొప్ప ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. అయితే కొన్ని సమస్యలున్నవారు జామపండుకి దూరంగా ఉండాలి అంటున్నారు. దాని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Guava Side-Effects : జామపండంటే చాలామందికి ఇష్టం. పైగా ఇది గొప్ప ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. అయితే కొన్ని సమస్యలున్నవారు జామపండుకి దూరంగా ఉండాలి అంటున్నారు. దాని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో జామపండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో అనేక మంచి పోషకాలు ఉన్నాయి. అంతే కాకుండా జామపండు రుచిని కూడా చాలా మంది ఇష్టపడతారు. కానీ జామపండు ఎక్కువగా తింటే అస్సలు మంచిది కాదు అంటున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 9)

జామపండు ఎంత మంచిదో.. దానిలో కొన్ని చెడు విషయాలు కూడా ఉన్నాయి అంటున్నారు. జామపండ్లు ఎక్కువ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటున్నారు. ఎందుకంటే ఇది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందట.
(2 / 9)

జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు చలికాలంలో జామకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమస్య మరింత పెరగవచ్చు. ఇది సమస్యను మరింత పెంచవచ్చు.
(3 / 9)

గర్భిణీ స్త్రీలకు జామ చాలా మేలు చేస్తుంది. కానీ చలికాలంలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి గర్భిణీలు ఈ సమయంలో జామపండ్లను ఎక్కువగా తినకూడదు.
(4 / 9)

జామ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే జామపండు ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్ పెరుగుతుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య పెరుగుతుంది.
(5 / 9)

చలికాలంలో జామపండు ఎక్కువగా తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా పెరుగుతుంది. గుర్తుంచుకోండి. అటువంటి కడుపు సమస్యలు ఉన్నవారు జామపండుకు దూరంగా ఉండాలి.
(6 / 9)

పొట్ట సమస్యలుంటే వేసవిలో జామ వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ చలికాలంలో జామపండు ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పిని నివారించడానికి జామపండును తక్కువ మొత్తంలో తినండి. ఎక్కువగా తినవద్దు.
(7 / 9)

మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో జామపండు సహకరిస్తుంది. అయితే ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు.. లేదా మధుమేహానికి రెగ్యులర్ మందులు వేసుకునే వారు జామపండును తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది షుగర్ లెవల్స్ ను బాగా తగ్గించే అవకాశముంది.
(8 / 9)

జామపండు రక్తపోటును కూడా తగ్గిస్తుంది. కాబట్టి రక్తపోటు తక్కువగా ఉన్నవారు జామపండును తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి