తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  5 Stocks With 50 Percent Growth: ఈ జనవరిలో 50 శాతం పైగా పెరిగిన 6 స్టాక్స్ ఇవి..

5 stocks with 50 percent growth: ఈ జనవరిలో 50 శాతం పైగా పెరిగిన 6 స్టాక్స్ ఇవి..

23 January 2024, 19:28 IST

2024 ప్రారంభం నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. ఒకవైపు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకుంటూనే.. మరోవైపు పాతాళంలోకి పతనమవుతున్నాయి. ఈ ఒడిదుడుకుల్లోనూ ఈ ఐదు స్టాక్స్ ఈ జనవరి నెలలో ఇప్పటివరకు 50 శాతం పైగా వృద్ధి సాధించాయి. 

Salasar Techno Engineering: సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ కంపెనీ స్టాక్స్ గత సంవత్సరం డిసెంబర్‌లో 31%, నవంబర్‌లో 11.3% వృద్ధి సాధించాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఈ స్టాక్ దాదాపు 64% ర్యాలీ చేసింది. గత సంవత్సరం ఈ స్టాక్ 89 శాతానికి పైగా పురోగమించింది. ఈ స్టాక్ జనవరి 23, 2024న దాని రికార్డు గరిష్ట స్థాయి రూ. 112.40 కి చేరుకుంది. సలాసర్ టెక్నో ఇంజినీరింగ్ భారీ ఉక్కు నిర్మాణాలు, టెలికాం, పవర్, రైల్వే తదితర విభిన్న శ్రేణి పరిశ్రమలకు ఉక్కు నిర్మాణాలను, 360-డిగ్రీ EPC పరిష్కారాలను అందిస్తుంది.
(1 / 6)
Salasar Techno Engineering: సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ కంపెనీ స్టాక్స్ గత సంవత్సరం డిసెంబర్‌లో 31%, నవంబర్‌లో 11.3% వృద్ధి సాధించాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఈ స్టాక్ దాదాపు 64% ర్యాలీ చేసింది. గత సంవత్సరం ఈ స్టాక్ 89 శాతానికి పైగా పురోగమించింది. ఈ స్టాక్ జనవరి 23, 2024న దాని రికార్డు గరిష్ట స్థాయి రూ. 112.40 కి చేరుకుంది. సలాసర్ టెక్నో ఇంజినీరింగ్ భారీ ఉక్కు నిర్మాణాలు, టెలికాం, పవర్, రైల్వే తదితర విభిన్న శ్రేణి పరిశ్రమలకు ఉక్కు నిర్మాణాలను, 360-డిగ్రీ EPC పరిష్కారాలను అందిస్తుంది.(AP)
Global Surfaces: గ్లోబల్ సర్ఫేసెస్ స్టాక్స్ గత సంవత్సరం డిసెంబర్‌లో 12.5% పతనం అయ్యాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఈ స్టాక్ 63% పెరిగింది. ఈ స్టాక్ మార్చి 2023లో మార్కెట్లో లిస్ట్ అయింది. జనవరి 20, 2024న సంస్థ షేర్ విలువ రూ. 321 కి చేరింది, గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్ నేచురల్ స్టోన్స్ మైనింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇంజనీర్డ్ క్వార్ట్జ్ మైనింగ్ తదితర కార్యకలాపాల్లో ఉంది.
(2 / 6)

IRFC: ఈ స్టాక్ డిసెంబర్‌లో 12.5% పతనమైంది. 2024 జనవరిలో ఇప్పటివరకు ఈ  రైల్వే స్టాక్ 63% పైగా పెరిగింది. ఇది గత 1 సంవత్సరంలో ఇది 432% పైగా పెరిగింది. ఈ స్టాక్ జనవరి 23, 2024 న దాని రికార్డు గరిష్ట స్థాయి రూ. 192.80 ని తాకింది. మార్చి 28, 2023న ఈ షేర్ విలువ రూ. 25.40 వద్ద 52 వారాల కనిష్ట స్థాయికి చేరింది. ఆ తరువాత పుంజుకుని ఇప్పటివరకు 659% పెరిగింది. ఈ సంస్థ రైల్వే ప్రాజెక్ట్ లకు ఫైనాన్స్ చేస్తుంది. గత వారం దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా రూ. 2 లక్షల కోట్లను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన తొమ్మిదవ భారతీయ PSU సంస్థగా అవతరించింది.
(3 / 6)

RVNL: డిసెంబర్‌లో ఈ స్టాక్ 10.5% పెరిగింది. ఈ రైల్వే స్టాక్ ఈ జనవరిలో ఇప్పటివరకు 59 % పెరిగింది. ఇది గత 1 సంవత్సరంలో 317 % పైగా లాభపడింది. ఈ స్టాక్ జనవరి 23, 2024న దాని రికార్డు గరిష్ట స్థాయి రూ. 345.50ని తాకింది. 52 వారాల కనిష్ట స్థాయి అయిన రూ. 56.05 నుండి 516 % దూసుకెళ్లింది, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకుంటుంది.
(4 / 6)

Oracle Financial Services: ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గత డిసెంబర్‌లో 5%, నవంబర్‌లో 3.4% మాత్రమే వృద్ధి సాధించాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఈ స్టాక్ 54 % పైగా పెరిగింది. గత 1 సంవత్సరంలో, ఈ స్టాక్ 120% పైగా పెరిగింది. ఈ స్టాక్ జనవరి 19, 2024 న తన రికార్డు గరిష్ట స్థాయి రూ. 7,173.40 ని తాకింది. ఫిబ్రవరి 1, 2023న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ. 3,012.25 నుండి 138% పెరిగింది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ.
(5 / 6)

Kamdhenu: కామధేను సంస్థ డిసెంబర్‌లో 27% పెరుగుదలను నమోదు చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 55 % లాభపడింది. గత 1 సంవత్సరంలో, ఈ స్టాక్ 40.5% పెరిగింది. ఈ స్టాక్ జనవరి 23, 2024న దాని రికార్డు గరిష్ట స్థాయి అయిన రూ. 620.05 కి చేరింది. అక్టోబర్ 26, 2023న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ. 259.95 నుండి 138% పెరిగింది. కామధేను లిమిటెడ్ KAMDHENU బ్రాండ్ పేరుతో థర్మో మెకానికల్ ట్రీట్‌మెంట్ (TMT) బార్‌లు, స్ట్రక్చరల్ స్టీల్, పెయింట్‌లు, అనుబంధ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్, పంపిణీ కార్యకలాపాల్లో ఉంది.
(6 / 6)
Kamdhenu: కామధేను సంస్థ డిసెంబర్‌లో 27% పెరుగుదలను నమోదు చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 55 % లాభపడింది. గత 1 సంవత్సరంలో, ఈ స్టాక్ 40.5% పెరిగింది. ఈ స్టాక్ జనవరి 23, 2024న దాని రికార్డు గరిష్ట స్థాయి అయిన రూ. 620.05 కి చేరింది. అక్టోబర్ 26, 2023న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ. 259.95 నుండి 138% పెరిగింది. కామధేను లిమిటెడ్ KAMDHENU బ్రాండ్ పేరుతో థర్మో మెకానికల్ ట్రీట్‌మెంట్ (TMT) బార్‌లు, స్ట్రక్చరల్ స్టీల్, పెయింట్‌లు, అనుబంధ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్, పంపిణీ కార్యకలాపాల్లో ఉంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి