తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Richest Indians List 2024: ముకేశ్ టు మిట్టల్.. ఇండియాలోని టాప్ 10 సంపన్నులు వీరే

Richest Indians List 2024: ముకేశ్ టు మిట్టల్.. ఇండియాలోని టాప్ 10 సంపన్నులు వీరే

04 April 2024, 12:20 IST

Richest Indians List 2024: ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2024 ప్రకారం భారతదేశంలోని 10 మంది అత్యంత సంపన్నుల జాబితా ఇక్కడ ఉంది. ఇందులో తొలి స్థానంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ, పదో స్థానంలో ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్ నిలిచారు.

  • Richest Indians List 2024: ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2024 ప్రకారం భారతదేశంలోని 10 మంది అత్యంత సంపన్నుల జాబితా ఇక్కడ ఉంది. ఇందులో తొలి స్థానంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ, పదో స్థానంలో ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్ నిలిచారు.
భారతదేశం విభిన్నతకు, వైవిధ్యానికి మారుపేరు. సంపద పంపిణీలోనూ ఇది ప్రతిబింబిస్తుంది. పేద, ధనిక వర్గాల మధ్య అంతర రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా, ఫోర్బ్స్ మేగజీన్ భారత్ లోని అత్యంత సంపన్నులైన 10 మంది వివరాలను వెల్లడించింది.
(1 / 11)
భారతదేశం విభిన్నతకు, వైవిధ్యానికి మారుపేరు. సంపద పంపిణీలోనూ ఇది ప్రతిబింబిస్తుంది. పేద, ధనిక వర్గాల మధ్య అంతర రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా, ఫోర్బ్స్ మేగజీన్ భారత్ లోని అత్యంత సంపన్నులైన 10 మంది వివరాలను వెల్లడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ 116 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ ధనవంతుల జాబితా 2024లో అగ్రస్థానంలో నిలిచారు. 
(2 / 11)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ 116 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ ధనవంతుల జాబితా 2024లో అగ్రస్థానంలో నిలిచారు. (File Photo)
ఆ తర్వాత గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.
(3 / 11)
ఆ తర్వాత గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.(PTI)
హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ 36.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.
(4 / 11)
హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ 36.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.
సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ 33.5 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉంది. 
(5 / 11)
సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ 33.5 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉంది. (ANI)
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న దిలీప్ సంఘ్వీ 26.7 బిలియన్ డాలర్ల విలువైన సంపదతో ఐదో స్థానంలో ఉన్నారు. 
(6 / 11)
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న దిలీప్ సంఘ్వీ 26.7 బిలియన్ డాలర్ల విలువైన సంపదతో ఐదో స్థానంలో ఉన్నారు. (HT File Photo)
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు చెందిన సైరస్ పూనావాలా 21.3 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉన్నారు. 
(7 / 11)
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు చెందిన సైరస్ పూనావాలా 21.3 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉన్నారు. (Livemint File Photo)
20.9 బిలియన్ డాలర్ల సంపదతో డీఎల్ఎఫ్ లిమిటెడ్ చీఫ్ కుశాల్ పాల్ సింగ్ ఏడో స్థానంలో నిలిచారు. 
(8 / 11)
20.9 బిలియన్ డాలర్ల సంపదతో డీఎల్ఎఫ్ లిమిటెడ్ చీఫ్ కుశాల్ పాల్ సింగ్ ఏడో స్థానంలో నిలిచారు. (AFP)
కుమార మంగళం బిర్లా 19.7 బిలియన్ డాలర్ల సంపదతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 
(9 / 11)
కుమార మంగళం బిర్లా 19.7 బిలియన్ డాలర్ల సంపదతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. (YouTube/@IIT Bombay Official Channel)
డీ మార్ట్ స్టోర్స్ యాజమాన్య సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ను స్థాపించిన రాధాకిషన్ దమానీ 17.6 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. 
(10 / 11)
డీ మార్ట్ స్టోర్స్ యాజమాన్య సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ను స్థాపించిన రాధాకిషన్ దమానీ 17.6 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. (Livemint)
ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ మిట్టల్ 16.4 బిలియన్ డాలర్ల సంపదతో టాప్ టెన్ లో నిలిచారు. 
(11 / 11)
ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ మిట్టల్ 16.4 బిలియన్ డాలర్ల సంపదతో టాప్ టెన్ లో నిలిచారు. (REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి