తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jasprit Bumrah: నాలుగో టెస్టు కూడా ఆడాలనుకున్న బుమ్రా.. కానీ!

Jasprit Bumrah: నాలుగో టెస్టు కూడా ఆడాలనుకున్న బుమ్రా.. కానీ!

21 February 2024, 19:02 IST

Jasprit Bumrah - IND vs ENG: ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍‍లో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా విజృంభించాడు. మూడో టెస్టుల్లోనూ అదరగొట్టాడు. అయితే, నాలుగో టెస్టుకు మాత్రం సెలెక్టర్లు అతడికి రెస్ట్ ఇచ్చారు.

  • Jasprit Bumrah - IND vs ENG: ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍‍లో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా విజృంభించాడు. మూడో టెస్టుల్లోనూ అదరగొట్టాడు. అయితే, నాలుగో టెస్టుకు మాత్రం సెలెక్టర్లు అతడికి రెస్ట్ ఇచ్చారు.
స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. టీమిండియా విజయాల్లో స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఫ్లాట్ పిచ్‍లపై తన పేస్ ప్రతిభతో సత్తాచాటాడు. 
(1 / 6)
స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. టీమిండియా విజయాల్లో స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఫ్లాట్ పిచ్‍లపై తన పేస్ ప్రతిభతో సత్తాచాటాడు. (PTI)
ఇంగ్లండ్‍తో సిరీస్‍లో మూడు టెస్టుల్లో 17 వికెట్లను పడగొట్టాడు బుమ్రా. లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లను దక్కించుకొని భారత్ గెలుపుకు బాటలు వేశాడు. 
(2 / 6)
ఇంగ్లండ్‍తో సిరీస్‍లో మూడు టెస్టుల్లో 17 వికెట్లను పడగొట్టాడు బుమ్రా. లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లను దక్కించుకొని భారత్ గెలుపుకు బాటలు వేశాడు. (REUTERS)
అయితే, రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న నాలుగో టెస్టు కోసం జస్‍ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. ఈ సిరీస్‍లో అన్ని మ్యాచ్‍లు ఆడాలని బుమ్రా కోరుకున్నా.. అతడిని నాలుగో టెస్టు నుంచి తప్పించారు. 
(3 / 6)
అయితే, రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న నాలుగో టెస్టు కోసం జస్‍ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. ఈ సిరీస్‍లో అన్ని మ్యాచ్‍లు ఆడాలని బుమ్రా కోరుకున్నా.. అతడిని నాలుగో టెస్టు నుంచి తప్పించారు. (AP)
వర్క్ లోడ్ మేనేజ్‍మెంట్‍లో భాగంగానే ఇంగ్లండ్‍తో నాలుగో టెస్టుకు బుమ్రాకు టీమ్ మేనేజ్‍మెంట్ రెస్ట్ ఇచ్చింది. శరీరంపై ఒత్తిడి ఎక్కువైతే గాయపడే రిస్క్ ఉంటుందనే భావనతో అతడికి విశ్రాంతినిచ్చింది.
(4 / 6)
వర్క్ లోడ్ మేనేజ్‍మెంట్‍లో భాగంగానే ఇంగ్లండ్‍తో నాలుగో టెస్టుకు బుమ్రాకు టీమ్ మేనేజ్‍మెంట్ రెస్ట్ ఇచ్చింది. శరీరంపై ఒత్తిడి ఎక్కువైతే గాయపడే రిస్క్ ఉంటుందనే భావనతో అతడికి విశ్రాంతినిచ్చింది.(REUTERS)
ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్ తర్వాత ఐపీఎల్ 2024 సీజన్ ఉండనుంది. ఆ తర్వాత జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ప్రపంచకప్‍లో భారత్‍కు బుమ్రా చాలా కీలకం.
(5 / 6)
ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్ తర్వాత ఐపీఎల్ 2024 సీజన్ ఉండనుంది. ఆ తర్వాత జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ప్రపంచకప్‍లో భారత్‍కు బుమ్రా చాలా కీలకం.(AFP)
ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‍కు ముందు వర్క్ లోడ్ తగ్గించేందుకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వడమే మంచిదని భావించి నాలుగో టెస్టుకు బుమ్రాను మేనేజ్‍మెంట్ పక్కన పెట్టింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఐదో టెస్టుకు బుమ్రాను తీసుకోవడంపై నిర్ణయం తీసుకోనుంది. 
(6 / 6)
ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‍కు ముందు వర్క్ లోడ్ తగ్గించేందుకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వడమే మంచిదని భావించి నాలుగో టెస్టుకు బుమ్రాను మేనేజ్‍మెంట్ పక్కన పెట్టింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఐదో టెస్టుకు బుమ్రాను తీసుకోవడంపై నిర్ణయం తీసుకోనుంది. (AP)

    ఆర్టికల్ షేర్ చేయండి