తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ben Stokes 100th Test: వందో టెస్టుకు సిద్ధమైన బెన్ స్టోక్స్.. అతడి పేరిట ఉన్న టెస్టు రికార్డులు ఇవే

Ben Stokes 100th Test: వందో టెస్టుకు సిద్ధమైన బెన్ స్టోక్స్.. అతడి పేరిట ఉన్న టెస్టు రికార్డులు ఇవే

13 February 2024, 20:24 IST

Ben Stokes 100th Test: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. తన 100వ టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. భారత్‍తో రాజ్‍కోట్‍లో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్ స్టోక్స్‌కు వందో టెస్టు కానుంది. 

  • Ben Stokes 100th Test: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. తన 100వ టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. భారత్‍తో రాజ్‍కోట్‍లో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్ స్టోక్స్‌కు వందో టెస్టు కానుంది. 
ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్.. తన కెరీర్లో మరో మైలురాయి చేరనున్నాడు. 100వ టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. భారత్‍తో రాజ్‍కోట్‍లో ఫిబ్రవరి 15వ తేదీన మొదలుకానున్న మ్యాచ్‍.. స్టోక్స్‌కు సెంచరీ టెస్టుగా ఉండనుంది. 
(1 / 7)
ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్.. తన కెరీర్లో మరో మైలురాయి చేరనున్నాడు. 100వ టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. భారత్‍తో రాజ్‍కోట్‍లో ఫిబ్రవరి 15వ తేదీన మొదలుకానున్న మ్యాచ్‍.. స్టోక్స్‌కు సెంచరీ టెస్టుగా ఉండనుంది. (AFP)
2013లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు బెన్ స్టోక్స్. 
(2 / 7)
2013లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు బెన్ స్టోక్స్. (AP)
2019లో ఆస్ట్రేలియాపై హెడింగ్లేలో స్టోక్స్ చేసిన సెంచరీ టెస్టు క్రికెట్‍లో ఒకానొక బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచింది. 359 పరుగుల ఛేదనలో స్టోక్స్ అజేయంగా 135 పరుగులు చేసి ఇంగ్లండ్‍ను గెలిపించాడు. చివరి వికెట్ అయిన జాక్ లీచ్‍ను మరో ఎండ్‍లో పెట్టుకొని అతడు సెంచరీ చేసి.. ఒంటి చేత్తో జట్టును గెలిపించి.. యాషెస్ సిరీస్‍ సమమయ్యేలా చేశాడు.  
(3 / 7)
2019లో ఆస్ట్రేలియాపై హెడింగ్లేలో స్టోక్స్ చేసిన సెంచరీ టెస్టు క్రికెట్‍లో ఒకానొక బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచింది. 359 పరుగుల ఛేదనలో స్టోక్స్ అజేయంగా 135 పరుగులు చేసి ఇంగ్లండ్‍ను గెలిపించాడు. చివరి వికెట్ అయిన జాక్ లీచ్‍ను మరో ఎండ్‍లో పెట్టుకొని అతడు సెంచరీ చేసి.. ఒంటి చేత్తో జట్టును గెలిపించి.. యాషెస్ సిరీస్‍ సమమయ్యేలా చేశాడు.  (REUTERS)
టెస్టుల్లో అత్యధిక ఆరో వికెట్ భాగస్వామ్యం రికార్డు బెన్ స్టోక్స్ పేరిట ఉంది. 2016లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‍లో ఆరో వికెట్‍కు జానీ బెయిర్ స్టోతో కలిసి 399 పరుగుల పార్ట్‌నర్ షిప్ నెలకొల్పాడు స్టోక్స్. 
(4 / 7)
టెస్టుల్లో అత్యధిక ఆరో వికెట్ భాగస్వామ్యం రికార్డు బెన్ స్టోక్స్ పేరిట ఉంది. 2016లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‍లో ఆరో వికెట్‍కు జానీ బెయిర్ స్టోతో కలిసి 399 పరుగుల పార్ట్‌నర్ షిప్ నెలకొల్పాడు స్టోక్స్. (AFP)
టెస్టు క్రికెట్‍లో అత్యంత వేగంగా 250 పరుగులు చేసిన రికార్డు బెన్ స్టోక్స్ పేరిటే ఉంది. 2016లో దక్షిణాఫ్రికాపై కేప్ టౌన్‍లో 198 బంతుల్లోనే 259 రన్స్ చేశాడు స్టోక్స్. 
(5 / 7)
టెస్టు క్రికెట్‍లో అత్యంత వేగంగా 250 పరుగులు చేసిన రికార్డు బెన్ స్టోక్స్ పేరిటే ఉంది. 2016లో దక్షిణాఫ్రికాపై కేప్ టౌన్‍లో 198 బంతుల్లోనే 259 రన్స్ చేశాడు స్టోక్స్. (ANI)
టెస్టు క్రికెట్‍లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ప్రస్తుతం బెన్ స్టోక్స్ పేరిట ఉంది. ఇప్పటి వరకు టెస్టుల్లో 128 సిక్సర్లు కొట్టాడు స్టోక్స్. 
(6 / 7)
టెస్టు క్రికెట్‍లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ప్రస్తుతం బెన్ స్టోక్స్ పేరిట ఉంది. ఇప్పటి వరకు టెస్టుల్లో 128 సిక్సర్లు కొట్టాడు స్టోక్స్. (ANI)
ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన బెన్ స్టోక్స్ 34.46 యావరేజ్‍తో 6251 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 197 వికెట్లను కూడా అతడు పడగొట్టాడు. ఫిబ్రవరి 15న రాజ్ కోట్‍లో తన వందో టెస్టుకు బరిలోకి దిగనున్నాడు.   
(7 / 7)
ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన బెన్ స్టోక్స్ 34.46 యావరేజ్‍తో 6251 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 197 వికెట్లను కూడా అతడు పడగొట్టాడు. ఫిబ్రవరి 15న రాజ్ కోట్‍లో తన వందో టెస్టుకు బరిలోకి దిగనున్నాడు.   (REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి