తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Budget 2023: బడ్జెట్ సమావేశాల తొలి రోజు చిత్ర మాలిక

Budget 2023: బడ్జెట్ సమావేశాల తొలి రోజు చిత్ర మాలిక

31 January 2023, 19:53 IST

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంబం సందర్భంగా రాష్ట్రపతి హోదాలో పార్లమెంటు ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి గిరిజన మహిళగా నిలిచారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంబం సందర్భంగా రాష్ట్రపతి హోదాలో పార్లమెంటు ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి గిరిజన మహిళగా నిలిచారు.
బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటుకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు.
(1 / 6)
బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటుకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు.(Sanjeev Verma/Hindustan Times)
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో మీడియానుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో భారతదేశ బడ్జెట్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
(2 / 6)
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో మీడియానుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో భారతదేశ బడ్జెట్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.(Sanjeev Verma/Hindustan Times)
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ సామాన్యులు, యువత, మహిళల ఆకాంక్షలు తీర్చేదిగా ఉంటుందని మోదీ తెలిపారు.
(3 / 6)
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ సామాన్యులు, యువత, మహిళల ఆకాంక్షలు తీర్చేదిగా ఉంటుందని మోదీ తెలిపారు.(Sanjeev Verma/Hindustan Times)
పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(4 / 6)
పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(ANI)
కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో వివరించారు. తమది ధైర్యవంతమైన, నిర్ణయాత్మక, సుస్థిర ప్రభుత్వమన్నారు. 
(5 / 6)
కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో వివరించారు. తమది ధైర్యవంతమైన, నిర్ణయాత్మక, సుస్థిర ప్రభుత్వమన్నారు. (ANI)
ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యం కావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ఎంపీలు తొలిరోజు సమావేశాలకు హాజరు కాలేకపోయారు. పార్టీ నేత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ రాష్ట్రపతి ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యారు.
(6 / 6)
ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యం కావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ఎంపీలు తొలిరోజు సమావేశాలకు హాజరు కాలేకపోయారు. పార్టీ నేత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ రాష్ట్రపతి ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యారు.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి