తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hyderabad : ఆసక్తికరంగా భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ టూర్ - కవితతో మంతనాలు, రేపు Kcrతో భేటీ

Hyderabad : ఆసక్తికరంగా భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ టూర్ - కవితతో మంతనాలు, రేపు KCRతో భేటీ

27 July 2023, 22:22 IST

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. నగరం వేదికగా ఉన్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ తో  ఆజాద్ భేటీ కానున్నారు.

  • భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. నగరం వేదికగా ఉన్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ తో  ఆజాద్ భేటీ కానున్నారు.
దాదాపు గంటపాటు కవిత - చంద్రశేఖర్ అజాద్ భేటీ కొనసాగింది. దేశంలోని రాజకీయ విధానాలు, తెలంగాణలో బహుజనులకు దళితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించారు.
(1 / 5)
దాదాపు గంటపాటు కవిత - చంద్రశేఖర్ అజాద్ భేటీ కొనసాగింది. దేశంలోని రాజకీయ విధానాలు, తెలంగాణలో బహుజనులకు దళితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించారు.(twitter)
సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించారు. అంబేద్కర్ కి పుష్పాంజలి ఘటించారు.
(2 / 5)
సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించారు. అంబేద్కర్ కి పుష్పాంజలి ఘటించారు.(twitter)
ఆ తర్వాత వీరిద్దరూ అమర జ్యోతి వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
(3 / 5)
ఆ తర్వాత వీరిద్దరూ అమర జ్యోతి వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ…. నూతన పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని  డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయానికి కూడా అంబేద్కర్‌ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.
(4 / 5)
ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ…. నూతన పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని  డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయానికి కూడా అంబేద్కర్‌ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.
వెనుకబడిన వర్గాల కోసం ఆజాద్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల అండ ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆజాద్ వంటి భావసారూప్యత కలిగిన వారితో తమ కలిసి నడుస్తామని ప్రకటించారు.. కవిత వెంట పలువురు కార్పొరేషన్ల ఛైర్మన్లు కూడా ఉన్నారు. వారిని ఆజాద్ కు పరిచయం చేశారు కవిత.
(5 / 5)
వెనుకబడిన వర్గాల కోసం ఆజాద్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల అండ ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆజాద్ వంటి భావసారూప్యత కలిగిన వారితో తమ కలిసి నడుస్తామని ప్రకటించారు.. కవిత వెంట పలువురు కార్పొరేషన్ల ఛైర్మన్లు కూడా ఉన్నారు. వారిని ఆజాద్ కు పరిచయం చేశారు కవిత.(twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి