తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Nasa Pictures: ఈ వారం అంతరిక్ష అద్భుతాలు..

Best NASA Pictures: ఈ వారం అంతరిక్ష అద్భుతాలు..

14 April 2023, 17:13 IST

ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షప్రేమికులు, ఆస్ట్రో ఫొటోగ్రాఫర్స్ తీసిన ఫొటోస్ లో బెస్ట్ ఫొటోస్ ఎంపిక చేసి నాసా (NASA) ప్రతీ వారం పబ్లిష్ చేస్తుంటుంది. ఈ వారం ఆ అంతరిక్ష అద్భుతాలు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షప్రేమికులు, ఆస్ట్రో ఫొటోగ్రాఫర్స్ తీసిన ఫొటోస్ లో బెస్ట్ ఫొటోస్ ఎంపిక చేసి నాసా (NASA) ప్రతీ వారం పబ్లిష్ చేస్తుంటుంది. ఈ వారం ఆ అంతరిక్ష అద్భుతాలు ఇవే..
Running Chicken Nebula - ఏప్రిల్ 10 న తీసిన IC 2944 ఫొటో ఇది. దీన్ని రన్నింగ్ చికెన్ నెబ్యూలా అని కూడా అంటారు. ఇది సుమారు 6 వేల కాంతి సంవత్సరాల దూరంలో, సెంటార్ నక్షత్ర మండలానికి సమీపంలో ఉంది. ఈ నెబ్యులా లోని అత్యంత కాంతిమంతమైన ప్రదేశం చికెన్ లా కనిపిస్తుండడం వల్ల దీనికి ఈ Running Chicken Nebula అనే పేరు పెట్టారు. 
(1 / 5)
Running Chicken Nebula - ఏప్రిల్ 10 న తీసిన IC 2944 ఫొటో ఇది. దీన్ని రన్నింగ్ చికెన్ నెబ్యూలా అని కూడా అంటారు. ఇది సుమారు 6 వేల కాంతి సంవత్సరాల దూరంలో, సెంటార్ నక్షత్ర మండలానికి సమీపంలో ఉంది. ఈ నెబ్యులా లోని అత్యంత కాంతిమంతమైన ప్రదేశం చికెన్ లా కనిపిస్తుండడం వల్ల దీనికి ఈ Running Chicken Nebula అనే పేరు పెట్టారు. (NASA/Daniel Stern)
Polaris, the North Star - ఏప్రిల్ 11న తీసిన ఫొటో ఇది. పొలారిస్ నక్షత్రం, దాని చుట్టూ నెలకొన్న డస్ట్ ను అద్భుతంగా తీశారు. పొలారిస్ ను నార్త్ స్టార్ లేదా పోల్ స్టార్ అని కూడా అంటారు. ఇది ఉర్సా మైనర్ నక్షత్ర మండలంలో ఉంది. 
(2 / 5)
Polaris, the North Star - ఏప్రిల్ 11న తీసిన ఫొటో ఇది. పొలారిస్ నక్షత్రం, దాని చుట్టూ నెలకొన్న డస్ట్ ను అద్భుతంగా తీశారు. పొలారిస్ ను నార్త్ స్టార్ లేదా పోల్ స్టార్ అని కూడా అంటారు. ఇది ఉర్సా మైనర్ నక్షత్ర మండలంలో ఉంది. (NASA/Javier Zayaz)
Star cloud in the Andromeda Galaxy - ఆండ్రో మీడా గెలాక్సీ లోని నక్షత్రాలు. star cloud NGC 206 గా దీన్ని పిలుస్తారు. ఏప్రిల్ 12న ఈ ఫొటోను తీశారు. ఇది భూమి నుంచి 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఆండ్రో మీడా గెలాక్సీ మన పాలపుంత కన్నా రెండింతలు పెద్దది. 
(3 / 5)
Star cloud in the Andromeda Galaxy - ఆండ్రో మీడా గెలాక్సీ లోని నక్షత్రాలు. star cloud NGC 206 గా దీన్ని పిలుస్తారు. ఏప్రిల్ 12న ఈ ఫొటోను తీశారు. ఇది భూమి నుంచి 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఆండ్రో మీడా గెలాక్సీ మన పాలపుంత కన్నా రెండింతలు పెద్దది. (NASA/Howard Trottier)
Globular star cluster NGC 2419 : NGC 2419 అనే స్టార్ క్లస్టర్ ఫొటొ ను ఏప్రిల్ 13న తీశారు. లింక్స్ నక్షత్ర మండలం సమీపంలో 3 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది.
(4 / 5)
Globular star cluster NGC 2419 : NGC 2419 అనే స్టార్ క్లస్టర్ ఫొటొ ను ఏప్రిల్ 13న తీశారు. లింక్స్ నక్షత్ర మండలం సమీపంలో 3 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది.(NASA/ESA/Hubble)
Fascinating Hamburger Galaxy (April 14) - ఈ NGC 3628 గెలాక్సీ పొటోను ఏప్రిల్ 14న తీశారు. దీని స్పైరల్ షేప్ ఆధారంగా దీన్ని హాంబర్గర్ గెలాక్సీ అని కూడా అంటారు. లియో నక్షత్ర మండలానికి సమీపంలో, భూమికి 35 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఈ గెలాక్సీ ఉంది. 
(5 / 5)
Fascinating Hamburger Galaxy (April 14) - ఈ NGC 3628 గెలాక్సీ పొటోను ఏప్రిల్ 14న తీశారు. దీని స్పైరల్ షేప్ ఆధారంగా దీన్ని హాంబర్గర్ గెలాక్సీ అని కూడా అంటారు. లియో నక్షత్ర మండలానికి సమీపంలో, భూమికి 35 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఈ గెలాక్సీ ఉంది. (NASA/Mike Selby/Mark Hanson)

    ఆర్టికల్ షేర్ చేయండి