తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hyderabad - Ap Flight Charges : సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ - భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

Hyderabad - AP Flight Charges : సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ - భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

11 January 2024, 18:49 IST

Hyderabad - Andhrapradesh Flight Ticket Charges: సంక్రాంతి పండగ వేళ ఏపీకి చెందిన వాళ్లు పెద్ద ఎత్తున సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఫలితంగా బస్సులు, రైళ్లల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. ఇక ఫ్లైట్లలో చూస్తే కూడా అదే పరిస్థితి ఉంది. దీనికితోడు విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి.

  • Hyderabad - Andhrapradesh Flight Ticket Charges: సంక్రాంతి పండగ వేళ ఏపీకి చెందిన వాళ్లు పెద్ద ఎత్తున సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఫలితంగా బస్సులు, రైళ్లల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. ఇక ఫ్లైట్లలో చూస్తే కూడా అదే పరిస్థితి ఉంది. దీనికితోడు విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి.
సంక్రాంతి సంబరం అంటేనే ఆంధ్రప్రదేశ్ అన్నట్లు ఉంటుంది. అలాంటి పండగ సమీపించిన వేళ ప్రజలకు భారీగా తరలివెళ్తున్నారు. కేవలం బస్సు, రైల్వే ప్రయాణికులే కాదు... విమాన ప్రయాణికుల రద్దీ కూడా పెరిగిపోయింది.
(1 / 7)
సంక్రాంతి సంబరం అంటేనే ఆంధ్రప్రదేశ్ అన్నట్లు ఉంటుంది. అలాంటి పండగ సమీపించిన వేళ ప్రజలకు భారీగా తరలివెళ్తున్నారు. కేవలం బస్సు, రైల్వే ప్రయాణికులే కాదు... విమాన ప్రయాణికుల రద్దీ కూడా పెరిగిపోయింది.
సంక్రాంతి పండగ ఎఫెక్ట్ తో ఏపీలోని పలు నగరాలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు.
(2 / 7)
సంక్రాంతి పండగ ఎఫెక్ట్ తో ఏపీలోని పలు నగరాలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు.(unsplash.com)
తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖకు వెళ్లే ఫ్లైట్స్ ధరలు ఆకాశా­న్నంటు­తున్నాయి. ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారికి పెద్దగా ఇబ్బందులు లేకపోగా... ప్రస్తుతం చేసుకునే వారు మాత్రం భారీగానే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
(3 / 7)
తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖకు వెళ్లే ఫ్లైట్స్ ధరలు ఆకాశా­న్నంటు­తున్నాయి. ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారికి పెద్దగా ఇబ్బందులు లేకపోగా... ప్రస్తుతం చేసుకునే వారు మాత్రం భారీగానే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. (unsplash.com)
సాధారణ సమయాల్లో హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి రూ. 3 వేలకు అటు ఇటుగా టికెట్‌ ధరలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ ధరలకు రూ. 11 వేలకు చేరిపోయింది. ఇక విజయవాడకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో  సాధారణ సమయాలతో పోల్చితే వందశాతం అదనంగా టికెట్‌ ధరలు పెరిగాయి.
(4 / 7)
సాధారణ సమయాల్లో హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి రూ. 3 వేలకు అటు ఇటుగా టికెట్‌ ధరలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ ధరలకు రూ. 11 వేలకు చేరిపోయింది. ఇక విజయవాడకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో  సాధారణ సమయాలతో పోల్చితే వందశాతం అదనంగా టికెట్‌ ధరలు పెరిగాయి.(unsplash.com)
మరోవైపు హైదరాబాద్ నుంచి విశాఖవైపు వెళ్లే విమానాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటంతో... టికెట్ ధరలు కొంతమేరకు మాత్రమే పెరిగాయి. ఇటువైపు వెళ్లే ధరలు చూస్తే... రూ 12 నుంచి రూ. 14 వేల లోపు ఉన్నాయి. 
(5 / 7)
మరోవైపు హైదరాబాద్ నుంచి విశాఖవైపు వెళ్లే విమానాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటంతో... టికెట్ ధరలు కొంతమేరకు మాత్రమే పెరిగాయి. ఇటువైపు వెళ్లే ధరలు చూస్తే... రూ 12 నుంచి రూ. 14 వేల లోపు ఉన్నాయి. (unsplash.com)
కర్నూలు, కడప సిటీలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు కూడా పెరిగాయి. తిరుపతి వైపు వెళ్లే వాటి ధరలు కూడా భారీగా పెరిగాయి. సాధారణ సమయాల్లో 3 నుంచి 5 వేల లోపు టికెట్ ధరలు ఉండగా… ప్రస్తుతం మాత్రం రూ. 12 నుంచి 14 వేల లోపు పలుకుతోంది.
(6 / 7)
కర్నూలు, కడప సిటీలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు కూడా పెరిగాయి. తిరుపతి వైపు వెళ్లే వాటి ధరలు కూడా భారీగా పెరిగాయి. సాధారణ సమయాల్లో 3 నుంచి 5 వేల లోపు టికెట్ ధరలు ఉండగా… ప్రస్తుతం మాత్రం రూ. 12 నుంచి 14 వేల లోపు పలుకుతోంది.(unsplash.com)
కర్నూలు, కడప సిటీలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం రూ. 6 నుంచి 9 వేల వరకు టికెట్ ధరలు ఉన్నాయి. 
(7 / 7)
కర్నూలు, కడప సిటీలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం రూ. 6 నుంచి 9 వేల వరకు టికెట్ ధరలు ఉన్నాయి. (unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి