తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి..

Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి..

21 November 2023, 18:30 IST

Hair Care Tips: మీ జుట్టు బలంగా, వత్తుగా పెరగడం లేదని ఆందోళన చెందుతున్నారా? వంటగదిలో ఉన్న ఈ 5 వస్తువులతో పొడవాటి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోండి.

  • Hair Care Tips: మీ జుట్టు బలంగా, వత్తుగా పెరగడం లేదని ఆందోళన చెందుతున్నారా? వంటగదిలో ఉన్న ఈ 5 వస్తువులతో పొడవాటి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోండి.
ఇంట్లో లభించే రసాయనాలు లేని, సహజసిద్ధమైన ఉత్పత్తులు కూడా జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుతాయి. ఇవి సహజంగా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. ఇక్కడ పేర్కొన్న ఈ టిప్స్ తో పొడవైన, అందమైన జుట్టును పొందండి.
(1 / 6)

గ్రీన్ టీ: గ్రీన్ టీ తయారు చేసిన తర్వాత ఆ బ్యాగులను పారేసే బదులు, దాన్ని మళ్లీ ఉపయోగించుకుని ఒత్తుగా జుట్టును పొందవచ్చు. కాబట్టి, మీరు ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగ్‌లను ఒక నిమిషం పాటు నీటిలో ఉడకబెట్టండి. ఆ గోరువెచ్చని నీటిని తలకు పట్టించాలి. సుమారు 45 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు మూలాల నుండి బలోపేతం చేస్తాయి.
(2 / 6)

ఎగ్ మాస్క్: గుడ్డులోని తెల్లసొన తీసుకోండి. దానికి ఒక చెంచా ఆలివ్ ఆయిల్, తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. సుమారు 20 నిమిషాలు వదిలివేయండి. తేలికపాటి షాంపూతో కడగాలి. ప్రొటీన్, ఫాస్పరస్, జింక్, ఐరన్ మొదలైన పోషకాలతో నిండిన ఈ మిశ్రమం మీ జుట్టుకు మంచి పోషణను అందించి, పొడవాటి, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి మీకు సహాయపడుతుంది.
(3 / 6)

మెంతులు: మెంతులు తీసుకుని అందులో నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దానికి కొంచెం పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు తలకు పట్టించాలి. 40 నిమిషాలు వదిలివేయండి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. మెంతులు ప్రోటీన్ మరియు నికోటినిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు మంచిది.
(4 / 6)

ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ రసం జుట్టుకు గొప్పగా ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి దాని నుండి రసాన్ని తీయండి. దీన్ని 20 నిమిషాల పాటు జుట్టుకు పట్టించాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
(5 / 6)

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరచడం ద్వారా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది మీ శిరోజాలను శుభ్రపరుస్తుంది మరియు చుండ్రును దూరం చేస్తుంది. ఇది జుట్టు యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి