తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Asteroids Towards Earth: భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు

Asteroids towards Earth: భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు

24 October 2022, 13:35 IST

Asteroids towards Earth: భూమి వైపు 5 గ్రహశకలాలు వేగంగా దూసుకొస్తున్నాయని నాసా ప్రకటించింది. రానున్న రోజుల్లో భూమికి సమీపంగా రానున్నాయని తెలిపింది. ఈ ఆస్టరాయిడ్స్‌పై నాసా ప్లానిటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ యంత్రాంగం అలెర్ట్ జారీచేసింది.

Asteroids towards Earth: భూమి వైపు 5 గ్రహశకలాలు వేగంగా దూసుకొస్తున్నాయని నాసా ప్రకటించింది. రానున్న రోజుల్లో భూమికి సమీపంగా రానున్నాయని తెలిపింది. ఈ ఆస్టరాయిడ్స్‌పై నాసా ప్లానిటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ యంత్రాంగం అలెర్ట్ జారీచేసింది.
Asteroid 2022 UC7: ఆస్టరాయిడ్ 2022 యూసీ7పై నాసా అలెర్ట్ జారీచేసింది.ఇది భూమి వైపు 35,676 కి.మీ. వేగంతో దూసుకొస్తోందని ప్రకటించింది. ఈరోజు అక్టోబరు 24న భూమికి కేవలం 3,48,000 కి.మీ. సమీపానికి వస్తుందని తెలిపింది. అంటే అది భూమికి చంద్రుడికి ఉన్న దూరంతో సమానం. ఆస్టరాయిడ్ 2022 యూసీ 7 ఒక బస్సు సైజులో 32 ఫీట్లతో ఉంటుందని నాసా తెలిపింది.
(1 / 5)
Asteroid 2022 UC7: ఆస్టరాయిడ్ 2022 యూసీ7పై నాసా అలెర్ట్ జారీచేసింది.ఇది భూమి వైపు 35,676 కి.మీ. వేగంతో దూసుకొస్తోందని ప్రకటించింది. ఈరోజు అక్టోబరు 24న భూమికి కేవలం 3,48,000 కి.మీ. సమీపానికి వస్తుందని తెలిపింది. అంటే అది భూమికి చంద్రుడికి ఉన్న దూరంతో సమానం. ఆస్టరాయిడ్ 2022 యూసీ 7 ఒక బస్సు సైజులో 32 ఫీట్లతో ఉంటుందని నాసా తెలిపింది.(NASA/JPL)
Asteroid 2022 UD7: దాదాపు 72 అడుగుల వెడల్పుతో ఒక భారీ గ్రహశకలం ఈరోజు అక్టోబర్ 24న భూమికి అతి సమీపంలో ప్రయాణిస్తోంది. ఆస్టరాయిడ్ 2022 UD7 అని దీనికి పేరు పెట్టారు.  ఈ గ్రహశకలం 1.2 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. ఇది గంటకు 5,1840 కిలోమీటర్ల వేగంతో భూ గ్రహం వైపు ప్రయాణిస్తోంది.
(2 / 5)
Asteroid 2022 UD7: దాదాపు 72 అడుగుల వెడల్పుతో ఒక భారీ గ్రహశకలం ఈరోజు అక్టోబర్ 24న భూమికి అతి సమీపంలో ప్రయాణిస్తోంది. ఆస్టరాయిడ్ 2022 UD7 అని దీనికి పేరు పెట్టారు. ఈ గ్రహశకలం 1.2 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. ఇది గంటకు 5,1840 కిలోమీటర్ల వేగంతో భూ గ్రహం వైపు ప్రయాణిస్తోంది.(Pixabay)
Asteroid 2022 UH2: 2022 UH2 అనే మరో గ్రహశకలం అక్టోబర్ 24న 2.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి అత్యంత సమీపానికి చేరుకుంటుంది. దాదాపు 35 అడుగుల వెడల్పుతో ఆ గ్రహశకలం భూగ్రహం వైపు గంటకు 42,876 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
(3 / 5)
Asteroid 2022 UH2: 2022 UH2 అనే మరో గ్రహశకలం అక్టోబర్ 24న 2.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి అత్యంత సమీపానికి చేరుకుంటుంది. దాదాపు 35 అడుగుల వెడల్పుతో ఆ గ్రహశకలం భూగ్రహం వైపు గంటకు 42,876 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.(Pixabay)
Asteroid 2005 AZ28  - నాసా ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ ఆస్టరాయిడ్ 2005 AZ28 అనే ఉల్కపై హెచ్చరిక జారీ చేసింది. 150 అడుగుల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం ఈరోజు అంటే అక్టోబర్ 24న భూమికి చాలా దగ్గరగా 4.3 మిలియన్ కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ గ్రహశకలం గంటకు 19,476 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
(4 / 5)
Asteroid 2005 AZ28 - నాసా ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ ఆస్టరాయిడ్ 2005 AZ28 అనే ఉల్కపై హెచ్చరిక జారీ చేసింది. 150 అడుగుల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం ఈరోజు అంటే అక్టోబర్ 24న భూమికి చాలా దగ్గరగా 4.3 మిలియన్ కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ గ్రహశకలం గంటకు 19,476 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.(Pixabay)
Asteroid 2022 UC2 - ఆస్టరాయిడ్ 2022 UC2 అనే పేరుగల గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తోందని, అక్టోబర్ 24న దగ్గరగా వెళుతుందని అంచనా వేసింది. ఈ గ్రహశకలం ఇప్పటికే 28944 కిలోమీటర్ల వేగంతో మన వైపు ప్రయాణిస్తోంది. ఈరోజు భూమికి కేవలం 5.3 మిలియన్ కిలోమీటర్ల దూరానికి సమీపిస్తుందని ప్రకటించింది.
(5 / 5)
Asteroid 2022 UC2 - ఆస్టరాయిడ్ 2022 UC2 అనే పేరుగల గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తోందని, అక్టోబర్ 24న దగ్గరగా వెళుతుందని అంచనా వేసింది. ఈ గ్రహశకలం ఇప్పటికే 28944 కిలోమీటర్ల వేగంతో మన వైపు ప్రయాణిస్తోంది. ఈరోజు భూమికి కేవలం 5.3 మిలియన్ కిలోమీటర్ల దూరానికి సమీపిస్తుందని ప్రకటించింది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి