తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market Live: 14 పైసలు బలపడ్డ రూపాయి.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారంసెన్సెక్స్, నిఫ్టీ సూచీల పురోగమనం
శుక్రవారంసెన్సెక్స్, నిఫ్టీ సూచీల పురోగమనం (PTI)

Stock market live: 14 పైసలు బలపడ్డ రూపాయి.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

25 July 2022, 17:10 IST

  • Stock market live: స్టాక్ మార్కెట్లు గత వారం మదుపరులను ఊరించాయి. ఈవారం ఆరంభంలో ప్రతికూలంగా ప్రారంభమమయ్యాయి.

25 July 2022, 17:10 IST

14 పైసలు బలపడ్డ రూపాయి

సోమవారం యూఎస్ డాలర్‌తో రూపాయి 14 పైసలు పెరిగి 79.76 (తాత్కాలిక) వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 79.86 వద్ద ప్రారంభమైంది. చివరకు 79.76 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది. క్రితం ముగింపు కంటే 14 పైసల పెరుగుదలను నమోదు చేసింది. ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 79.70, కనిష్ట స్థాయి 79.87గా ఉంది. క్రితం సెషన్‌లో అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ 79.90 వద్ద ముగిసింది. డాలర్ ఇండెక్స్ 0.38 శాతం తగ్గి 106.32 వద్ద ఉంది.

25 July 2022, 17:10 IST

Axis Bank Q1 profit: యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రెండింతలు

Axis Bank Q1 profit: యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రెండింతలైంది. గత ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో నికర లాభం రూ. 2,160 కోట్లు ఉండగా, ఇప్పుడది రూ. 4,125 కోట్లకు చేరింది.

25 July 2022, 17:10 IST

జోరు మీదున్న ఐసీఐసీఐ బ్యాంక్ షేరు

ఐసిఐసిఐ బ్యాంక్ జూన్ త్రైమాసిక ఏకీకృత నికర లాభంలో కంపెనీ 55.04 శాతం పెరుగుదలను నివేదించిన తర్వాత సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈలో ఈ షేరు 2.23 శాతం పెరిగి రూ.817.85కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో 2.21 శాతం పెరిగి రూ.817.80కి చేరుకుంది.

‘బ్యాంకింగ్ విభాగంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఫలితాలు అత్యుత్తమంగా ఉన్నాయి. క్రెడిట్ వృద్ధిని పెంచడం, ఆస్తుల నాణ్యతను మెరుగుపరచడం ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్‌కు శుభపరిణామం’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయకుమార్ అన్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం తన జూన్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 7,384.53 కోట్లకు చేరి 55.04 శాతం వృద్ధి సాధించినట్టు నివేదించింది. కేటాయింపులు గణనీయంగా తగ్గడం, వడ్డీ ఆదాయం బలంగా కొనసాగడం దీనికి దోహదపడింది.

మొత్తం రుణాలలో 21 శాతం పెరుగుదల, నికర వడ్డీ మార్జిన్ 3.89 శాతం నుండి 4.01 శాతానికి పెరగడంతో దాని ప్రధాన నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ. 13,210 కోట్లకు చేరుకుంది.

అసెట్ క్వాలిటీ విషయంలో జూన్ 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 3.41 శాతానికి మెరుగుపడింది. 

25 July 2022, 16:56 IST

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రూ. 234.78 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14.2 శాతం వృద్ధితో రూ. 234.78 కోట్లకు చేరింది. ఖర్చులు పెరిగినప్పటికీ మొండి బకాయిల తగ్గుదల ఇందుకు కారణమని సోమవారం నివేదించింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ బ్యాంక్ ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 205.58 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 310.31 కోట్ల నుంచి 24.3 శాతం తగ్గింది.

2021-22 క్యూ 1లో రూ. 6,299.63 కోట్ల నుంచి 2022-23 ఏప్రిల్-జూన్ కాలంలో మొత్తం ఆదాయం రూ. 6,357.48 కోట్లకు స్వల్పంగా పెరిగిందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

25 July 2022, 15:37 IST

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 306.01 పాయింట్లు కోల్పోయి 55,766.22 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 88.45 పాయింట్లు కోల్పోయి  16,631 పాయింట్ల వద్ద స్థిరపడింది.

25 July 2022, 14:26 IST

Canara bank q1 results: క్యూ1లో 72 శాతం పెరిగిన కెనరా బ్యాంక్ నికర లాభం

కెనరా బ్యాంక్ సోమవారం 2022-23 జూన్ త్రైమాసికంలో ఆరోగ్యకరమైన ప్రధాన ఆదాయ వృద్ధి, మొండి బకాయిల తగ్గుదల కారణంగా స్టాండ్ అలోన్ నికర లాభంలో దాదాపు 72 శాతం పెరిగి రూ. 2,022.03 కోట్లకు చేరుకున్నట్టు నివేదించింది.

క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ. 1,177.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏప్రిల్-జూన్ 2022-23లో మొత్తం ఆదాయం రూ. 23,351.96 కోట్లకు పెరిగిందని తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 20,940.28 కోట్లుగా ఉన్నట్టు కెనరా బ్యాంక్ సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది.

ఈ త్రైమాసికంలో వడ్డీ ద్వారా ప్రధాన ఆదాయం 8.3 శాతం పెరిగి రూ.18,176.64 కోట్లకు చేరుకుంది. ఆస్తుల నాణ్యత విషయంలో కెనరా బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (NPA) జూన్ 30, 2022 చివరినాటికి స్థూల అడ్వాన్స్‌లలో 6.98 శాతానికి పడిపోయాయి. జూన్ 2021 చివరి నాటికి 8.50 శాతం ఉండగా ప్రస్తుతం ఇది మెరుగుపడింది.

విలువ పరంగా మొండి బకాయిలు రూ. 58,215.46 కోట్ల నుంచి రూ. 54,733.88 కోట్లకు తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిల నిష్పత్తి 3.46 శాతం (రూ. 22,434 కోట్లు) నుంచి 2.48 శాతానికి (రూ. 18,504.93 కోట్లు) తగ్గింది.

క్యూ 1 ఎఫ్‌వై23కి మొండి బకాయిలు, ఆకస్మిక అవసరాల కోసం ప్రొవిజన్ (పన్ను మినహాయించి) రూ. 3,458.74 కోట్ల నుంచి రూ. 3,690 కోట్లకు పెరిగింది.

కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 88 శాతం పెరిగి రూ. 2,058.31 కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం రూ. 1,094.79 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.23,018.96 కోట్ల నుంచి రూ.23,739.27 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేరు 1.42 శాతం లాభంతో రూ. 232.25 వద్ద ట్రేడవుతోంది.

25 July 2022, 14:25 IST

లాభాల్లో టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్

నేటి స్టాక్ మార్కెట్లో టాటా స్టీల్ 2.43 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.17 శాతంతో లాభాలు సాధించాయి. టాటా స్టీల్ 958.50 వద్ద, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 953.45 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా 3.91 శాతం , మారుతీ సుజుకీ 3.31 శాతం, రిలయన్స్ 3.18 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

25 July 2022, 12:57 IST

Jyothy Labs Q1 Results: జ్యోతి ల్యాబ్స్ క్యూ 1 ఫలితాలు

స్వదేశీ ఎఫ్‌ఎంసిజి సంస్థ జ్యోతి ల్యాబ్స్ సోమవారం ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించింది. జూన్ 30, 2022తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 18.73 శాతం పెరిగి రూ. 47.73 కోట్లకు చేరుకుంది.

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 40.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని జ్యోతి ల్యాబ్స్ సెబీకి సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.

క్వార్టర్ 1లో కార్యకలాపాల ద్వారా జ్యోతి ల్యాబ్స్ ఆదాయం 13.66 శాతం పెరిగి రూ. 597.20 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 525.40 కోట్లుగా ఉంది.

‘మా ఉత్పత్తులకు అవసరమైన ఇన్‌పుట్స్‌కు ఖర్చులు పెరగడంతో లాభదాయకత దెబ్బతింది..’ అని జ్యోతి ల్యాబ్స్ తన ఆదాయ ప్రకటనలో పేర్కొంది.

దీని మొత్తం ఖర్చులు రూ. 479.61 కోట్ల నుండి క్యూ1లో 15.45 శాతం పెరిగి రూ. 553.71 కోట్లుగా ఉన్నాయి.

25 July 2022, 12:35 IST

TATA Housing Q1 Results: టాటా హౌజింగ్ క్యూ1 ఆదాయంలో భారీ పెరుగుదల

టాటా హౌజింగ్ జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఆదాయంలో భారీ పెరుగుదలను నమోదుచేసింది. సేల్స్ 5 రెట్లు పెరగడంతో ఆదాయం రూ. 623 కోట్లకు పెరిగింది.

25 July 2022, 11:58 IST

4 నెలల్లో రూ. 5 వేలు తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు 4 నెలల్లో 10 గ్రాములకు రూ. 5,000 మేర తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన ట్రెండ్‌ను అనుసరించి ఈరోజు భారతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 50,622కి తగ్గగా, వెండి కిలోకు 0.5% తగ్గి రూ. 54,865కి పడిపోయింది. 

25 July 2022, 10:58 IST

Reliance industries: 4 శాతం నష్టపోయిన రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంట్రా డేలో 4 శాతం వరకు నష్టపోయి సూచీలను కిందికి లాగింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,411 వద్ద ట్రేడవుతోంది. క్వార్టర్ 1లో అంచనాలు మిస్సవడంతో ప్రతికూలంగా ట్రేడవుతోంది. ఐటీ రంగంలో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కూడా అంచనాలు మిస్సవడంతో 1.7 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతోంది.

25 July 2022, 10:52 IST

Swearing in ceremony: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

పేద గిరిజనుల ఇంటిలో పుట్టిన ఆడపిల్ల అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకోవడం భారత ప్రజాస్వామ్య శక్తి అని నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన  దౌపది ముర్ము తెలిపారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉదయం 10.15కు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.  

25 July 2022, 10:31 IST

Zomato stock: 14.3 శాతం పడిపోయిన జొమాటో

2021 లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు, ఉద్యోగులు, ఇతర పెట్టుబడిదారులకు ఒక సంవత్సరం లాక్-ఇన్ పీరియడ్ ముగియడంతో భారతీయ ఫుడ్ డెలివరీ కంపెనీ జోమాటో షేర్లు సోమవారం రికార్డు స్థాయిలో 14.3% పడిపోయాయి. జూలై 23, 2021న ముంబై మార్కెట్‌లో అరంగేట్రం చేసిన జొమాటో.. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని షేర్లు వాటి విలువలో 60% కంటే ఎక్కువ కోల్పోయాయి.

25 July 2022, 10:03 IST

సెన్సెక్స్ 428 పాయింట్లు డౌన్

ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 428 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 55,643 వద్ద, నిఫ్టీ 16,599 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

25 July 2022, 10:02 IST

అంచనాలు అందుకోలేకపోయిన ఇన్ఫోసిస్

భారతదేశపు రెండో అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసికంలో నికర లాభం అంచనా వేసిన దానికంటే తక్కువగా 3.2 శాతం మాత్రమే పెరిగింది. పెరుగుతున్న ఖర్చులతో నిర్వహణ మార్జిన్ క్షీణించింది. నికర లాభం రూ. 5,360 కోట్లు‌గా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 5,195 కోట్లుగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

వరుసగా జనవరి-మార్చి త్రైమాసికంలో లాభం రూ. 5,686 కోట్ల నుంచి 5.7 శాతం క్షీణించింది. ఏప్రిల్-జూన్‌లో ఆదాయం 23.6 శాతం పెరిగి రూ. 34,470 కోట్లకు చేరుకుంది.

25 July 2022, 9:27 IST

రంగాల వారీగా మార్కెట్లు (sectorial indices)

sectorial indices: నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫిన్ సర్వ్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రయివేటు బ్యాంక్, నిఫ్టీ కన్జంప్షన్, నిఫ్టీ సర్వీస్ సెక్టార్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే నిఫ్టీ ఆటో, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, ణిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఇన్‌ఫ్రా, నిఫ్టీ కమాడిటీస్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

25 July 2022, 9:27 IST

లాభాల్లో బ్యాంక్ నిఫ్టీ  (Nifty bank)

నిఫ్టీ బ్యాంక్ సూచీ లాభాల్లో ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.85 శాతం లాభపడింది. కోటక్ మహీంద్రా 0.71 శాతం, ఫెడరల్ బ్యాంక్ 0.47 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.42 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.38 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.25 శాతం, ఎస్‌బీఐ 0.02 శాతం లాభాల్లో ఉన్నాయి.

25 July 2022, 9:27 IST

Top losers list: టాప్ లూజర్స్ లిస్ట్

టాప్ లూజర్స్: రిలయన్స్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అల్ట్రా టెక్, ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హీరో మోటార్స్, బీపీసీఎల్, టీసీఎస్, నెస్లే, విప్రో, గ్రాసిం తదితర స్టాక్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

25 July 2022, 9:27 IST

Top gainers list: టాప్ గెయినర్లు ఇవే

టాప్ గెయినర్స్ జాబితా: అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జ్యూమర్స్, యూపీఎల్, సిప్లా, టైటన్, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందాల్కో తదితర స్టాక్స్ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

25 July 2022, 9:27 IST

Stock markets Opening 9.15 am: సెన్సెక్స్ 123 పాయింట్లు డౌన్

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 122.50 పాయింట్లు కోల్పోయి 55,949 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30.75 పాయింట్లు కోల్పోయి 16,688పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

25 July 2022, 9:27 IST

ముందుంది కార్ల ‘పండగ’

ఫెస్టివల్ సీజన్‌లో కార్ల తయారీ సంస్థలు భారీ సంఖ్యలో కొత్త కార్లను లాంఛ్ చేయనున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) అధ్యక్షుడు వింకేష్ గులాటీ తెలిపారు. గత ఏడాది కొత్త కార్ల లాంఛ్ పెద్దగా లేదని, ఈ ఏడాది ఎస్‌యూవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

25 July 2022, 9:27 IST

నెగెటివ్‌గా ప్రి మార్కెట్ ఓపెనింగ్ Market pre opening session

Market pre opening session: మార్కెట్ ప్రి ఓపెనింగ్ సెషన్ ప్రతికూలంగా ట్రేడైంది. సెన్సెక్స్ 198.10 పాయింట్లు పడిపోయి 55,874.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 56.90 పాయింట్లు పడిపోయి 16,662.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. 

25 July 2022, 9:27 IST

YES Bank Results: నికర లాభంలో 50 శాతం పెరుగుదల చూపిన యెస్ బ్యాంక్

యెస్ బ్యాంక్ గత ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌తో పోలిస్తే మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఈ జూన్‌తో ముగిసిన త్రైమామాసికంలో నికర లాభం 50 శాతం పెరుగుదలతో రూ. 311 కోట్లుగా నమోదు చేసింది. మొండి రుణాలకు కేటాయింపుల్లో తగ్గుదల, ఆదాయ వృద్ధి ఇందుకు దోహదపడింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. 207 కోట్ల నికర లాభం చూపింది.
 

25 July 2022, 9:00 IST

Stock market live: స్టాక్ మార్కెట్లు నెగటివ్‌గా ట్రేడవనున్నాయా?

ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతికూలంగా ట్రేడవుతుండడం భారతీయ మార్కెట్లు కూడా నెగెటివ్‌గా ట్రెండవుతాయన్న అంచనాలను వెలువరిస్తోంది. సోమవారం ఏషియన్ మార్కెట్లన్నీ నెగెటివ్‌గానే ప్రారంభమయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళుతుందన్న భయాందోళన ఇన్వెస్టర్లను వెంటాడుతోంది.

    ఆర్టికల్ షేర్ చేయండి