తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Banks | బ్యాంకులపై ఆర్బీఐకి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

Banks | బ్యాంకులపై ఆర్బీఐకి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

19 January 2022, 12:46 IST

దేశంలో బ్యాంకులపై ప్రజల అసంతృప్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ బ్యాంకులపై ఆర్బీఐకి ఏకంగా 3.41 లక్షల ఫిర్యాదులు అందడం గమనార్హం.

  • దేశంలో బ్యాంకులపై ప్రజల అసంతృప్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ బ్యాంకులపై ఆర్బీఐకి ఏకంగా 3.41 లక్షల ఫిర్యాదులు అందడం గమనార్హం.
ప్రతి ఏటా దేశంలోని బ్యాంకులపై ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ దగ్గర ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
(1 / 5)
ప్రతి ఏటా దేశంలోని బ్యాంకులపై ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ దగ్గర ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.(MINT_PRINT)
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3 లక్షల 41 వేలకుపైగా ఫిర్యాదులు ఆర్బీఐ దగ్గర దాఖలయ్యాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
(2 / 5)
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3 లక్షల 41 వేలకుపైగా ఫిర్యాదులు ఆర్బీఐ దగ్గర దాఖలయ్యాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి.(REUTERS)
ఈ ఫిర్యాదుల్లో 80 శాతం మెట్రోపాలిటన్‌ నగరాలు, అర్బన్‌ ప్రాంతాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం.
(3 / 5)
ఈ ఫిర్యాదుల్లో 80 శాతం మెట్రోపాలిటన్‌ నగరాలు, అర్బన్‌ ప్రాంతాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం.(PTI)
మొత్తం ఫిర్యాదుల్లో 29.51 శాతం అంటే లక్షా 755 కేసులు జాతీయ బ్యాంకులపై దాఖలైనవే. ఇక 36 శాతం అంటే 1,27,303 ఫిర్యాదులు ప్రైవేటు బ్యాంకులపై దాఖలయ్యాయి. జాతీయ బ్యాంకులపై దాఖలైన ఫిర్యాదుల్లో 22 శాతం ఒక్క ఎస్‌బీఐపై దాఖలైనవే.
(4 / 5)
మొత్తం ఫిర్యాదుల్లో 29.51 శాతం అంటే లక్షా 755 కేసులు జాతీయ బ్యాంకులపై దాఖలైనవే. ఇక 36 శాతం అంటే 1,27,303 ఫిర్యాదులు ప్రైవేటు బ్యాంకులపై దాఖలయ్యాయి. జాతీయ బ్యాంకులపై దాఖలైన ఫిర్యాదుల్లో 22 శాతం ఒక్క ఎస్‌బీఐపై దాఖలైనవే.(bloomberg)
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకూ పెన్షన్‌ చెల్లింపులకు సంబంధించినవే. ఈ ఫిర్యాదుల్లో 15 శాతం ఖాతాలకు సంబంధించినవి, 14 శాతం డెబిట్‌ లేదా ఏటీఎం కార్డులకు సంబంధించినవి ఉన్నాయి. ఇక పారా బ్యాంకింగ్‌, బ్యాంకు నోట్లు, కాయిన్లు, బ్యాంకులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న ఆరోపణలు కూడా ఇందులో ఉన్నాయి.
(5 / 5)
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకూ పెన్షన్‌ చెల్లింపులకు సంబంధించినవే. ఈ ఫిర్యాదుల్లో 15 శాతం ఖాతాలకు సంబంధించినవి, 14 శాతం డెబిట్‌ లేదా ఏటీఎం కార్డులకు సంబంధించినవి ఉన్నాయి. ఇక పారా బ్యాంకింగ్‌, బ్యాంకు నోట్లు, కాయిన్లు, బ్యాంకులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న ఆరోపణలు కూడా ఇందులో ఉన్నాయి.(HT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి