తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yasasvi Scheme: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ స్టూడెంట్స్‌కు Nta స్కాలర్‌షిప్స్!

YASASVI Scheme: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ స్టూడెంట్స్‌కు NTA స్కాలర్‌షిప్స్!

HT Telugu Desk HT Telugu

30 July 2022, 15:34 IST

    • YASASVI Scheme: ప్రధానమంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా (YASASVI) స్కీమ్‌లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్థులకు ఇదో చక్కటి అవకాశం..
NTA Scholarship Scheme
NTA Scholarship Scheme

NTA Scholarship Scheme

Scholarship Scheme: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పాఠశాల విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ పథకాన్ని తీసుకవచ్చింది. వైబ్రంట్ ఇండియా (YASASVI స్కాలర్‌షిప్ స్కీమ్) ఫథకంలో భాగంగా PM యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ కోసం విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). ఈ పథకం కింద OBC, EBC, నాన్-నోటిఫైడ్, సంచార, సెమీ-సంచార తెగలకు చెందిన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు. 9వ తరగతి నుండి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించని వ్యక్తులు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని NTA తెలిపింది.

Scholarship Scheme:: స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులను ఎలా ఎంపిక చెస్తారు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా అందిస్తున్న YASASVI 2022 స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నవిద్యార్థులను MCQ ఫార్మాట్ ఆధారిత ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష సెప్టెంబర్ 11న నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జూలై 27 నుంచి ప్రారంభమైంది. అదే సమయంలో, ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 26. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ yet.nta.ac.inని సందర్శించడం ద్వారా తమ దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.

PM YASASVI స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి

దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ yet.nta.ac.inని సందర్శించండి.

దీని తర్వాత వెబ్‌సైట్‌లో ఇచ్చిన రిజిస్టర్ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు పేరు, ఇమెయిల్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్ మొదలైన వాటిని నమోదు చేసి అకౌంట్‌ను సృష్టించండి.

ఇప్పుడు అప్లికేషన్ నంబర్ పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వండి.

ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, సమర్పించండి.

వీలైతే, దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత, అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ తీసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం