తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Water In Car : వరదతో మీ కారులోకి నీళ్లు వచ్చాయా? అయితే ఏం చేయాలి?

Water In Car : వరదతో మీ కారులోకి నీళ్లు వచ్చాయా? అయితే ఏం చేయాలి?

Anand Sai HT Telugu

08 December 2023, 9:30 IST

    • Car Care Tips : తుపాను కారణంగా కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వానలు పడుతున్నాయి. వర్షంలో వరదలతో వస్తే మీ కారులో నీరు వెళితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కారు సాధారణ స్థితికి రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
వరద నీటిలో కారు
వరద నీటిలో కారు (unsplash)

వరద నీటిలో కారు

చాలా ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. వానలతో వరదలు చాలా సాధారణం. ఇక తుపాను వచ్చిన సమయంలో అంతే సంగతులు. రోడ్ల మీద నీరు ఏరులై పారుతుంది. చాలా నగరాల్లో భారీ వర్షాల కారణంగా వీధుల్లో నీరు ఎక్కువగా ప్రవహిస్తోంది. కారు పార్కింగ్ చేసి ఉంటే అందులోకి నీరు వెళ్తుంది. అలాగే ఇళ్లు, నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది. వరద ఎక్కువైతే కార్లు కొట్టుకుపోతాయి. మీ కారు కూడా వర్షం వల్ల పాడైపోయినట్లయితే మళ్లీ పునరుద్ధరించడంలో మీకు సహాయపడే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

Pregnancy Tips : గర్భధారణలో సమస్యలను సూచించే సంకేతాలు, లక్షణాలు ఇవే

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మీ కారులోకి వరద నీరు వస్తే.. అన్నింటిలో మొదటిది, కారులో ఉన్న నీటిని తీసివేయాలి.

ఏ కారణం చేత కూడా మీ కారును అస్సలు స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే కారులోని నీరు ఇంజన్, ఇతర భాగాలలోకి ప్రవేశించి మరింత నష్టాన్ని కలిగిస్తుంది.

అదేవిధంగా మీ కారు బానెట్‌ని తెరిచి, స్పానర్‌తో రెండు బ్యాటరీ టెర్మినల్స్‌ను తీసివేయండి. మీకు తెలిస్తే మాత్రమే ఇలా చేయండి.

మీరు మీ కారు ఇంజిన్‌ను పొడిగా ఉంచాలి. కనీసం రెండు రోజులు అలా వదిలేయండి. అప్పుడే అది సరిగ్గా ఆరిపోతుంది. అప్పటి వరకు దీన్ని స్టార్ట్ చేయెుద్దు.

నీటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది, ముఖ్యంగా మెటల్, ఎలక్ట్రికల్ భాగాలపై ప్రభావం పడుతుంది. వాహనం అంతటా గాలి ప్రసరణ కోసం అన్ని విండోలు తెరవాలి. ఇది తేమ పెరగకుండా ఆపుతుంది.

మీకు వీలైతే కారు సీట్లను తీసివేసి, వాటిని ఎండలో ఆరనివ్వండి. ఇది క్యాబిన్‌కు మరింత వెంటిలేషన్‌ను అందిస్తుంది.

మీకు అత్యవసరంగా కారు అవసరమైతే, మీకు తెలిసిన మెకానిక్‌ని సంప్రదించి, కారును సరిచేయండి.

అలాగే కారును ఇంజిన్‌ను క్లీన్ చేసిన తర్వాత మాత్రమే నడపాలి.

వర్షాకాలంలో కార్లలో ధూళి, మట్టి పేరుకుపోవడం సహజం. సాధారణ నీరు లేదా ఏదైనా లిక్విడ్ ఉపయోగించి కారును క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం.

వర్షాకాలంలో వైపర్‌లు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి విండ్‌షీల్డ్ నుండి మురికి, నీటిని తొలగించడంలో సహాయపడతాయి. అందువల్ల, వర్షం పడిన వెంటనే వైపర్లను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

భారీ వర్షాలు కురిసే సమయంలో, కారు హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్‌లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేయడం ముఖ్యం.

డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి వర్షాకాలంలో కారు బ్రేకింగ్ సిస్టమ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. తడితో బ్రేక్‌లు ప్రభావితం అవుతాయి.

తదుపరి వ్యాసం