తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss Tips : ఈ 6 చెత్త అలవాట్లు మానేయండి.. బరువు తగ్గుతారు

Weight Loss Tips : ఈ 6 చెత్త అలవాట్లు మానేయండి.. బరువు తగ్గుతారు

Anand Sai HT Telugu

11 December 2023, 14:00 IST

    • Weight Loss Tips In Telugu : చాలా మంది ఎదుర్కొనే సమస్య బరువు ఎక్కువగా ఉండటం. దీని నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. కొన్ని అలవాట్లను మానుకోవాలి. అవేంటో తెలుసుకుందాం..
బరువు తగ్గే చిట్కాలు
బరువు తగ్గే చిట్కాలు

బరువు తగ్గే చిట్కాలు

మీరు అధిక బరువును తగ్గించుకోవాలంటే.. ముందుగా మీ అలవాట్లను మార్చుకోండి. అధిక కొవ్వుతో ఇబ్బందిపడేవారు కొన్ని చిట్కాలు పాటించాలి. దీనిద్వారా ప్రయోజనం ఉంటుంది. అధిక బరువు అనేది ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తుంది. కొవ్వును ఎలా తగ్గించుకోవాలో చాలా మంది నిర్ణయించుకోలేరు. కొందరు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయితే మరికొందరు రోజులో ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతున్నారు. ఇవన్నీ తరచుగా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. మీరు అధిక కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే ముందుగా మీ అలవాట్లను మార్చుకోండి. బరువు తగ్గించుకోవాలనుకునేవారు.. ఈ ఆరు చిట్కాలను అనుసరించండి.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

1. వీలైనంత వరకు శీతల పానీయాలు తాగడం మానుకోండి. ఇందులో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో కొవ్వును పెంచుతుంది.

2. నిద్రలేమి కారణంగా కొవ్వు పెరుగుతుంది. రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. ఒత్తిడి కూడా ఊబకాయానికి కారణమవుతుంది. ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సరిగా నిద్రపోకుండా ఉండకూడదు.

3. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవడానికి చాలా మంది తినడం ఆపేస్తారు. ఇది కచ్చితంగా మంచిది కాదు. తర్వాత ఆకలితో ఒకేసారి ఎక్కువగా తింటారు. మీ ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం సరిగ్గా తినండి. లేని పక్షంలో సమస్య పెరుగుతూనే ఉంటుంది.

4. అధిక కొవ్వు పదార్థాలు తినడం వల్ల కొవ్వు పెరుగుతుంది. మీరు కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే ముందుగా కొవ్వు పదార్థాలను వదిలివేయండి. ఈ ప్రత్యేక చిట్కాను అనుసరించండి.

5. రోజంతా మీకు వీలైనంత చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రతి గంట నుండి గంటన్నర మధ్యలో లేచి కాసేపు నడవండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకే చోట ఎక్కువగా కూర్చొవద్దు.

6. మీ మనస్సును ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి. మీకు ప్రతికూల ఆలోచనలు ఉంటే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. ఇక నుంచి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. మనశ్శాంతిగా ఎలా ఉండాలో శ్రద్ధ వహించండి. లేదంటే సమస్య మళ్లీ పెరుగుతుంది.

పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన బరువు తగ్గకపోవడంతోపాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఆహారంలో అవసరమైన ప్రొటీన్లు, కొవ్వు, పిండి, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు లభించే ఆహారంపై తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది. అయితే ఎక్కువ వ్యాయామం మాత్రం చేయకూడదు. 70 శాతం ఆహారం తీసుకుంటే.. 30 శాతం మాత్రమే వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. గంటల తరబడి ఒకే చోట కూర్చొకూడదు. ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పండ్లు ఎక్కువగా తినాలి. పుచ్చకాయ, దోసకాయ, పైనాపిల్, ఆరెంజ్, కివి, బొప్పాయి వంటి పండ్లు తీసుకోవాలి.

తదుపరి వ్యాసం