తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : బేర్ గ్రిల్స్ స్ఫూర్తి కథ.. నీ మనసే నీకు గొప్ప మెడిసిన్..

Wednesday Motivation : బేర్ గ్రిల్స్ స్ఫూర్తి కథ.. నీ మనసే నీకు గొప్ప మెడిసిన్..

HT Telugu Desk HT Telugu

20 September 2023, 5:00 IST

    • Wednesday Motivation : పట్టుదల లేకుంటే ఎవరూ ఏం చేయలేరు. పట్టుదల లేకుండా ప్రయత్నిస్తే.. అడుగు దూరం కూడా వేయలేరు. జీవితంలో ముందుకు సాగాలంటే.. ఆగిపోకూడదు.. సాగిపోతూ ఉండాలి. సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ జీవితం అదే చెబుతుంది.
బేర్ గ్రిల్స్
బేర్ గ్రిల్స్ (Twitter)

బేర్ గ్రిల్స్

కొన్నిసార్లు జీవితంలో అవకాశాలు ఎక్కువగా రావు. అవకాశాలు వస్తాయని కూర్చొంటే అక్కడే ఉండిపోతారు. వచ్చిన ఒక్క అవకాశాన్ని పట్టుకుంటేనే గెలుపు సాధ్యం. లేదంటే వెనక్కు తిరిగి.. గడిచిన కాలాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడిపోతూ ఉండాలి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో గురించి తెలుసు కదా. ప్రధాని మోదీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు కూడా అందులో పాల్గొన్నారు. అందులో హోస్ట్ గా కనిపిస్తుంటాడు బేర్ గ్రిల్స్. అతడి జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

బేర్ గ్రిల్స్ జీవితంలో ఎన్నో పరాజయాలను చవిచూశాడు. అతని పూర్తి పేరు ఎడ్వర్డ్ మైఖేల్ గ్రిల్స్. బేర్ గ్రిల్స్ చిన్నతనంలో స్కైడైవింగ్ నేర్చుకున్నాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందాడు. సైన్యంలో కూడా పనిచేశాడు. కొండలు, శిఖరాలు ఎక్కడం సహా అనేక సాహసాలు చేయడం ద్వారా గ్లోబల్ టీవీ స్టార్ అయ్యాడు. 23 సంవత్సరాల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు.

అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. బేర్ గ్రిల్స్.. ఓ శిక్షణలో ఉన్నాడు. స్కైడైవ్ చేయాల్సి ఉంది. ఈ సమయంలో పారాచూట్ 16000 అడుగుల ఎత్తులో ఓపెన్ చేయాలని చూశాడు. కానీ అది తెరుచుకోలేదు. దీంతో అక్కడి నుంచి కిందపడిపోయాడు. ఇక అతడి జీవితం అయిపోయిందని అనుకున్నారు. నేలపై పడి.. వెన్నుకు గాయమైంది. వైద్యులు కూడా నడవలేడని చెప్పారు. 18 నెలలపాటు సైనికపునరావసంలో ఉన్నాడు బేర్ గ్రిల్స్. చీకటి రోజులు చూశాడు. అలా అని కుంగిపోలేదు.

బేర్ గ్రిల్స్ మెుండి వ్యక్తి. అస్సలు తగ్గేదేలేదు అని ప్రయత్నాలు చేశాడు. చక్కగా నడవడం మెుదలుట్టాడు. ఆ తర్వాతనే ఎవరెస్ట్ కూడా అధిరోహించాడు. అతడి మనసే ఇక్కడ గొప్ప మెడిసిన్ గా పని చేసింది. ఇక జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో తన మీద తనకున్న నమ్మకమే మళ్లీ లేచి హుషారుగా తిరిగేలా చేసింది. తర్వాత మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంతో గ్లోబల్ టీవీ స్టార్ అయ్యాడు బేర్ గ్రిల్స్. పారాచూట్ యాక్సిడెంట్ వల్ల తన జీవితం ముగిసిపోయిందని ఆలోచించకుండా పట్టుదలతో ఉండి.. ప్రపంచానికి పరిచయం అయ్యాడు.

జీవితంలో చిన్న చిన్న విషయాలకే కుంగిపోయేవారికి బేర్ గ్రిల్స్ జీవితం స్ఫూర్తి. ఏదీ లేకున్నా.. ఏదో జరుగుతుందనుకుని ఆత్మహత్యలు చేసుకునేవారికి అతడి జీవితం ఓ పుస్తకం. ఎంతో ఎత్తు నుంచి కిందపడినా.. అతడి మనోధైర్యమే మెడిసిన్‍గా పని చేసింది.

జీవితంలో ఒకే ఒక్క అవకాశం లభిస్తుంది.. దానిని ధైర్యంగా పట్టుకోవాలి.. అప్పుడే గెలుపు.

అత్యుత్తమ ప్రయాణాలన్నీ ఒకే అడుగుతో ప్రారంభమవుతాయి..

నొప్పి తాత్కాలికం.. గెలుపే శాశ్వతం..

తదుపరి వ్యాసం