తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రిసెర్చ్‌లో సంచలన విషయాలు.. Vitamin B6 ఎక్కువగా తీసుకుంటే జరిగేది ఇదే!

రిసెర్చ్‌లో సంచలన విషయాలు.. Vitamin B6 ఎక్కువగా తీసుకుంటే జరిగేది ఇదే!

HT Telugu Desk HT Telugu

21 July 2022, 20:00 IST

    • Vitamin B6 supplements: అధిక మోతాదులో విటమిన్ బి6 సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్‌ల భావాలు తగ్గుతాయని తాజా అధ్యయనంలో తెలిపింది. UKలోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లోని శాస్త్రవేత్తలు యువకులపై అధిక మోతాదులో విటమిన్ B6 తీసుకోవడం వల్లే కలిగే ప్రభావంపై అద్యయనం చేశారు.
Vitamin B6 supplements
Vitamin B6 supplements

Vitamin B6 supplements

ఆరోగ్యం చురుగ్గా ఉండడంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో విటమిన్ల స్థాయిలు తగ్గితే రకరకాల సమస్యలు తలెత్తుంటాయి. ముఖ్యంగా విటమిన్స్ బి6 శరీరంలోని జీవక్రియలు సజావుగా జరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. B6 విటమిన్ లోపం మీ శరీరాన్ని అలసట, బలహీనత ఏర్పడుతుంది. శరీరంలో విటమిన్ B6 తక్కువగా ఉంటే రక్తహీనతకు గురవుతారు. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే ఇనుము లోపం ఏర్పడుతుంది. B6 విటమిన్‌ను పిరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు, ఇది B కాంప్లెక్స్ విటమిన్ సమూహంలోని ఎనిమిది విటమిన్లలో ఒకటి. శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ బి6 చాలా మేలు చేస్తుంది. విటమిన్ B6 మానసిక స్థితి, ఆకలి, నిద్ర, ఆలోచనను మెదరుగుపరుస్తుంది.

తాజాగా బ్రిటన్‌లోని రీడింగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో B6 విటమిన్ సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. విటమిన్ బి6 సప్లిమెంట్స్ అధిక వినియోగం వల్ల యువకుల్లో ఆందోళన, నిస్పృహ తగ్గుతుందని రీడింగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. విటమిన్ బి6 మాత్రలు తీసుకుంటే యువతపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు విటమిన్ బి6 ప్రాముఖ్యత, ప్రభావం గురించి వివరంగా వెల్లడించారు. ఈ అధ్యయనంలో 300 మందికి విటమిన్ బి6, b12ని రోజూ ఇచ్చే మోతాదు కన్నా 80 సార్లు ఎక్కువగా మెుత్తంలో ఇచ్చి ఫలితాలను కనుగొన్నారు. ఇందులో విటమిన్ B 12 కన్నా విటమిన్ B6 అత్యంత ప్రభావం చూపినట్లుగా నిర్ధారించారు.

న్యూరాన్ల మధ్య సున్నితమైన తులనాత్మకత అధారంగానే మెదడు పని తీరు ఆధారపడి ఉంటుందని, దీని ద్వారానే శరీరంలో ఉండే నిరోధకాలను మెదడు నియంత్రిస్తోందని అధ్యయన శాస్త్రవేత్త డేవిడ్‌ఫీల్డ్ చెప్పారు. ఈ ప్రక్రియలో విటమిన్ బి6 రసాయన వాహకాన్ని ఉత్పత్తి చేసి మెదడులోని రుగ్మతల ప్రేరణను నిరోధించేలా చేస్తాయని అధ్యయనంలో వివరించారు. విటమిన్ బి6 సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్‌ల భావాలు తగ్గుతాయని అధ్యయనం తెలింది.

తదుపరి వ్యాసం