తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Using Phone In Toilets : వాష్​రూమ్​లో కూడా మొబైల్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఈ తిప్పలు తప్పవు..

Using Phone in Toilets : వాష్​రూమ్​లో కూడా మొబైల్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఈ తిప్పలు తప్పవు..

23 July 2022, 9:53 IST

    • ఉదయం లేచింది చాలు.. రాత్రి పడుకునేవరకు.. సారీ సారీ నిద్రమానేసి మరి.. ఫోన్ చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఫోన్​కి అంతగా అడిక్ట్ అయిపోయాం. అయితే ఇది సరిపోదు అన్నట్లు కొందరు టాయిలెట్​కి కూడా ఫోన్ తీసుకునిపోతారు. అయితే ఇలా వాష్​రూమ్​కి కూడా ఫోన్​ తీసుకెళ్తే మీ ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 
వాష్​రూమ్​లో ఫోన్ వాడుతున్నారా?
వాష్​రూమ్​లో ఫోన్ వాడుతున్నారా?

వాష్​రూమ్​లో ఫోన్ వాడుతున్నారా?

Using Phone in Toilet: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇప్పుడు తమ ఫోన్​లకు బానిసలయ్యారు. ఉదయాన్నే ఫోన్ చెక్​ చేయాలనే టెంప్టేషన్​ నుంచి దానిని వాష్‌రూమ్‌కు తీసుకెళ్లేంతలా అడిక్ట్ అయిపోయారు. అయితే మీ ఫోన్​ను టాయిలెట్​లో ఉపయోగిస్తున్నారంటే.. మీ చేతులారా మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి టాయిలెట్​లో ప్రమాదకరమైన జెర్మ్స్, బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి మీ మొబైల్​ ఫోన్​ మీదకు చేరి.. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనేది వాస్తవం. మరీ ముఖ్యంగా మీ ఫోన్‌ను టాయిలెట్‌లో ఉపయోగించడం అనేది ఒక చెడు అలవాటు. అయితే ఫోన్​ను వాష్​రూమ్​లో వినియోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉబ్బరం, అతిసారం సంబంధిత సమస్యలు

చాలా మంది టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు వాష్‌రూమ్‌లోని పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపరు. పైగా టాయిలెట్​లో ఫోన్​ ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవడం కూడా మర్చిపోతుంటారు. చేతులు శుభ్రం చేసుకోలేదనే ఆలోచన లేకుండానే ఆహారం తినేస్తారు. సరే చేతులు కడుక్కున్న ఫోన్​ మీద బ్యాక్టిరియా అలాగే ఉంటుంది కదా. ఇంక చేతులు కడుక్కుని ఏమి ప్రయోజనం. మొత్తం మీద తినే ఆహారంతో పాటు ఆ బ్యాక్టిరియా కూడా కడుపులోకి చేరుతుంది. దీనివల్ల UTI, అతిసారం, జీర్ణ సంబంధిత వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ మీరు బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురైతే.. మీ కడుపు, పేగులలోని అంతర్గత భాగాలలో మంట కలుగుతుంది.

మలబద్ధకం, పైల్స్

అస్తవ్యస్తమైన జీర్ణ వ్యవస్థ మిమ్మల్ని మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుంది. అయితే ఎక్కువ సేపు వాష్‌రూమ్‌లో కూర్చోవడం వల్ల మీ విసర్జన అవయవాలపై అనవసరమైన ఒత్తిడి ఏర్పడవచ్చు. ఇది పైల్స్, ఫిషర్స్ వచ్చే అవకాశాలను పెంచుతుంది.

కడుపు నొప్పి, యూటీఐ

ప్రతి వాష్‌రూమ్ ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయం. మీరు మొబైల్ ఫోన్‌ని ఉపయోగించినప్పుడు.. మీ స్మార్ట్‌ఫోన్‌కు అంటుకునే బ్యాక్టీరియా మీకు ఎక్కువ హాని కలిగిస్తుంది. ఈ బాక్టీరియా ఫోన్‌కి అతుక్కుపోయి కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వంటి ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తుంది.

మొబైల్ ఫోన్‌పై బ్యాక్టీరియా

మీరు వాష్‌రూమ్ నుంచి వచ్చిన వెంటనే మీ చేతులను కడుక్కోవాలి. అక్కడికి ఫోన్ తీసుకువెళ్లకపోవడమే మంచిది. అయినాసరే మేము తీసుకెళ్తాం అనుకుంటే.. మీ స్మార్ట్​ఫోన్​ను కడగలేరు కాబట్టి. కనీసం శానిటైజ్ చేసుకోండి. లేదంటే మీకు ఆరోగ్య సమస్యలు తప్పవు.

తదుపరి వ్యాసం