తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali 2023 Celebration : ఈ దీపావళిని ఇలా జరుపుకోండి.. జీవితంలో మరిచిపోలేరు

Diwali 2023 Celebration : ఈ దీపావళిని ఇలా జరుపుకోండి.. జీవితంలో మరిచిపోలేరు

Anand Sai HT Telugu

03 November 2023, 11:00 IST

    • Diwali 2023 Celebration Ideas : దీపావళి సందర్భంగా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి. ప్రతి ఒక్కరికీ ఏదైనా బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేసుకోవచ్చు. దీపావళి ఎలా చేసుకుంటే బాగుంటుందో మీ కోసం కొన్ని ఐడియాలు ఇక్కడ ఉన్నాయి.
దీపావళి సెలబ్రేషన్స్
దీపావళి సెలబ్రేషన్స్ (unsplash)

దీపావళి సెలబ్రేషన్స్

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పండుగ దీపావళి(Diwali). ఎందుకంటే పెద్దలు ఇంటిని లైట్లతో అలంకరించి ఆనందిస్తుంటే, పిల్లలు క్రాకర్లు పేల్చి సంబరపడతారు. ఈ పండుగ భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో జరుపుకొంటారు. మీరు కూడా ఈ దీపావళి పండుగను బాగా జరుపుకోవాలనుకుంటే కింద చెప్పే విషయాలను అనుసరించండి.

ట్రెండింగ్ వార్తలు

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

రంగోలి పెట్టండి : రంగోలి భారతీయ చరిత్రలో పురాతన సంప్రదాయం. ఇది అనేక పండుగల సందర్భంగా ఉంటుంది. ఈ పండుగ రోజున మీరు ఇంట్లోనే అందమైన రంగోలిలను వేయెుచ్చు. అలాగే రంగురంగుల దీపాలతో అలంకరించండి. దీపావళి శుభాకాంక్షలు(Diwali Wishes) తలుపులకు వేలాడదీయవచ్చు.

ఇంటిని లైట్లతో అలంకరించండి : ఈ దీపావళికి మీ ఇంట్లోని ప్రతి భాగాన్ని లైట్లతో అలంకరించుకోవచ్చు. దీపాలతో అలంకరించుకోలేకపోతే కొవ్వొత్తులతో అలంకరించండి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లు లైట్లతో మెరిసిపోతుంది.

ప్రత్యేక వంటకాలు తయారు చేయవచ్చు : రుచికరమైన వంటకాలు లేకుండా దీపావళి పండుగ కచ్చితంగా అసంపూర్ణమైనది, ఇది కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చే రోజు. మంచి వంటకాలు చేసి కలిసి తినండి.

మీ ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వండి : బహుమతులు ఇస్తే.. ఎదుటివారు కచ్చితంగా గుర్తుంచుకుంటారు. బహుమతులు, ఆహారం, స్వీట్లు ఇవ్వడం ద్వారా దీపావళి జరుపుకోవచ్చు. దీపావళి సందర్భంగా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఏదైనా బహుమతి ఇవ్వాలని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఈ వేడుకను జీవితాంతం గుర్తుంచుకుంటారు.

క్రాకర్స్ : దీపావళిని జరుపుకోవడానికి ఉత్తమ మార్గం మీ ప్రియమైనవారితో కలిసి రోజును ఆనందించడం. దీపావళి పండుగను పురస్కరించుకుని పటాకులు పేల్చడం వల్ల కలిగే కాలుష్యంపై ఇప్పుడు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే షాపుల్లో పర్యావరణానికి హాని కలిగించని, ధ్వని తక్కువ వచ్చే క్రాకర్లను కాల్చండి. పర్యావరణాన్ని మాత్రం నాశనం చేయెుద్దు.

దీపావళి పురాణాలను చదవండి : ప్రతి పండుగ అర్థం, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. ఇది చీకటి నుండి కాంతికి మార్గాన్ని బోధిస్తుంది. దీపావళి రోజున మీ కుటుంబ సభ్యుల మధ్య దీపావళి ప్రాముఖ్యత గురించి చర్చించండి. ఈ పండుగకు సంబంధించిన వివిధ కథనాలను చదవండి.

లక్ష్మీ పూజ చేయండి : చాలా ఇళ్లలో కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గణేశుడితో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. పూజలో భాగమవ్వడం ద్వారా, మీరు మీ అన్ని ఆందోళనలు మరచిపోయి శాంతిని పొందుతారు. మన పూర్వీకుల ఆచారాలు కొనసాగించి వారి ఆశీర్వాదం పొందాలి.

కొత్త బట్టలు, గృహోపకరణాలు కొనండి : దీపావళి పండుగ అంటే దుకాణాల్లో బట్టలు, టెలివిజన్, రిఫ్రిజిరేటర్, మొబైల్ ఫోన్లు, పాత్రలు మొదలైన వివిధ వస్తువులపై భారీ తగ్గింపులను అందిస్తాయి. దీపావళిని కూడా కొత్త ఆరంభంగా జరుపుకొంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేయండి.

గ్రీటింగ్ కార్డ్‌లను తయారు చేయవచ్చు : పుట్టినరోజు లేదా నూతన సంవత్సర వేడుకల సమయంలో గ్రీటింగ్ కార్డ్‌లు ఇవ్వడం, స్వీకరించడం మనందరికీ ఇష్టం. అయితే దీపావళి సందర్భంగా మీ కుటుంబ సభ్యుల కోసం గ్రీటింగ్ కార్డ్‌ని ఎందుకు తయారు చేయకూడదు. మీ ప్రేమను చూపించడానికి ఇదే సరైన సమయం.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆడుకోండి : దీపావళి పండుగను జరుపుకోవడానికి బంధువులు, స్నేహితులను ఒక దగ్గరకు చేరండి. పాటలు పాడటం, కుర్చీలతో ఆడటం, సినిమా పేర్లను చెప్పడం, ఏదైనా ఆటల పోటీలు.. ఇతర రకాల ఆటలను ఆడుకోవచ్చు.

తదుపరి వ్యాసం