తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Typhoid Infection | ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరంతో బాధపడుతున్నారా? అది ఇదే కావచ్చు!

Typhoid Infection | ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరంతో బాధపడుతున్నారా? అది ఇదే కావచ్చు!

HT Telugu Desk HT Telugu

20 May 2023, 10:27 IST

    • Typhoid fever Symptoms: ఎండాకాలంలో కలుషిత నీరు తాగటం, స్ట్రీట్ ఫుడ్ తినడం ద్వారా చాలా మంది టైఫాయిడ్ బారినపడతారు. టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
Typhoid fever Symptoms
Typhoid fever Symptoms (Unsplash)

Typhoid fever Symptoms

Typhoid fever Symptoms: టైఫాయిడ్ అనేది కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది, ఇది ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. సాల్మొనెల్లా టైఫి అనే ఈ బ్యాక్టీరియా ఆహారం లేదా నీటి ద్వారా కడుపులోకి చేరుతుంది. ఆ తర్వాత, అది గుణించి ఇన్ఫెక్షన్ కలిగించడం ప్రారంభిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

ఎండాకాలంలో కలుషిత నీరు తాగటం, స్ట్రీట్ ఫుడ్ తినడం ద్వారా చాలా మంది టైఫాయిడ్ బారినపడతారు. వారికి కలిగిన ఆనారోగ్యం ఏమిటో తెలియక ఆందోళన చెందుతారు. ఆయితే లక్షణాలు తెలిస్తే త్వరగా సంక్రమణ నుంచి బయటపడవచ్చు. టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు 3 నుండి 5 రోజులలో శరీరంలో లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

కడుపు నొప్పి: టైఫాయిడ్ వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలలో కడుపు నొప్పి ఒకటి. బ్యాక్టీరియా కడుపులోకి చేరిన వెంటనే, అది మొత్తం జీర్ణ ప్రక్రియను పాడు చేస్తుంది. దీనితో ఏది తిన్నా తేలికగా జీర్ణం కాక పొట్ట ఉబ్బరం, కడుపునొప్పి వస్తుంది. ఈ నొప్పి మిమ్మల్ని నిరంతరం బాధపెడుతుంది.

ఒళ్లు నొప్పులు: మీకు ఒళ్లు నొప్పులు ఎక్కువగా బాధిస్తే అవి టైఫాయిడ్ వల్ల కావచ్చు. ఈ బ్యాక్టీరియా శరీరంలో చేరినప్పుడు, శరీరం దానితో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో, రోగనిరోధక వ్యవస్థ వివిధ శరీర భాగాలపై ప్రతిస్పందిస్తుంది, ఫలితంగా ఒళ్ళు నొప్పులు ఇబ్బందిపెడతాయి.

తలనొప్పి: తలనొప్పి కూడా టైఫాయిడ్ ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు శరీరం ఇచ్చే ఒక ప్రతిస్పందన. శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతున్నప్పుడు, తలనొప్పి కూడా వేగంగా పెరుగుతుంది. ఇది కాకుండా, ఈ సమయంలో శరీరాన్ని బలహీనత ఆవహిస్తుంది, ఇది కూడా తలనొప్పికి కారణమవుతుంది.

అధిక జ్వరం: టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ జ్వరం కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఈ జ్వరం లోపలి నుంచి ఉండవచ్చు. అంటే బయటకు మీ శరీరాన్ని స్పర్శించినపుడు జ్వరం లేనట్లు అనిపించినా, లోలోపల జ్వరం కొనసాగుతుంది. ఈ జ్వరం చాలా కాలం పాటు కొనసాగుతుంది, మొత్తం శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల నిత్యం అలసటగా అనిపిస్తుంది. కీళ్లు, మోకాళ్లలో నొప్పి ఉంటుంది, కోలుకోవటానికి సమయం పడుతుంది.

వికారం: వాంతులు, వికారం రెండూ కూడా టైఫాయిడ్ లక్షణాలలో భాగమే. దీని కారణంగా శరీరం నిర్జలీకరణం ప్రారంభమవుతుంది. లక్షణాలు మరింత తీవ్రంగా ఉండవచ్చు.

టైఫాయిడ్ జ్వరం చాలా ప్రాణాంతకమైనది. మీకు ఈ లక్షణాలలో ఏవైనా అనిపిస్తే, వెంటనే వెళ్లి వైడల్ పరీక్ష చేయించుకోండి. తదనుగుణంగా వైద్యులు మందులు ప్రిస్క్రిప్షన్ చేస్తారు.

Typhoid Prevention Tips- టైఫాయిడ్ నివారణ మార్గాలు

  • బయట ఆహారాన్ని ఎక్కువగా తినకండి. ముఖ్యంగా నిల్వచేసిన ఆహారం ఫాస్ట్ ఫుడ్, కలర్ వేసి ఇంపుగా కనిపించేలా తయారు చేసిన ఆహారాన్ని తినకండి.
  • ఏదైనా తినే ముందు,తాగే ముందు చేతులు శుభ్రపరుచుకోవాలి. అపరిశుభ్రమైన పరిసరాలలో తినడం మానుకోండి, పరిశుభ్రత లేని తోపుడు బండ్లు, వీధి ఆహారాలకు దూరంగా ఉండాలి.
  • కలుషితమైన నీటిని తాగకూడదు. శుద్ధమైన బాటిల్ నీరు తాగాలి లేదా నీటిని మరిగించుకొని తాగాలి. కనీసం ఒక నిమిషం పాటు నీటిని మరిగించండి.
  • ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి, గది ఉష్ణోగ్రత వద్ద నిల్వచేసిన ఆహారానికి దూరంగా ఉండండి.
  • రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోకపోతే టైఫాయిడ్ రావచ్చు. వారు తాకిన ఆహారాన్ని ఇతరులు తినడం ద్వారా ఇతరులు టైఫాయిడ్ బారినపడవచ్చు.

తాజాగా వండిన ఆహారం తినడం, శుద్ధజలం తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా టైఫాయిడ్ జ్వరాన్ని నివారించవచ్చు.

తదుపరి వ్యాసం