తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Thoughts : నువ్ గెలిచే వరకూ నీ కథ ఎవరికీ అవసరం లేదు

Tuesday Thoughts : నువ్ గెలిచే వరకూ నీ కథ ఎవరికీ అవసరం లేదు

HT Telugu Desk HT Telugu

21 February 2023, 4:34 IST

    • Tuesday Motivation : 'ఓటమి ఒకరి రాత కాదు.. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు.' ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నువ్ గెలిస్తేనే ప్రపంచం నీ కథ వింటుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

గెలిస్తే ప్రపంచం నిన్ను చూస్తుంది.. అదే ఓడిపోతే.. ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. అయితే ప్రతీసారి ఓడిపోలేం కదా.. గెలవాలి. నువ్ గెలిస్తేనే నీ కథ ప్రపంచం వింటుంది. నువ్ ఓడిపోతే.. నిన్ను నీ చుట్టు ఉన్నవాళ్లే పట్టించుకోరు. ఇంకా సమాజం ఏం గుర్తుపెట్టుకుంటుంది. జీవితంలో చాలా మంది గెలవాలని పోరాడతారు. కానీ గెలుపు అంచుకు వెళ్లే సమయంలో వెనక్కు తిరుగుతారు. అదే చాలామందిలో సమస్య.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

ఇక మనం ఎంత ప్రయత్నించినా.. లాభం లేదని.. చాలామంది అనుకుంటారు. ఇదే మిమ్మల్ని గెలుపును టచ్ చేయకుండా చేస్తుంది. నీ మాటకు విలువ ఉండాలంటే.. గెలిచి చెప్పు.. ఓడిపోయి చెబితే నువ్ ఏది చెప్పినా.. సిల్లీగానే చూస్తారు. గెలిచినప్పుడు పొగడ్తలు, ఓడినప్పుడు రాళ్లు విసరడం ఈ సమాజపు అలవాటు. ఏదైనా ప్రయత్నించేదారిలో ముళ్లు ఉంటాయి.. రాళ్లు పడతాయి. వాటిని చూస్తూ.. అక్కడే ఆగిపోతే.. జీవితాంతం అక్కడే ఉండిపోతావ్.

ఓటమి ఒకరి రాత కాదు.. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. గెలుపు ఓటమి ఎలా ఉంటుందో వదిలిపెట్టు. నీకు కావాల్సినదాని కోసం నడవటం మాత్రం మానుకోకు. నువ్ సృష్టించుకున్న నీ గమ్యం కోసం.. గుంపుతో లేని సమూహంలా, గురువులేని ఏకలవ్యుడిలా పరిగెత్తాల్సిందే. ప్రయత్నం చేసినా.. ఓడిపోయినా మంచిదే. ఓటమే గెలుపునకు పునాది. గెలుపును సాధించినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సరే.. ఓడినప్పుడు దాన్ని జీర్ణించుకోవడం కూడా అవసరం.

నువ్ ఓడిపోయి వంద కథలు చెప్పు.. ఎవరూ పట్టించుకోరు. అదే నువ్ గెలిచి ఒక్క కథను చెప్పు.. అదే సక్సెస్ మంత్రం అనుకుంటారు. అందుకే ఓడిపోయినవాడి మాటలకంటే.. గెలిచినవాడి మాటలకు విలువ ఎక్కువ. నువ్ గెలిస్తేనే నీ కథ పాఠం అవుతుంది. అదే నువ్ ఓడిపోతే అది నీకు గెలిచేందుకు గొప్ప అనుభవం అవుతుంది. అందుకే ఏం చెప్పాలనుకున్నా.. గెలిచి చెప్పు.

నీ విన్నింగ్ ఎలా ఉండాలంటే.. ఈరోజు అనసరపు మాటలతో నిన్ను పాయింట్ అవుట్ చేసిన వాళ్లే.. రేపు నీ అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేసేలా ఉండాలి.

నువ్ గెలిచే వరకూ నీ కథ ఎవరికీ అవసరం లేదు.. ఎవరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా.. వినాలన్నా ముందు నువ్వు గెలవాలి..

టాపిక్

తదుపరి వ్యాసం