తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : వెతికితే దొరికేది కాదు ఆనందమంటే.. ఆస్వాదిస్తూ పోవాలంతే

Tuesday Motivation : వెతికితే దొరికేది కాదు ఆనందమంటే.. ఆస్వాదిస్తూ పోవాలంతే

Anand Sai HT Telugu

16 January 2024, 5:00 IST

    • Tuesday Vibes : జీవితంలో చాలా మంది చేసే ఫిర్యాదు.. ఏం చేసినా ఆనందం దొరకడం లేదని. ఆనందం అనేది వెతికితే దొరికేది కాదు.. జీవిస్తున్న క్షణాల్లోనే ఆస్వాదించాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీ కొత్త వస్తువు ఏదో ఒక రోజు పాతపడిపోతుంది..

జీవితంలో జరిగే ప్రతీ చిన్న మార్పును నవ్వుతూ స్వీకరిస్తే ఆనందం మన వెంటే ఉంటుంది..

ఆనందాన్ని అందరూ కోరుకుంటారు. కానీ అది ప్రత్యేకంగా తయారు చేసి ఏం ఉండదు. మన ఆలోచనల్లోనే ఉంటుంది. మనం విషయాలను తీసుకునే పద్ధతిలోనే ఉంటుంది. ఆనందమనేది మనసుకు అనిపించాలి. దానికోసం ప్రత్యేకంగా వెతకడం అవసరం లేదు. జీవిస్తున్న ప్రతిక్షణాన్ని నువ్వేలా చూస్తున్నావో.. దానిపైనే నీ సంతోషం దాగి ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని బాధపడితే బాధే మిగులుతుంది. ఆనందం గురించి ఓ చిన్న కథ చదవండి.

ఒక గ్రామంలో వృద్ధుడు ఉండేవాడు. ఈయన ఒక దురదృష్టవంతుడు. ఈయన చేసే పనులతో గ్రామంలోని ప్రజలు విసిగిపోయేవారు. ఎప్పుడూ ఏదో దిగులుతో ఉండేవాడు. ఏదో ఒక విషయంపై గ్రామంలో ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. నోరు తెరిస్తే విషపూరిత మాటలే వచ్చేవి. దీంతో గ్రామస్థులకు కూడా అతడే అంటే చిరాకు ఏర్పడింది. ఈ కారణంగా దగ్గరకు వెళ్లడం కూడా మానేశారు.

ముసలాయన ఆలోచనలే అతడికి శాపంగా మారాయి. ఆయన మాట్లాడే మాటలకు ఇతరుల సంతోషం కూడా దూరమయ్యేది. అతడికి 80 సంవత్సరాలు వచ్చాయి. కొన్ని రోజులు తన పని తాను చేసుకుంటూ ఎవరి మీద ఫిర్యాదు చేయడం లేదు. చిరునవ్వుతో ఉంటున్నాడు. దీంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి ఆరా తీశారు.

ఏమీ లేదు... 80 ఏళ్లపాటు నేను ఆనందం కోసం వెతుకూ వచ్చాను. ఇతరులు కూడా నాలా బాధపడాలి అనుకున్నాను.. కానీ ఏ రోజూ నాకు సంతోషం దక్కలేదు. ఇప్పుడు ఆ సంతోషాన్ని వెతకడం ఆపేసి.. జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అని సమాధానం చెప్పాడు. ఆనందాన్ని వెతకడం ఆపేస్తేనే సంతోషమని బదులిచ్చాడు. అందుకే ఇప్పుడు ఆనందంగా ఉన్నానని తెలిపాడు.

ఏ మనిషి జీవితం అయినా అంతే.. ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తేనే సంతోషం దక్కుతుంది. గతం గురించి, భవిష్యత్ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకూడదు. ప్రస్తుతం జీవించేవాడే ఆనందంతో ఉంటాడు.

ఆనందం రాలిన జీవితం... నవ వసంతానికై ఎదురుచూస్తుంది..

కారు చీకటి కమ్మిన మనసు.. నిండు వెన్నెలకై ఎదురుచూస్తుంది..

చివరగా మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం దొరుకుతుంది.

తదుపరి వ్యాసం