తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tree Of Life | ప్రపంచంలోనే అతిపెద్ద డ్రాయింగ్‌తో గిన్నిస్‌ రికార్డు.. వీడియో

Tree of Life | ప్రపంచంలోనే అతిపెద్ద డ్రాయింగ్‌తో గిన్నిస్‌ రికార్డు.. వీడియో

21 January 2022, 12:53 IST

  • Tree of Life.. బాస్కెట్‌బాల్‌ కోర్టు మొత్తం ఒకే డ్రాయింగ్‌. అది కూడా ఒకే వ్యక్తి గీసినది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రవి సోనీ అనే వ్యక్తి ఏకంగా 629.98 చదరపు మీటర్లలో ఓ పేద్ద డ్రాయింగ్‌ వేశారు. దీని పేరు Tree of Life. ఈ డ్రాయింగ్‌తో 2020లో ఇటలీకి చెందిన ఆర్టిస్ట్‌ గీసిన రికార్డు మరుగున పడిపోయింది. ఈ పెయింటింగ్‌ వేయడానికి రవి సోనీకి 24 గంటల 33 నిమిషాలు పట్టింది. 
  • నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన రవి.. కరోనా వైరస్‌ మహమ్మారి తర్వాత కార్పొరేట్‌ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి తనకెంతో ఇష్టమైన ఆర్ట్‌ వర్క్‌ వైపు వెళ్లారు. ఈ డ్రాయింగ్‌ కోసం ఆయన ఏడాదిగా సిద్ధమవుతున్నారు. బావోబాబ్‌ అనే చెట్ల నుంచి స్ఫూర్తి పొందిన రవి.. దానినే ఈ ట్రీ ఆఫ్‌ లైఫ్‌గా గీశారు.
  • తొలి రోజు నుంచి ఐదు రోజుల పాటు ఆయన ఎలా ఈ ఆర్ట్ ను గీశారో కింది వీడియోలో చూడొచ్చు.