తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Horoscope | మీరు దూరం పెట్టిన వారికి దగ్గరవ్వండి..

Love Horoscope | మీరు దూరం పెట్టిన వారికి దగ్గరవ్వండి..

HT Telugu Desk HT Telugu

15 March 2022, 6:32 IST

    • మార్చి 15, 2022లో మీ ప్రేమ జ్యోతిష్యం ఎలా ఉందో మీకు తెలుసుకోవాలని ఉంది. భాగస్వామికి తగ్గట్టుగా.. మిమ్మల్ని మీరు మార్చుకోవాలని చూసినా.. లేదా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేమను, ప్రేమ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చూసినా.. వాటికి రాశులు అనుగ్రహిస్తున్నాయో లేదో తెలుసుకోండి. అందుకే ఇది చదవండి.
ప్రేమించిన వారికి దగ్గరవ్వండి..
ప్రేమించిన వారికి దగ్గరవ్వండి..

ప్రేమించిన వారికి దగ్గరవ్వండి..

మేషం

మీరు, మీ భాగస్వామి పూర్తిగా భిన్నమైన లక్ష్యాలు, ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు కనిపించవచ్చు. కాబట్టి మీరు ఒకరితో ఒకరు విభేదిస్తున్నారు. మీ సమస్యలోకి కొంచెం లోతుగా వెళితే, మీరిద్దరూ నిజంగా కోరుకునేది అంత భిన్నంగా లేదనే విషయం మీకు తెలుస్తుంది. ప్రతి బంధానికి హెచ్చు తగ్గులు ఉంటాయని గుర్తుంచుకోండి. సరైన క్షణం వచ్చే వరకు వేచి చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

వృషభం

కొన్ని స్వీయ-పరిశీలన చేయడం ద్వారా మీ శృంగార జీవితంలో అంతర్దృష్టులను పొందవచ్చు. మీ సంబంధాల ఉపరితల అంశాలలో చిక్కుకోకండి. మీరు మొదట్లోనే ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నారు. అది ఎక్కడికి వెళుతోంది అనే విషయాలను నిశితంగా పరిశీలించడం మంచిది. కొంచెం ఆత్మపరిశీలన చేసుకోవడం నిస్సందేహంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

మిథునం

ఈ రోజు నక్షత్రాలు ఒక నిర్దిష్ట సమస్యను.. మెరుగులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కేవలం పగుళ్లను సరిచేయడం మంచిది కాదు. ఇది చాలా హానికరం కాని... అకారణంగా అనిపించే చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే రోజు ఇది. మీ లోతైన భావాలను పరిగణనలోకి తీసుకునే హృదయపూర్వక సంభాషణ మంచిది.

కర్కాటకం

మీ పట్ల చిత్తశుద్ధి లేని విధంగా ప్రవర్తించే వారి కోసం వెతకండి. ఇటీవల కాలంలో మీరు దూరం పెట్టిన వ్యక్తిని పరిశీలించండి. వారితో మరింత ముందుకు వెళ్లడానికి ప్రయత్నించండి. ఇది నిజం కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ వ్యక్తి కొన్ని చర్యలు తక్షణమే కనిపించని లక్ష్యంతో నడిచాయో లేదో పరిశీలించండి.

సింహం

ఈ రోజు మీరు ఎంత ప్రేమపూర్వక సంబంధాలు ఏర్పరుచుకుంటే.. అంత ప్రశాంతంగా ఉంటారు. మీరు పని పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నందున.. కొన్నిసార్లు మీ వ్యక్తిగత జీవితాన్ని మరచిపోవచ్చు. కొంత నైతిక మద్దతు కోసం.. మీ కుటుంబం, స్నేహితులను సంప్రదించండి. కమ్యూనికేషన్ అనేది మీ హృదయాన్ని స్వస్థపరచడంలో మీకు సహాయం చేస్తుంది.

కన్య

మీ ప్రేమ జీవితంలో ఒకప్పటికన్నా.. ఇప్పుడు ఉత్సాహం లోపించిందని మీరు భావించవచ్చు. మీ భాగస్వాముల ఆమోదం పొందడానికి.. మీకు ఎవరో మార్చుకోమని చెప్పిన సలహాలను మాత్రం పాటించకండి. మీ ప్రశాంతమైన, శాంతియుతమైన ప్రవర్తనను గుర్తించి.. విలువైన వ్యక్తులు మీకు తోడుగా, భరోసాగా ఉంటారు.

తుల రాశి

మీకు లేదా మీ భాగస్వామికి నిజాయితీపై సందేహాలు ఉంటే ఈ రోజు సంఘటనలు కొద్దిగా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. నిజం వెల్లడించినప్పుడు.. మీరు ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది. ఇది మీకు గొప్ప ఇబ్బంది, అపరాధం కలిగిస్తుంది.

వృశ్చికం

మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక వ్యూహాన్ని రూపొందించండి. మీరు ఈ కనెక్షన్ గురించి సీరియస్​గా ఉంటే, మీరు మరింత వాస్తవికంగా ఉండాలి. ఈ కనెక్షన్ పని చేయడానికి మీరు పూర్తిగా ప్రయత్నించాల్సి ఉంది. ఆహ్లాదకరమైన డైలాగ్స్​తో మీరు త్వరగా తిరిగి ట్రాక్‌లోకి వస్తారు. అవసరమైతే ఒకరికొకరు ఆర్థికంగా పంచుకోండి.

ధనుస్సు

మీ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఎవరూ జీవించనందున మీరు సంప్రదించిన ప్రతి ఒక్కరిపై నమ్మకాన్ని కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలాంటి రోజుల్లో, మీ ఆత్మ సహచరుడు ఎవరో ఆలోచించడం తప్ప మీరు ఏమీ చేయకూడదనుకోవచ్చు. ఈ ఆలోచనలు హానిచేయనివి, కొంత స్వీయ-ఆవిష్కరణకు దారితీయవచ్చు.

మకరం

ఈ రోజు మీరు మీ ప్రియురాలి ఆలోచనల్లో మునిగిపోతారు. మీరు ఇష్టపడే వ్యక్తిపై మీ మనస్సు సంచరించడానికి మీరు ఇష్టపడతారు. ఒకరికొకరు మీ భావాలను వ్యక్తపరచుకునే సందర్భాలు వస్తాయి. ఈ సమయంలోనే జాగ్రత్తగా ఉండండి. మోసపోకండి. స్థిరంగా ఉండి.. ఆలోచించండి.

కుంభం

మీ సంబంధం బహిరంగంగా, నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్‌తో నిర్మించబడింది. అయితే కొన్నిసార్లు కొన్ని పదాలు మీరు కోరుకున్న విధంగా బయటకు రావు. ఈ రోజు మీ హృదయం మీ భాగస్వామికి తెరిచిన పుస్తకమని మీరు నేర్చుకుంటారు. మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారో అనే విషయంపై గర్వపడతారు. మీ భావాలను ప్రసారం చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.

మీనం

మీరు సంబంధంలో ఉన్నప్పటికీ.. మీ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఎక్కడ మెరుగుపడగలరో గుర్తించండి. మీ భాగస్వామి లేదా ఇతరులు చేసే పనిని బట్టి తేలికగా మారవచ్చు. కానీ ఎవరైనా మిమ్మల్ని ప్రాంప్ట్ చేసినా చేయకపోయినా మీ సొంతంగా చేసుకునే ఎంపికల వల్ల మీ జీవితంలో అతిపెద్ద మార్పులు వస్తాయి. మీ మనసుకు మీరే డ్రైవర్​గా ఉండండి.

తదుపరి వ్యాసం