తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : స్పైస్డ్ చియా పుడ్డింగ్ గురించి విన్నారా? ఇలా చేసుకుని తినేయండి మరి

Breakfast Recipe : స్పైస్డ్ చియా పుడ్డింగ్ గురించి విన్నారా? ఇలా చేసుకుని తినేయండి మరి

19 August 2022, 9:11 IST

    • రోటీన్ బ్రేక్​ఫాస్ట్​లకు బ్రేక్ ఇచ్చి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునే వారికి.. స్పైస్డ్ చియా పుడ్డింగ్ బెస్ట్ ఆప్షన్. పేరుకు తగ్గట్లే.. స్పైసీనెస్​తో జిహ్వానికి ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. 
స్పైస్డ్ చియా పుడ్డింగ్
స్పైస్డ్ చియా పుడ్డింగ్

స్పైస్డ్ చియా పుడ్డింగ్

Spiced Chia Seed Pudding : హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. విత్ స్పైసీగా కావాలనుకుంటే.. స్పైస్డ్ చియా పుడ్డింగ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దీనిలో హెల్త్​కి మంచి చేసే మసాలాలతో పాటు.. ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు కూడా ఉంటాయి. పైగా దీనిని తయారు చేసుకోవడం చాలా సింపుల్​ కూడా. దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

కావాల్సిన పదార్థాలు

* పాలు - 2 కప్పులు

* కుంకుమ పువ్వు - చిటికెడు

* యాలకుల పొడి - పావు టీస్పూన్

* దాల్చిన చెక్క పొడి - పావు టీస్పూన్

* వెనిలా ఎక్స్​ట్రాక్ట్ - పావు టీస్పూన్

* చియా సీడ్స్ - 6 టేబుల్ స్పూన్స్

* సర్వీంగ్ కోసం - బెర్రీలు లేదా మీ నచ్చిన ఫ్రూట్స్ వాడుకోవచ్చు

* స్వీట్నర్స్ - మీకు నచ్చినది..

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి.. పాలను మీడియం మంట మీద వేడి చేయాలి. దానిలో కుంకుమపువ్వు వేసి మరిగించాలి. కుంకుమపువ్వు పాల మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ఏలకుల పొడి, దాల్చినచెక్క పొడి, వెనిలా ఎక్స్​ట్రాక్ట్ వేసి బాగా కలపాలి. దానిలో చియాసీడ్స్ వేసి.. బాగా కలపాలి.

కనీసం 2 గంటలు ముందైనా లేదా రాత్రి అయినా ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్​లో పెట్టాలి. ఇది చల్లగా అయిన తర్వాత.. మీకు ఇష్టమైన ఫ్రూట్స్​తో గార్నీష్ చేసి.. స్వీట్​నర్​తో కలిపి తీసుకోవచ్చు. దీనిలో డ్రై ఫ్రూట్స్​ కూడా వేసుకుని బ్రేక్​ఫాస్ట్​గా కుమ్మేయొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం