తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipes : ఎగ్​ చపాతీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?

Breakfast Recipes : ఎగ్​ చపాతీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?

28 June 2022, 9:16 IST

    • ఉదయాన్నే చాలా మంది చపాతీలు తినడానికి ఇష్టపడతారు. అయితే వాటిని కాస్త వెరైటీగా చేసుకోవాలనుకునే వారు ఈ ఎగ్ చపాతీని తయారు చేసుకోవచ్చు. ఇది మీకు మంచి టెస్టీ బ్రేక్​ఫాస్ట్ అవుతుంది.
ఎగ్ చపాతీ
ఎగ్ చపాతీ

ఎగ్ చపాతీ

Egg Chapati : ఎగ్​ చపాతీని చాలా సులభమైన బ్రేక్ ఫాస్ట్. పిల్లల టిఫిన్‌లో ప్యాక్ చేయడానికి, మీరు ఆఫీస్​కు తీసుకువెళ్లడానికి కూడా ఇది మంచి ఎంపిక. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

ఎగ్ చపాతీకి కావాల్సిన పదార్థాలు

* గోధుమ పిండి - 2 కప్పులు

* గుడ్లు - 3

* ఉల్లిపాయ - 1 చిన్నది

* పచ్చిమిర్చి - సన్నగా తరిగినవి

* క్యాప్సికమ్ - సగం (సన్నగా తరగాలి)

* ఉప్పు - రుచికి తగినంత

* కారం - 1/4 టీస్పూన్

* మిరియాల పొడి - 1/4 టీస్పూన్

* ధనియా పౌడర్ - కొంచెం

ఎగ్ చపాతీ తయారీ విధానం

ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండిని తీసుకుని.. నీటి సహాయంతో బాగా కలపాలి. పిండిని కొంచెం కొంచెం తీసుకుని.. చపాతీలు చేసుకోవాలి.

ఒక గిన్నెెలో గుడ్లు, ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియా పౌడర్, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి పక్కన పెట్టుకోవాలి.

అనంతరం పాన్ మీద కొద్దిగా నూనె వేసి రోటీని కాల్చండి. ఒక వైపు కాల్చిన తర్వాత.. మరొక వైపు తిప్పండి. దానిపై కొంచెం గుడ్డు మిశ్రమాన్ని పోయాలి. కాస్త నూనె వేసి.. చపాతీని కాల్చాలి. గుడ్డు మిశ్రమాన్ని వైపు కూడా రోస్ట్ చేసి.. వేడి చపాతీని.. రైతా లేదా చట్నీతో లాగించేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం