తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bushy Money Plant: మనీ ప్లాంట్‌ ఆరోగ్యంగా, గుబురుగా పెరగాలంటే.. చిట్కాలు

Bushy Money Plant: మనీ ప్లాంట్‌ ఆరోగ్యంగా, గుబురుగా పెరగాలంటే.. చిట్కాలు

03 December 2023, 14:45 IST

  • Bushy Money Plant: మనీప్లాంట్ గుబురుగా, ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మొక్క నాటే దగ్గర నుంచి, ఎదిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెల్సుకోండి.

మనీ ప్లాంట్
మనీ ప్లాంట్

మనీ ప్లాంట్

పసుపు పచ్చటి ఆకులతో ఆహ్లాదాన్ని పంచే తీగ జాతి మొక్క మనీ ప్లాంట్‌. చిన్న బాల్కనీల నుంచి పెద్ద మిద్దె తోటల వరకు.. ఇంట్లో పెంచుకునే దగ్గర నుంచి ఆరుబయట వేలాడే బాస్కెట్‌ వరకు ఎక్కడైనా ఇది చక్కగా ఒదిగిపోతుంది. చక్కగా వేల్లాడుతూ ఆ చోటుకే పచ్చని కళను తెచ్చి పెడుతుంది. దీన్ని పెంచడం చాలా తేలికే. అయితే అదెలాగో తెలిసినప్పుడు మాత్రమే దీన్ని ఆరోగ్యంగా పెంచగలుగుతాం. చాలా మంది దీన్ని పాతినా అస్సలు సరిగ్గా నాటుకోదు. ఎప్పుడూ చచ్చిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇది చక్కగా గుబురుగా ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. దీన్ని పాతే సమయం నుంచీ జాగ్రత్తలు తీసుకుంటే ఇవి ఎక్కడైనా చాలా తేలిగ్గా, గుబురుగా పెరిగేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

పాతే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

చాలా మంది మనీ ప్లాంట్‌ని పాతాలంటే ఓ పెద్ద తీగను తెచ్చి దాన్ని అలాగే పాతేస్తూ ఉంటారు. అందువల్ల చాలా సార్లు అది వేరు రాకుండా చనిపోతూ ఉంటుంది. అయితే పాతేటప్పుడు ఈ చిన్న చిట్కాని పాటించాలి. పొడవుగా ఉన్న మనీ ప్లాంట్‌ తీగను తీసుకురండి. దాన్ని శుభ్రం చేసిన చాకు లేదా కత్తెరతో కత్తిరించండి. ఒక ఆకు, కణుపు ఉండేలా చూసుకోవాలి. అలా కణుపుతో ఉన్న ప్రతి ఒక ఆకును వేరు వేరే ముక్కలుగా చేసేయండి.

కణుపు దగ్గర భాగంలో వేళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ భాగంలో ఎలాంటి దెబ్బా తినకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. ఇప్పుడు కుండీలోకి సారవంతమైన మట్టిని తీసుకుని దాన్ని పూర్తిగా నీటితో తడపండి. ఆ మట్టి.. నీటిని పీల్చుకుని మెత్తగా అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక్కో ఆకును మట్టిలోకి జాగ్రత్తగా గుచ్చుతూ వెళ్లండి. అలా వీలైనన్ని ఆకుల్ని ఒకే కుండీలో గుచ్చండి. వారం నుంచి పది రోజులకు ఆ ఆకులు అన్నీ వేల్లూనుకుంటాయి. నెల రోజుల తర్వాత నుంచి అవి క్రమ క్రమంగా పెరగడం ప్రారంభం అవుతుంది. ఒక్కో ఆకు ఒక్కో తీగగా ఎదగడం మొదలవుతుంది. ఆకులు అన్నీ అలా ఎదిగే సరికీ ఎంతో గుబురుగా ఆ మొక్క తయారవుతుంది.

మనీ ప్లాంట్‌ని ఆరోగ్యవంతంగా చూసుకోవడం ఎలా :

ఈ మొక్కకి రెండు గంటల కంటే తక్కువ సమయం ఎండ పడే చోట్ల పెట్టుకోవాలి. మట్టిలో నీరు పూర్తిగా లేనప్పుడు మాత్రమే నీరు పోయాలి. అలాగే పోషకాల కోసం ఉల్లిపాయ తొక్కల్ని నీటిలో వేసి రెండురోజుల పాటు ఊరనివ్వాలి. వాటిని వడగట్టి ఆ నీటిని వారానికి ఒక సారి వీటికి అందివ్వాలి. మూడు నెలలకు ఒకసారైనా వీటిని ప్రూనింగ్‌ చేయాలి. అప్పుడు మాత్రమే ఇవి ఆరోగ్యంగా, గుబురుగా ఎదుగుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం