తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Facial Hair : ముఖంపై అవాంఛిత రోమాల‌ు ఉన్నాయా? అయితే ఇలా ఈజీగా తొలగించుకోండి!

Facial Hair : ముఖంపై అవాంఛిత రోమాల‌ు ఉన్నాయా? అయితే ఇలా ఈజీగా తొలగించుకోండి!

HT Telugu Desk HT Telugu

17 June 2022, 22:30 IST

    • Facial Hair Removal:  చాలా మంది మహిళలు అవాంఛనీయ రోమాల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. అయితే వీటిని ఇంట్లో ఉండే కొన్ని ఈజీ రెమిడీస్‌తో శాశ్వతంగా తొలగించుకోవచ్చు.
Facial Hair
Facial Hair

Facial Hair

కొంత మంది మహిళలు ముఖంపై అవాంఛిత రోమాలు రావడం వల్ల చాలా ఇబ్బందిక‌రంగా ఫీల్ అవుతుంటారు. ఈ సమస్య హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన, PCOS లేదా PCOD కారణాలతో పాటు.. అంతర్గత ఆరోగ్య సమస్యలైన వైరలైజేషన్, హిర్సుటిజం వంటి మొదలైన కారణాల వల్ల వస్తుంటాయి.  కారణం ఏమైనప్పటికీ, ముఖంపై వెంట్రుకలు పెరగడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలను ఎదర్కొనే స్త్రీలు కొన్ని సహజమైన మార్గాల ద్వారా సులభంగా తొలగించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Walking Without Footwear : కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు.. ఎందుకని ఆలోచించారా?

Cucumber Lassi Benefits : దోసకాయ లస్సీ.. 5 నిమిషాల్లో రెడీ.. శరీరాన్ని చల్లబరుస్తుంది

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

Chewing Food : ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలితే ఆరోగ్యానికి మంచిది

అవాంఛిత రోమాలు వదిలించుకోవడానికి చిట్కాలు:

 

గుడ్డు తెల్లసొన: గుడ్డులోని తెల్లసొనను తీసుకుని దానికి మొక్కజొన్న పిండి, చక్కెరను కలిపి బాగా మిక్స్ చేసి కొద్ది సేపటి తర్వాత ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

పాలు, పసుపు: మిక్సింగ్ గిన్నెలో బియ్యం పిండి, పసుపు పొడి, పాలు తీసుకుని బాగా కలిపి.. మిశ్రమాన్ని అవాంఛనీయ రోమాలపై అప్లై చేసి కొద్ది సేపటి వరకు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

నిమ్మరసం, పంచదార: నిమ్మరసం, పంచదార, తేనెను కలిపి మెత్తని పేస్ట్‌ను తయారు చేయండి. అవసరమైతే, కొద్దిగా నీరు వేసి 2-3 నిమిషాలు వేడి చేయండి. తర్వాత వెంట్రుకలపై కొద్దిగా మైదాను చిలకరించిన తర్వాత పేస్ట్‌ను అప్లై చేయండి. ఇలా వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

నేరేడు పండు, తేనె: నేరేడు పండు, తేనెను తీసుకుని మెత్తగా కలిసి ముఖం ఉన్న వెంట్రుకలపై మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి మూడు సార్లు అప్లై చేయండి.

వెల్లుల్లి: వెల్లుల్లి సెమీ-ఫైన్ పేస్ట్‌ను వెంట్రుకలు ఉన్న ప్రదేశాలకు రాయండి. అరగంట తర్వాత కడిగేయాలి. దీనిని రోజుకు ఒకసారి అప్లై చేయండి. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ నివారణను ఉపయోగించవద్దు.

టాపిక్

తదుపరి వ్యాసం