తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oil Food : ఆయిల్ ఫుడ్ తిన్నాక పొట్ట ఇబ్బందిగా ఉంటుందా? ఈ పానీయాలతో చెక్ చెప్పేయండి

Oil Food : ఆయిల్ ఫుడ్ తిన్నాక పొట్ట ఇబ్బందిగా ఉంటుందా? ఈ పానీయాలతో చెక్ చెప్పేయండి

HT Telugu Desk HT Telugu

05 December 2023, 18:30 IST

    • Stomach Upset : నూనెతో చేసిన ఆహార పదార్థాలు తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? రిలీఫ్ కోసం కూల్ డ్రింక్స్ కాకుండా ఈ పానీయాలు తాగండి. ఉపశమనం కలగడమే కాదు ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఆయిల్ ఫుడ్ సమస్యలకు చిట్కాలు
ఆయిల్ ఫుడ్ సమస్యలకు చిట్కాలు

ఆయిల్ ఫుడ్ సమస్యలకు చిట్కాలు

నాన్ వెజ్ తో చేసిన ఫ్రైస్ తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ వంటకాలు ఆరగించేస్తారు. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వులు బరువు పెంచేస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలని పెంచుతాయి.

తినడం వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత అసలు సమస్య. కాసేపటికి కడుపులో గడబిడ మొదలైపోతుంది. వికారంగా కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో చాలా మందికి తెలియదు. మీ కడుపు సమస్యల్ని తొలగించేందుకు ఈ ఐదు ఆరోగ్యకరమైన పానీయాలు ట్రై చేసి చూడండి.

వేడి నీళ్ళు

ఆయిల్ ఫుడ్స్ తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు తాగితే రిలీఫ్ గా ఉంటుంది. కొవ్వులని విచ్చిన్నం చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. భారీ భోజనం చేసిన తర్వాత వేడి నీరు తాగితే ఆహారం జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. వేడి నీరు జీర్ణాశయం కండరాలు సడలించేలా చేస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.

సూప్

కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో చేసిన డిటాక్స్ డ్రింక్స్, సూప్ తాగిన మీ పొట్ట ఉబ్బరం తగ్గిపోతుంది. పోషకాలు అధికంగా ఉండే ఇవి శరీర డిటాక్స్ చేయడానికి మద్దతు ఇస్తాయి. ఈ పానీయాలు జీర్ణక్రియకి సహాయపడతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు అందిస్తాయి. ఇటువంటి డిటాక్స్ డ్రింక్స్ లేదా సూప్ లు ఆయిల్ ఫుడ్స్ తిన్న తర్వాత తీసుకుంటే ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది.

ప్రొ బయోటిక్ పానీయాలు

పేగులకు మేలు చేసే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఈ పానీయాల ద్వారా పొందవచ్చు. ప్రొ బయోటిక్ జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వులని విచ్చిన్నం చేస్తాయి. అందుకే నూనెతో చేసిన పదార్థాలు తీసుకున్న వెంటనే వీటిని తాగడానికి ఎంచుకోండి.

ఫెన్నెల్ నీరు లేదా టీ

ఆహారం అరుగుదల విషయంలో సోంపు గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మసాలా ఆహారం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వీటిని నోట్లో వేసుకుని నములుతారు. ఆయిల్ ఫుడ్ తిన్నాక సోంపు గింజలతో చేసిన నీరు లేదా టీ తాగితే జీర్ణక్రియకి ఎటువంటి ఆటంకం ఉండదు. ఉబ్బరం, పొట్టలో అసౌకర్యం సమస్యల్ని నయం చేస్తుంది. కొన్ని సోంపు గింజలు నీటిలో వేసుకుని బాగా మరిగించుకుని తాగొచ్చు. ఇది మీకు చక్కటి రిలీఫ్ అందిస్తుంది.

గ్రీన్ టీ

ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే గ్రీన్ టీలో క్యాటెచిన్స్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరానికి హాని చేసే కొవ్వుని కరిగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. జీర్ణ ఎంజైమ్ ల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పొట్ట ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని పాలీఫెనాల్స్ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అధిక నూనెతో చేసిన ఆహార పదార్థాలు తీసుకున్నాక గ్రీన్ టీ తాగితే పొట్టలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రిఫ్రెష్ అందిస్తుంది.

తదుపరి వ్యాసం