తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sexual Dysfunction: ఈ సమస్యలు ఉంటే శృంగారానికి ఇబ్బందే! జాగ్రత్త

Sexual Dysfunction: ఈ సమస్యలు ఉంటే శృంగారానికి ఇబ్బందే! జాగ్రత్త

HT Telugu Desk HT Telugu

28 July 2023, 22:04 IST

    • Sexual Dysfunction: కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు శృంగారంలో పూర్తిస్థాయిలో సంతృప్తి పొందలేరు. శృంగారానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమస్యలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Sexual Dysfunction: ఈ సమస్యలు ఉంటే శృంగారంలో ఇబ్బందే! జాగ్రత్త
Sexual Dysfunction: ఈ సమస్యలు ఉంటే శృంగారంలో ఇబ్బందే! జాగ్రత్త

Sexual Dysfunction: ఈ సమస్యలు ఉంటే శృంగారంలో ఇబ్బందే! జాగ్రత్త

Sexual Dysfunction: సంపూర్ణ ఆరోగ్యం అనేది లైంగిక ఆరోగ్యానికి నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. శృంగారం చేయడంలో ఇబ్బందులు ఉన్న వారికి గుండె సంబంధిత, జీవక్రియకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని పలు అధ్యయనాలు తేల్చాయి. సెక్స్ సరిగా చేయలేకపోతే పూర్తి సంతృప్తిని పొందలేరు. అలాగే, సంతానోత్పత్తికి కష్టమవుతుంది. అయితే, ఆరోగ్యపరంగా కొన్ని రకాల సమస్యలు ఉంటే శృంగారం సంపూర్ణంగా చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయి. సెక్స్‌లో పూర్తి స్థాయి సంతృప్తి పొందలేకపోవచ్చు. అలా, శృంగారంపై ప్రభావం చూపే ఆరోగ్య సమస్యలు ఏవో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

ఊబకాయం

శరీరంలో అధిక కొవ్వు వల్ల ఊబకాయం ఏర్పడితే శృంగారానికి ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఊబకాయం ఉన్న పురుషుల్లో టెస్టోస్టిరాన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అంగస్తంభన సమస్య ఏర్పడే అవకాశాలు ఉంటాయి. లైంగిక కోరికలు తగ్గడం, ఉద్వేగాలు తక్కువగా ఉండడం జరగొచ్చు. ఊబకాయం ఉన్న మహిళల్లో హర్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే, సెక్స్ చేసుకునే సమయంలో అసౌకర్యంగానూ ఉంటుంది.

ఈ వ్యాధుల వల్ల..

గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు ఉంటే కూడా సెక్సువల్ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవి ఉండే అంగస్తంభనకు కారణమైన రక్తప్రవాహానికి ఇబ్బందిగా ఉంటుంది. స్త్రీలలోనూ రక్త ప్రవాహం అంత మెరుగ్గా లేక ఉద్రేకం, ఉద్వేగం తక్కువగా ఉంటుంది. లైంగిక సంతృప్తి పూర్తిగా ఉండదు.

డయాబెటిస్

రక్తనాళాలు, నరాలపై డయాబెటిస్ చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. డయాబెటిస్ ఉన్న చాలా మందిలో అంగస్తంభన సరిగా ఉండదు. మధుమేహం ఉన్న కొందరు పురుషులు, స్త్రీల్లో లైంగిక కోరికలు, ఉద్వేగం తక్కువగా ఉంటాయి.

మానసిక సమస్యలు

మానసిక ఒత్తిడి, ఆందోళన సమస్యలు సెక్స్‌పై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సమస్యలు ఉన్న వారికి శృంగారంపై కోరిక తక్కువగా ఉంటుంది. ఉద్రేకం తక్కువ ఉంటుంది. కాన్ఫిడెన్స్ తగ్గి ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్యలు ఉన్న వారు కౌన్సెలింగ్, రిలాక్సేషన్ టెక్నిక్లతో పాటు సంబంధిత మందులను వాడితే సెక్సువల్ పనితీరు మెరుగయ్యే ఛాన్స్ ఉంటుంది.

జీవన శైలి పరమైన వ్యాధులను, సమస్యలను ప్రాథమికంగానే గుర్తించి ఆరోగ్యకరమైన ఆహారం, ప్రతీ రోజు వ్యాయామం చేయడం, ఒత్తిడి ఎక్కువ గురి కాకుండా ఉండడం, అవసరమైతే వ్యాధులకు చికిత్స తీసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయితే, శృంగారానికి ఇబ్బందిగా మారే సమస్యలకు గురి కాకుండా ఉండొచ్చు. లైంగిక పరమైన సమస్యలు ఉంటే సంబంధిత వైద్య నిపుణులను వీలైనంత త్వరగా సంప్రదించడం మంచిది. సెక్స్ థెరపీ, సైకోథెరపి, సెల్ఫ్ స్టిమ్యులేషన్ టెక్నిక్‍లు చాలా మందికి ఉపకరిస్తాయని అధ్యయనాల ద్వారా తేలింది.

తదుపరి వ్యాసం