తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bad Breath : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడకండి.. ఇవి తిని సమస్యను తగ్గించుకోండి..

Bad Breath : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడకండి.. ఇవి తిని సమస్యను తగ్గించుకోండి..

20 August 2022, 9:00 IST

    • Bad Breath : మనం తినే ఆహారం చాలాసార్లు నోటిలో బ్యాక్టీరియాను సృష్టిస్తుంది. ఈ సమస్యతో మనం ఎక్కువగా మాట్లాడటానికి ఇబ్బంది పడతాం. మీరు కూడా ఆ సమస్యతో బాధపడుతుంటే.. సహజంగా నోటి దుర్వాసనతో పోరాడే ఆహారాలను మీ జాబితాలో చేర్చుకోండి. సమస్యను తగ్గించుకోండి. 
నోటి దుర్వాసన
నోటి దుర్వాసన

నోటి దుర్వాసన

Bad Breath : నోటి దుర్వాసన అనేది ఒక సాధారణ పరిస్థితి. ఇది పరిశుభ్రత లేకపోవడం లేదా ఇతర దీర్ఘకాల నోటి వ్యాధుల లక్షణం వల్ల వస్తుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహారాలలో రక్తం ద్వారా రవాణా అయ్యే దుర్వాసన గల నూనెలు ఉంటాయి. ఆ నూనెలు ఊపిరితిత్తులకు చేరుతాయి. అప్పుడు మీ నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశముంది. అయితే కొన్ని ఆహారాలు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అవి నోటి దుర్వాసనతో పోరాడుతాయి. నోటి దుర్వాసనతో పోరాడే ఆహారాల జాబితాను ఇప్పుడే తెలుసుకోండి. వాటితో సమస్యను దూరం చేసుకోండి. అవి ఏంటంటే..

ట్రెండింగ్ వార్తలు

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

Pregnancy Tips : గర్భధారణలో సమస్యలను సూచించే సంకేతాలు, లక్షణాలు ఇవే

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

1. గ్రీన్ టీ

గ్రీన్ టీలో కాటెచిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది దుర్వాసన కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను తగ్గించడం ద్వారా బ్యాక్టీరియాను నిరోధించగలదు.

2. సిట్రస్ పండ్లు

నిమ్మ, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను అదుపులో ఉంచడానికి మాత్రమే కాకుండా.. చిగుళ్ల వ్యాధులు, చిగురువాపుతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.

3. పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) ఉంటుంది. ఇది చెడు దుర్వాసన వచ్చే బ్యాక్టీరియాను అధిగమించగలదు. ఇందులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో క్రిముల అభివృద్ధిని తగ్గిస్తుంది.

4. తులసి (తులసి)

తులసిలోని పాలీఫెనాల్స్ అనే సహజ అణువులు నోటి దుర్వాసనకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధన వెల్లడించింది. తులసి భారతీయ ఇళ్లలో సులభంగా దొరుకుతుంది.

5. అల్లం

అల్లంలో ఉండే 6-జింజెరాల్ నోటిలోని సల్ఫర్ సమ్మేళనాల విచ్ఛిన్నానికి సహాయపడే లాలాజల ఎంజైమ్‌ను సక్రియం చేస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం