తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prevent Obesity : ఈ 5 ఆసనాలతో.. ఊబకాయం తగ్గించుకోవచ్చు..

Prevent Obesity : ఈ 5 ఆసనాలతో.. ఊబకాయం తగ్గించుకోవచ్చు..

14 July 2022, 10:04 IST

• Prevent Obesity : ఊబకాయం అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే పదిమందిలో నలుగురు దీనితో సఫర్ అవుతున్నవారే. ఈ సమస్యతో ఉన్నవారు మెడిసిన్​తో పాటు పలు ఆసనాలు వేస్తూ ఉంటే.. సమస్యనుంచి బయటపడుతారు అంటున్నారు యోగానిపుణులు. మరి ఏ ఆసనాలు వేస్తే ఊబకాయాన్ని నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఊబకాయం
ఊబకాయం

ఊబకాయం

Prevent Obesity : ఊబకాయం అనేది తినే ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి లక్షణాల వల్ల వస్తుంది. అయితే ఇది వస్తే కనుక బరువు చాలా వేగంగా పెరిగిపోతారు. ఆరోగ్య పరిస్థితి అంతా మారిపోతుంది. అయితే డాక్టర్​ వద్ద చికిత్స తీసుకోవడం ఎంత ముఖ్యమో.. దానికి తగిన శ్రద్ధ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఊబకాయాన్ని నివారించడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి. దానిలో యోగాను చేర్చాలి. బరువు తగ్గడానికి ఈ 5 యోగా భంగిమలను ట్రై చేయాలని అంటున్నారు యోగానిపుణులు. దీనివల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Tuesday Motivation : అందాన్ని చూసి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకు.. అంతమించిన విషయాలు చాలా ఉంటాయి

Talking In Sleep : నిద్రలో మాట్లాడే సమస్య ఉంటే బయటపడేందుకు సింపుల్ చిట్కాలు

Liver Cancer Symptoms : ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.. కాలేయ క్యాన్సర్ కావొచ్చు

ICMR On Weight Loss : వారంలో ఎంత బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది.. తగ్గేందుకు టిప్స్

ఊబకాయం తగ్గించుకోవడానికి త్రికోణాసనం

త్రికోణాసనం

ఇది జీర్ణక్రియ మెరుగుదలతో పాటు పొట్ట, నడుము కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం అంతటా రక్త ప్రసరణను పెంచి.. చర్యను వేగవంతం చేస్తుంది. ఈ భంగిమ పొత్తికడుపు కొవ్వును కోల్పోవడానికి, మీ తొడల వద్ద కొవ్వును తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఈ భంగిమలో కండరాలు వణుకుతున్నట్లు అనిపించినప్పటికీ.. అదే సానుకూల ప్రభావాలను ఇస్తుంది. అదనంగా మీ దృష్టిని, ఏకాగ్రతను పెంచుతుంది.

ఊబకాయం తగ్గించుకోవడానికి ధనురాసనం

ధనురాసనం

మీరు పొట్ట కొవ్వును పోగొట్టుకోవడానికి అత్యుత్తమ వ్యూహాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు ధనురాసనం చేయొచ్చు. ఈ ఆసనంలో పొత్తికడుపుపై శరీర బరువు ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంపొందించి.. తొడలు, ఛాతీ, వీపును బలపరుస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ మీ కండరాలను బలోపేతం చేయడానికి, టోన్ చేయడానికి సహాయపడుతుంది.

ఊబకాయం తగ్గించుకోవడానికి అథో ముఖ స్వనాసన

అథో ముఖ స్వనాసన

అథో ముఖ స్వనాసన నిర్దిష్ట కండరాలపై కొంచెం ప్రెజర్ ఇచ్చి.. మీ మొత్తం శరీరాన్ని టోన్ చేస్తుంది. ఫలితంగా మీ చేతులు, కాళ్లు, హామ్ స్ట్రింగ్స్, వీపు అన్నీ బలపడతాయి. మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు మీ కండరాలు టోన్ అవుతాయి. ఇది మీ దృష్టి, రక్త ప్రసరణను కూడా పెంచుతుంది.

ఊబకాయం తగ్గించుకోవడానికి బ్రిడ్జ్ పొజిషన్

బ్రిడ్జ్ పొజిషన్

సేతు బంధ సర్వంగాసనాన్నే.. బ్రిడ్జ్ పొజిషన్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక ప్రయోజనాలతో కూడిన మరొక భంగిమ. బరువు తగ్గడం, థైరాయిడ్ ఆరోగ్యం, మెరుగైన జీర్ణక్రియకు ఇది అద్భుతమైనది. వంతెన భంగిమ థైరాయిడ్ పనితీరు, జీర్ణక్రియ, హార్మోన్ నియంత్రణ, కండరాల టోన్‌ను పెంచుతుంది. అదనంగా ఇది మీ వెనుక కండరాలను బలపరుస్తుంది. వెనుక అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఊబకాయం తగ్గించుకోవడానికి వారియర్ పోజ్..

వారియర్ పోజ్

వారియర్ ఆసనంలో మీ చేతులు, కాళ్లు టోన్ అవుతాయి. అదే సమయంలో మీ బ్యాలెన్స్‌ను కూడా మెరుగుపరుస్తుంది. మీరు పొజిషన్‌ను కొనసాగించేటప్పుడు మీ అబ్స్‌ను బిగిస్తే.. అది మీ పొట్టను టోన్ చేసి.. ఫ్లాట్ బొడ్డును అందిస్తుంది. మీరు ఈ భంగిమపై ఎంత శ్రద్ధ వహిస్తే.. అన్ని మంచి ఫలితాలు పొందుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం