తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మెడ నొప్పి రకాలు.. తెలుసుకొని జాగ్రత్త పడండి!

మెడ నొప్పి రకాలు.. తెలుసుకొని జాగ్రత్త పడండి!

HT Telugu Desk HT Telugu

05 August 2022, 22:39 IST

    • ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సాధరణ సమస్య మెడ నొప్పి. అయితే మెడ నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. 
Neck pain
Neck pain

Neck pain

మెడ నొప్పి అనేది చాలా సాధారణమైన మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్ , ఇది ప్రతి ముగ్గురిలో ఒకరిని కనీసం సంవత్సరానికి ఒకసారి ప్రభావితం చేస్తుంది. ఇది తేలికపాటిగా లేదా తీవ్రంగా ఉండవచ్చు. ఈ మెడ నుండి క్రమంగా మెుదలై భుజాలు,చేతులు అంతటా వ్యాపించవచ్చు. తలనొప్పికి కూడా దారితీయవచ్చు. మెడలో ఈ అసౌకర్యం పరిస్థితిని మల్టిఫ్యాక్టోరియల్ వ్యాధిగా పిలుస్తుంటారు. సాధారణ శారీరక వ్యాయామం, సమతుల్య ఆహారం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో మెడ నొప్పిని అరికట్టవచ్చు.

ఢిల్లీలోని జనక్‌పురిలోని మాతా చనన్ దేవి హాస్పిటల్‌ సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ జగ్జిత్ సింగ్ మెడ నొప్పిలో గల వివిధ రకాలను వివరించారు. వాటిలో కొన్ని రకాలు:

1. ఆక్సిపిటల్ న్యూరల్జియా - ఇది ఒక రకమైన తలనొప్పి, దీనిలో మెడ పైభాగం, తల వెనుక భాగం. చెవుల వెనుక భాగంలో నొప్పి ఉంటుంది. ఆక్సిపిటల్ నరాలు, తల మీద గుండా వెళతాయి. వీటిపై వాపు లేదా గాయం ఏర్పడినప్పుడు ఆక్సిపిటల్ న్యూరల్జియాకు కారణమవుతుంది.

2. Cervical Radiculopathy - వీటిని పించ్డ్ నరాల అని పిలుస్తారు, ఇది సాధారణంగా మెడలో డిస్క్ హెర్నియేషన్ నుండి వృద్ధి చెందుతుంది. ఇది కొన్ని సమయాల్లో మెడ, భుజం, చేయి, వేళ్లలో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఇది మెడ కలిగించే పరిస్థితులలో ఇది ఒకటి. ఈ రకమైన నొప్పికి వైద్య శాస్త్రంలో అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి.

3. ఫేస్ ఆర్థ్రోపతి (Facet Arthropathy ) - వెన్నుపూస కీళ్ల ఆర్థరైటిస్‌ కారణంగా మెడలో నొప్పి కలుగుతుంది. ఈ కారణంగా ఎక్కువగా మందిలో మెడ నొప్పి వస్తుంది. వృద్ధాప్యం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల వల్ల సంభవించవచ్చు.

4. Myofascial పెయిన్ సిండ్రోమ్ - Myofascial నొప్పి సిండ్రోమ్ అనేది మెడ కండరాలు, ఫాసియాను ప్రభావితం చేసే దీర్ఘకాలిక నొప్పి పరిస్థితి. Myofascial నొప్పి సిండ్రోమ్ మానిఫెస్ట్ ప్రభావం వల్ల ఎగువ వెనుక, మెడ, భుజాలు, ఛాతీ భాగాల్లో నొప్పి వస్తుంటుంది. ఆకస్మిక కదలికలు, కండరాల ఒత్తిడి, కండరాలకు గాయాలు, పేలవమైన భంగిమ వలన ఇది సంభవించవచ్చు.

5. సర్వైకల్ స్పాండిలోసిస్ - స్పాండిలోసిస్‌ అనేది వెన్నెముకలో ఏర్పడే సమస్య. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్‌. మెడ భాగంలో వచ్చే నొప్పిని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌గా, నడుము భాగంలో వస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌గా పిలుస్తారు.

తదుపరి వ్యాసం