తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sattu Drink | శరీరంలోని కొవ్వును కరిగించి, సత్తువని పెంచే పానీయం ఇది, రోజూ ఉదయాన్నే తాగాలి!

Sattu Drink | శరీరంలోని కొవ్వును కరిగించి, సత్తువని పెంచే పానీయం ఇది, రోజూ ఉదయాన్నే తాగాలి!

HT Telugu Desk HT Telugu

02 May 2023, 9:56 IST

    • Sattu Drink To Lower Cholesterol: సత్తు పానీయంను తాగటం వలన అధిక కొవ్వును కరిగించుకోవచ్చు. సత్తు పానీయం ఎలా తయారు చేయాలి? తాగితే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
Sattu Drink To Lower Cholesterol
Sattu Drink To Lower Cholesterol (Slurrp)

Sattu Drink To Lower Cholesterol

Sattu Drink: ఈరోజుల్లో అధిక కొలెస్ట్రాల్ (High Cholesterol) సమస్య చాలా మందిని వేధిస్తుంది. నిశ్చలమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీని వెనక ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి ఎక్కువ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది ఊబకాయం, గుండెజబ్బులకు దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందులో భాగంగా అధిక కొలెస్ట్రాల్ సమస్యను కలిగి ఉన్నవారు ఉదయం పూట సత్తు పానీయంను తాగటం వలన అధిక కొవ్వును కరిగించుకోవచ్చు. సత్తు పానీయంలో కొన్ని సబ్జా గింజలను కలుపుకొని, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగటం (Drink on Empty stomach) ద్వారా రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

How To Make Sattu Drink- సత్తు పానీయం ఎలా తయారు చేయాలి?

సత్తు పానీయం అంటే సత్తుపిండిని నీటిలో కలిపి చేసే పానీయం. సాధారణంగా శనగపప్పు లేదా పుట్నాల పప్పును తేలికగా వేయించి సత్తుపిండిని తయారు చేస్తారు. జీడిపప్పు, బాదం, మిల్లెట్, బార్లీ, చిక్‌పీలను కూడా దోరగా వేయించి, సన్నటి పిండిగా రుబ్బి సత్తు తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని నీటిలో కలిపి, రుచికోసం కొద్దిగా బెల్లం, నల్ల ఉప్పును కలిపితే సత్తు పానీయం రెడీ. అయితే కొలెస్ట్రాల్ తగ్గించే పానీయం తయారు చేసేటపుడు చిన్న మార్పు చేసుకోవాలి. అది ఇక్కడ చూడండి

ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ సత్తు వేయాలి, ఆపై అందులో 1 టీస్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా నల్ల ఉప్పు, ఆపైన నిమ్మరసం పిండి, బాగా మిక్స్ చేసి తాగాలి. మీ డ్రింక్ రెడీ. దీనిని రోజులో ఎప్పుడైనా సేవించవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో సేవిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

Benefits of Sattu Drink- సత్తు పానీయం తాగితే ప్రయోజనాలు

ప్రతిరోజూ సత్తు పానీయం తాగటం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన మూడు ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగులలో చెడు కొవ్వు లిపిడ్‌లను కలిగి ఉండటం తరచుగా కనిపిస్తుంది. ఈ చెడు కొవ్వు లిపిడ్‌లను తగ్గించడంలో సత్తు పానీయం సహాయపడుతుంది.

జీవక్రియను వేగవంతం చేస్తుంది: మీరు తిన్న ఆహారంలొ కొవ్వు ఎక్కువ ఉంటే జీవక్రియ (Metabolism) ఆలస్యం అవుతుంది. అయితే సత్తు పానీయంలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. కొవ్వును వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది, తద్వారా అదనపు కొవ్వు శరీరంలో నిల్వ కాదు.

ధమనులను శుభ్రపరుస్తుంది: సత్తు పానీయంలోని ఔషధ గుణాలు రక్త నాళాలను శుభ్రపరచడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఒక స్క్రబ్‌ లాగా పనిచేస్తాయి. దీనివల్ల బీపీ పెరగదు, గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.

తదుపరి వ్యాసం