తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Christmas Gift Ideas: క్రిస్మస్ కి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వండి మీ వాళ్ళు ఫిదా అయిపోతారు

Christmas gift ideas: క్రిస్మస్ కి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వండి మీ వాళ్ళు ఫిదా అయిపోతారు

Gunti Soundarya HT Telugu

14 December 2023, 9:13 IST

    • Christmas gift: ఈ క్రిస్మస్ కి మీ బంధువులకు, స్నేహితులకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి. సంతోషంగా పండుగ వేడుక జరుపుకోండి. 
క్రిస్మస్ గిఫ్ట్ ఐడియాలు
క్రిస్మస్ గిఫ్ట్ ఐడియాలు (pexels)

క్రిస్మస్ గిఫ్ట్ ఐడియాలు

Christmas gift: క్రిస్మస్ పండుగ అనగానే అందరూ చాలా సంతోషిస్తారు. నెల ముందు నుంచి క్రిస్మస్ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీలు, ఇంటి ముందర స్టార్స్ పెట్టుకుని ఇంటికి లైటింగ్ వేసుకుని అందంగా అలంకరించుకుంటారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకి గిఫ్ట్ ఇచ్చి వారి పట్ల మీకున్న ప్రేమ, కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తారు.

శాంతా క్లాజ్ మాదిరిగా డ్రెస్ వేసుకుని మీవాళ్ళకి బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తారు. అందరూ ఒకచోట చేరి కేక్ కట్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది క్రిస్మస్ కి మీరు మీ ప్రియమైన వారికి మీరు బహుమతులు ఇవ్వాలని అనుకుంటున్నారా ?ఇలాంటివి తీసుకోవాలో అర్థం కావడం లేదా అయితే సింపుల్ బడ్జెట్లో దొరికే ఈ గిఫ్ట్స్ ఇచ్చిమీ ప్రేమని వారికి తెలియజేయండి.

స్కార్ఫ్

వింటర్ సీజన్లో మంచు ఎక్కువగా పడుతూ ఉంటుంది. అందుకే వారి అవసరానికి ఉపయోగపడే విధంగా వారికి స్కార్ఫ్ బహుమతిగా ఇవ్వండి. వీటిని ఏ దుస్తులతో అయినా పెయిర్ చేసుకుని వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ఇవి మహిళలకు మాత్రమే కాదు జెంట్స్ కూడా ఉంటాయి. యూనిసెక్స్ స్కార్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయ. మగవారు వీటిని వేసుకోవచ్చు. స్కార్ఫ్ వేసుకోవడం వల్ల వారి అందం మరింత రెట్టింపు అవుతుంది.

స్వెటర్స్

వింటర్ సీజన్ లో క్రిస్మస్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి స్వెటర్ గిఫ్టుగా ఇస్తే చాలా బాగుంటుంది. వీటిని ధరించిన ప్రతిసారి మిమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. స్వెటర్ వేసుకుని వారికోసం హుడిలు కూడా తీసుకోవచ్చు. చలికాలంలో స్వెటర్లు ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో పాటు మిమ్మల్ని వెచ్చగా ఉంచుతాయి. వీటిని ఎవరికైనా గిఫ్ట్ గా ఇస్తే వాళ్ళు వద్దనకుండా తీసుకుంటారు. ఇవి వేసుకున్న ప్రతిసారి మీ ప్రియమైన వాళ్లు మీపట్ల చూపించే ప్రేమ గుర్తుకు వస్తుంది.

శాంతా క్లాజ్ డ్రెస్

పిల్లల నుంచి పెద్దవారు వరకు క్రిస్మస్ తాత అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. తెలుపు ఎరుపు రంగులతో స్మూత్ గా ఉండే శాంత క్లాజ్ డ్రెస్ అంటే అందరికీ ఇష్టమే. మీరు బహుమతి ఇవ్వాలనుకున్న వారి ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వారికి శాంతా క్లాజ్ డ్రెస్ కొని గిఫ్ట్ గా ఇవ్వండి. వాటిని చూడగానే పిల్లలు చాలా సంబరపడిపోతారు. అవి వేసుకుంటే పిల్లలు చాలా క్యూట్ గా కనిపిస్తారు. మెత్తగా ఉండటం వల్ల ఇవి వేసుకున్న కూడా పిల్లల స్కిన్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

క్రిస్మస్ చెట్టు

క్రిస్మస్ నెల ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండేది క్రిస్మస్ చెట్టు. మాల్స్ తో సహా అనేక బహిరంగ ప్రదేశాలలో కూడా క్రిస్మస్ చెట్టుని పెట్టి వాటిని బాల్స్, రకరకాల వస్తువులతో లైటింగ్ వేసి అందంగా డెకరేట్ చేస్తారు. మీ ప్రియమైన వారికి బహుమతి ఇవ్వాలని అనుకుంటే క్రిస్మస్ చెట్టుని ఇవ్వచ్చు. దీన్ని ఇంటికి తీసుకురావడం వల్ల అదృష్టం వస్తుంది. మీ మీద గౌరవంగా పెరుగుతుంది. అంతేకాదు మీ బంధువుల ఇంటిని మీరు మరింత అందంగా మార్చిన భావన మీకు చాలా సంతృప్తినిస్తుంది.

హ్యాపీ టైమ్

అన్నింటికంటే విలువైనది మీ ప్రియమైన వారితో కొద్ది సేపు సమయం గడపడం. ఇది ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కలగని సంతోషం మీతో సమయం గడిపితే ఆనందంగా ఉంటారు. అది ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకం. వారితో కలిసి విందు చేసుకుని కేక్ కట్ చేసుకుంటే సంతోషంగా ఉంటారు.

సువాసన క్యాండిల్స్

మంచి సువాసన వచ్చే క్యాండిల్స్ గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. అవి వెలిగించినప్పుడు ఇల్లంతా అద్భుతమైన సువాసన వస్తుంది. మనసుకి రిలాక్స్ గా ఉంటుంది. లావెండర్, గులాబీ వంటి అనేక సువాసన కలిగిన క్యాండిల్స్ మంచి ఎంపిక. ఒత్తిడిని దూరం చేస్తాయి. మీ ఫ్రెండ్స్ కి డైరీ లేదా ప్లానర్ ఇవ్వవచ్చు. రోజు వారి పనులు గుర్తు చేసేందుకు, చేసిన పనులు గురించి అందులో రాసుకుంటే అది గొప్ప జ్ఞాపకంగా అవుతుంది.

తదుపరి వ్యాసం