తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Mango Ice Cream | ఇలా చేసుకుంటే చాలు.. కూల్ కూల్​ మ్యాంగో ఐస్​ క్రీమ్ రెడీ

Mango Ice Cream | ఇలా చేసుకుంటే చాలు.. కూల్ కూల్​ మ్యాంగో ఐస్​ క్రీమ్ రెడీ

08 March 2022, 15:08 IST

    • ఆహార ప్రియులకు వేసవి కాలం అంటే గుర్తొచ్చేది మామిడి పండ్లు. నోరూరించే మామిడి పండ్లు ఎన్ని తిన్నా తనివి తీరదు అనిపించడం సహజమే. మామిడి పండ్ల కోసం సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు కూడా ఉన్నారు. అంత క్రేజు ఉంటుంది మరి వాటికి. అలాంటి మామిడి పండ్లతో ఐస్​క్రీం రెడీ చేసుకుంటే సమ్మర్​ అంతా కూల్​ కూల్​గా గడిచిపోతుంది.
మ్యాంగో ఐస్ క్రీమ్
మ్యాంగో ఐస్ క్రీమ్

మ్యాంగో ఐస్ క్రీమ్

Mango Ice Cream | వచ్చేది వేసవి కాలం. మామిడి పండ్లు, ఐస్​క్రీం సమ్మర్​లో డెడ్లీ కాంబినేషన్. అదే మామిడిపండుతోనే.. అది కూడా ఇంట్లోనే ఐస్​ క్రీం తయారు చేసుకుంటే ఆ తృప్తి మరెక్కడదా దొరకదు. మండుటెండలో ఇంటికి వచ్చినా.. ఇంటికి వచ్చిన అతిథులకు ఇది వడ్డించినా.. మీకు పొగడ్తలు తప్పవు అనమాట. కానీ మాకు మామిడి పండ్లతో ఐస్​క్రీం చేయడం రాదు అనుకుంటున్నారా? అస్సలు మీరు ఇలా బాధపడకండి.. ఈ రెసిపీని చూసి.. మీరు తయారు చేసి.. ఇష్టమైనవారికి చల్లగా వడ్డించేయండి.

ట్రెండింగ్ వార్తలు

Rice For Long Time : బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు

Chanakya Niti Telugu : భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే ఈ సమస్యలు వస్తాయి

Fruits for Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Oats Egg Omelette : ఓట్స్ ఎగ్ ఆమ్లెట్.. మీ అల్పాహారాన్ని ఆరోగ్యకరంగా మార్చగలదు

కావాల్సిన పదార్ధాలు

*2 మామిడి పండ్లు- ముక్కలుగా కోసి పెట్టుకోవాలి

*మిల్క్ పౌడర్- మూడు టేబుల్ స్పూన్లు

*నీళ్లు-పావు కప్పు

*క్రిమ్- ఒకటిన్నర కప్పు

*చక్కెర- 3 టేబుల్ స్పూన్ (పొడిచేసి పెట్టుకోవాలి)

*మిల్క్ మెయిడ్ -2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం

ముందుగా మామిడి పండ్లు ముక్కలను బ్లెండర్​లో తీసుకోవాలి. దానిలో మిల్క్​పౌడర్, నీళ్లు వేసి మిక్సి చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో విప్పింగ్ క్రిమ్​ తీసుకుని.. స్మూత్​గా వచ్చే వరకు కలపాలి. దానిలో మామిడి పండ్లతో చేసిన మిశ్రమాన్ని, చక్కెర పొడిని వేసి బాగా కలపండి. దానిలో మిల్క్ మెయిడ్ వేసి పూర్తిగా మిక్స్ అయ్యేవరకు కలిపేయాలి. దీనిని ట్రేలోకి తీసుకుని.. మధ్యలో మామిడి పండ్ల ముక్కలు వేయాలి. దీనిని ఫ్రీజర్​లో ఉంచుకోవాలి. మామిడిపండ్ల ముక్కలతో దీనిని సర్వ్ చేసుకుంటే సరి.

తదుపరి వ్యాసం