తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sony Bravia Xr 85x95k । రూ. 7 లక్షల ధరతో విడుదలైన సోనీ స్మార్ట్ టెలివిజన్!

Sony Bravia XR 85X95K । రూ. 7 లక్షల ధరతో విడుదలైన సోనీ స్మార్ట్ టెలివిజన్!

HT Telugu Desk HT Telugu

17 August 2022, 15:24 IST

    • సోనీ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీ Sony Bravia XR 85X95K 4K Mini LED TV విడుదలైంది. దీని ధర రూ. 7 లక్షలు. స్క్రీన్ సైజ్ 85 అంగుళాలు. ప్రత్యేకతలు చూడండి.
Sony Bravia XR 85X95K smart TV
Sony Bravia XR 85X95K smart TV

Sony Bravia XR 85X95K smart TV

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ ఇండియా తమ బ్రాండ్ నుంచి ఒక కొత్త ప్రీమియం రేంజ్ స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. సోనీ బ్రావియా XR X95K మినీ LED సిరీస్ క్రింద ఈ సరికొత్త టెలివిజన్‌ని విడుదల చేసింది. 85 అంగుళాలు (216 cm ) స్క్రీన్ సైజ్ పరిమాణంలో వచ్చిన ఈ టీవీ ధర రూ. 6,99,990/- . దేశవ్యాప్తంగా అన్ని సోనీ సెంటర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లు అలాగే ఇ-కామర్స్ పోర్టల్‌లలో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

Sony Bravia XR 85X95K టెలివిజన్ కాగ్నిటివ్ ప్రాసెసర్ XRతో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ ద్వారా యూజర్లు తాము ఎక్కువగా వీక్షించే లేదా వినే విధానానికి అనుగుణంగా కంటెంట్‌ను అందిస్తుంది. ఈ టీవీ XR బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ టెక్నాలజీతో కూడిన 4K మినీ LED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే XR OLED మోషన్ క్లారిటీతో కూడా వస్తుంది. ఈ క్రమంలో తక్కువ ఇమేజ్ క్వాలిటీ కూడా ఈ టీవీ స్క్రీన్ మీద దృశ్యం అద్భుతమైన క్లారిటీతో కనిపిస్తుంది.

IMAX వీక్షణ అనుభూతి

స్క్రీన్ అంతటా కాంతి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసే టెక్నాలజీ ఉంటుంది. ఒక బిలియన్ కంటే ఎక్కువ రంగులను యాక్సెస్ చేయగలదు. ఈ ప్రకారంగా ఈ టీవీలో కనిపించే ప్రతి దృశ్యం సూక్ష్మమైన వివరాలతో వాస్తవికంగా కనిపిస్తుంది.

BRAVIA XR TVs మూవీ సర్వీస్‌లో భాగంగా ఈ టీవీలో BRAVIA కోర్ అనే యాప్ ప్రీ-లోడెడ్ గా వస్తుంది. ఈ యాప్ ద్వారా గరిష్టంగా 5 లేటెస్ట్ రిలీజ్ సినిమాలు, క్లాసిక్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను చూడవచ్చు. 12 నెలల పాటు అపరిమిత చలనచిత్రాలను విడుదల చేసుకోవచ్చు. ఇందులోని BRAVIA XR సాంకేతికతతో IMAX వీక్షణ అనుభూతి పొందవచ్చు. ఇంకా XR కాంట్రాస్ట్ బూస్టర్, అకౌస్టిక్ సర్ఫేస్ ఆడియో ప్లస్ వంటి Sony సిగ్నేచర్ ఫీచర్‌లను కలిగి ఉంది.

Sony Bravia XR 85X95K టీవీలో గేమింగ్ కోసం, టీవీ HDMI 2.1 పోర్ట్‌ను కలిగి ఉంది. ఇది హై-ఎండ్ సోనీ ఫ్లాగ్‌షిప్ టీవీ కావడంతో, సహజంగా 120Hz వద్ద 4K గేమింగ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR), ఆటో తక్కువ లేటెన్సీ మోడ్ (ALLM), ఆటో HDR టోన్ వంటివి ఆటో గేమ్ మోడ్‌కు సపోర్ట్ చేస్తాయి.

తదుపరి వ్యాసం