తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Republic Day Special Tricolor Pasta : గణతంత్ర దినోత్సవం స్పెషల్.. త్రివర్ణ రంగులు కలిగిన పాస్తాను తినేయండి..

Republic Day Special Tricolor Pasta : గణతంత్ర దినోత్సవం స్పెషల్.. త్రివర్ణ రంగులు కలిగిన పాస్తాను తినేయండి..

26 January 2023, 6:00 IST

    • Republic Day Special Tricolor Pasta : రిపబ్లిక్ డే సందర్భంగా మీ పిల్లల కోసం.. లేదా మీకోసం ఏదైనా త్రివర్ణ రంగుల్లో ఉండే డిష్ చేయాలనుకుంటే మీరు త్వివర్ణ రంగులు కలిగిన పాస్తాను ట్రై చేయవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం.
త్రివర్ణ రంగుల పాస్తా
త్రివర్ణ రంగుల పాస్తా

త్రివర్ణ రంగుల పాస్తా

Republic Day Special Tricolor Pasta : పిల్లల గురించి తెలిసిందేగా. ఏదైనా వారికి తినిపించాలంటే అది వారికి ఇంట్రెస్టింగ్​గా కనిపించాలి. అప్పుడే వారు దానిని ఇష్టంగా తింటారు. అయితే వారికి రిపబ్లిక్​ డే రోజు.. కొత్తగా ఏదైనా తినిపించాలంటే.. మీరు త్రివర్ణ రంగులు కలిగిన పాస్తాను ట్రై చేయండి. వారికి మీరు గణతంత్ర దినోత్సవం గురించి వివరిస్తూ.. ఈ డిష్​ను తినిపించేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కావాల్సిన పదార్థాలు

* పాస్తా - 200 గ్రాములు

* బ్రోకలీ - 1 కప్పు

* క్యారెట్ (మీడియం) - 1 (చిన్నగా కట్ చేసుకోవాలి)

* గ్రీన్ ఆనియన్స్ - 1/2 కప్పు

* బటర్ - 1/4 కప్పు

* వెల్లుల్లి - 3 రెబ్బలు (చిన్నగా కట్ చేసుకోవాలి)

* తులసి ఆకు (డ్రై) - 1 టేబుల్ స్పూన్

* ఉప్పు - రుచికి తగినంత

* పెప్పర్ - 1/4 టీస్పూన్

* వైట్ వైన్ - 1/4 కప్పు

* చీజ్ - 1/4 కప్పు

తయారీ విధానం

ఒక పెద్ద గిన్నెలో నీటిని మరిగించండి. దానిలో ఉప్పు, పాస్త వేసి 8-10 నిమిషాలు ఉడికించండి. దానిలోని నీటిని వడబోసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు పెద్ద పాన్ తీసుకుని.. దానిలో బ్రోకలీ, క్యారెట్, ఉల్లిపాయలను వేసి.. వెన్నలో 3 నిమిషాలు ఉడికించాలి. వెల్లుల్లిని కూడా వేయించండి. మూతపెట్టి మరో 2 నిమిషాలు ఉడికించాలి. దానిలో పాస్త వేసి బాగా కలపండి. అనంతరం వైట్ వైన్ వేసి కలిపి.. దానిపై చీజ్ వేసి.. దించేయండి. అంతే వేడి వేడి పాస్తా మీరు తినడానికి సిద్ధంగా ఉంది.

తదుపరి వ్యాసం