తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vastu | ఇంట్లో పదే పదే సమస్యలా? ఈ వస్తువులను తొలగించండి

Vastu | ఇంట్లో పదే పదే సమస్యలా? ఈ వస్తువులను తొలగించండి

11 March 2022, 7:50 IST

    • వాస్తు ఆధారంగా సంతోషం, సంపద కలుగుతాయని నమ్ముతారు. అయితే కొన్నిసార్లు వాస్తు అంతా సరిగ్గానే ఉన్నప్పటికీ ఇంట్లో పదే పదే ఆర్థిక, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. వాస్తుదోషం వల్ల అలా జరగవచ్చు. ముఖ్యంగా కొన్ని వస్తువుల వల్ల ఇంట్లో ప్రతికూలతలు మొదలవుతాయి. వీలైనంత త్వరగా వాటిని తొలగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
వాస్తు
వాస్తు (Unsplash)

వాస్తు

మనదేశం ఎన్నో శాస్త్రాలకు పుట్టినిల్లు. అందులో వాస్తుశాస్త్రం కూడా ఒకటి. అయితే వాస్తును ఓ సంప్రదాయంలా కాకుండా సైన్స్‌లా చూస్తే ఎన్నో విషయాలు అవగతమవుతాయి. ముఖ్యంగా ఇంటిని వాస్తు ప్రకారం డిజైన్ చేసుకుంటే సంతోషం, ఆరోగ్యం, అదృష్టానికి కొరతనేదే ఉండదు. చైనీయులు ఫెంగ్ షూయ్ వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. మనదేశంలోని వాస్తుశాస్త్రానికి, దీనికి ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇక్కడ హిందూ సంప్రదాయానికి అనుగుణంగా వాస్తుశాస్త్రాన్ని అనుసరిస్తారు. దీని ఆధారంగా సంతోషం, సంపద కలుగుతాయని నమ్ముతారు. అయితే కొన్నిసార్లు వాస్తు అంతా సరిగ్గానే ఉన్నప్పటికీ ఇంట్లో పదే పదే ఆర్థిక, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. వాస్తుదోషం వల్ల అలా జరగవచ్చు. ముఖ్యంగా కొన్ని వస్తువుల వల్ల ఇంట్లో ప్రతికూలతలు మొదలవుతాయి. వీలైనంత త్వరగా వాటిని తొలగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Night Time Ice Cream : రాత్రిపూట ఐస్‌క్రీమ్ తినడం రొమాంటిక్ అనుకోకండి.. మెుత్తం ఆరోగ్యం మటాష్!

Walking Without Footwear : కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు.. ఎందుకని ఆలోచించారా?

Cucumber Lassi Benefits : దోసకాయ లస్సీ.. 5 నిమిషాల్లో రెడీ.. శరీరాన్ని చల్లబరుస్తుంది

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

యుద్ధం, పోరాటాలను ప్రతిబింభించే చిత్రాలు..

రామాయణ, మహాభారతాలకు చెందిన చిత్రాలను ఇంటి గోడలకు తగిలించుకోవడం చాలా మందికి అలవాటు. అయితే వాటిలో యుద్ధాలు, పోరాటాలు కలిగిన ఫోటోలు ఉంటే వీలైనంత త్వరగా తొలగిస్తే మంచిది. ఎందుకంటే ఈ చిత్రాలు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వైరాన్ని పెంచుతాయి.

కాక్టస్ లేదా ముళ్ల మొక్కలు..

మీ ఇంట్లో కాక్టస్ జాతికి చెందిన ముళ్ల ముక్కలను ఎప్పుడూ పెంచకూడదు. గులాబీ మినహా మిగిలిన ఏ మొక్కలైనా ఉంటే వెంటనే తొలగించాలి. వీటితో పాటు పూలు, పండ్లు లేని చెట్ల చిత్రాలు, మునిగిపోతున్న పడవ లేదా ఓడ, బంధించిన ఏనుగులు, విచారంగా ఉన్న వ్యక్తులు లాంటి ప్రతికూలతలను ప్రేరేపించే చిత్రాలను తీసివేయాలి.

తాజ్‌మహల్..

షోపీస్ కోసం తాజ్‌మహల్‌ను ఇంట్లో ఉంచినట్లయితే వీలైనంత త్వరగా తొలగించడం మంచిది. ఎందుకంటే తాజ్‌మహల్ ఎంత అందంగా ఉన్నప్పటికీ అది ఒక సమాధి. మరణం, నిర్జీవానికి సంకేతం. వాస్తవానికి ప్రజలు దీన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఈ ఫొటోను ఉంచకూడదు. ఎందుకంటే ఇలాంటివి మన జీవితాలను లోతుగా ప్రభావితం చేస్తాయి.

జంతువుల చిత్రాలు లేదా విగ్రహాలు..

పందులు, పాములు, గాడిదలు, డేగలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, రాబందులు, పావురాలు, కాకులు లాంటి జంతు, పక్షుల చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు. వాస్తుప్రకారం పడకగదిలో వీటిని అస్సలు ప్రదర్శించకూడదు. అంతేకాకుండా క్రూరత్వాన్ని సూచించే ఏ వన్య ప్రాణుల చిత్రపటాలూ ఉండకూడదు. ఎందుకంటే హింసాత్మక ప్రవృత్తిని సూచిస్తాయి.

విరిగిన విగ్రహాలు, గాజులు..

విరిగిన లేదా పగిలిన విగ్రహాలు, గాజాలు, అద్దాలు మీ ఇంట్లో ఉన్నట్లయితే వీలైనంత త్వరగా వాటిని తొలగించాలి. ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని ప్రేరేపిస్తాయి. వీటితో పాటు శివునికి మరో రూపమైన నటరాజ విగ్రహాన్ని ఉంచకూడదు. ఎందుకంటే నటరాజ స్వామిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒక్క గొప్ప కళాత్మక రూపమైతే, మరోకటి తాండవం చేస్తున్న శివుని ఉగ్రరూపానికి ప్రతీకగా చెప్పవచ్చు. కాబట్టి షోపీస్‌గా నటరాజ స్వామి విగ్రహం లేదా చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు.

తదుపరి వ్యాసం